MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Love Marriage: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!

Love Marriage: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!

Love Marriage: ప్రేమ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదా? కంగారుపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. వాళ్ల నమ్మకాన్ని గెలుచుకునే కొన్ని స్మార్ట్ మార్గాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే మీ పేరెంట్స్ మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు ఎక్కువ. మరి లేటేందుకు చూసేయండి.

3 Min read
Author : Kavitha G
Published : Aug 10 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ప్రేమను పెళ్లిగా మార్చే సీక్రెట్ టిప్స్
Image Credit : Gemini AI

ప్రేమను పెళ్లిగా మార్చే సీక్రెట్ టిప్స్

ప్రేమించిన వాళ్లనే పెళ్లి చేసుకోవాలని లవ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ, ఇంట్లో వాళ్లు ఒప్పుకోరేమోనన్న భయం చాలామందిలో ఉంటుంది. మరోపక్క కుటుంబం, బంధువులు, సమాజం, పరువు, ఆర్థిక విషయాలు.. ఇలా చాలా అంశాలను తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. అందుకే ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడటం పెద్ద సవాలుగా మారుతుంది. కానీ, ఆవేశపడి నిర్ణయాలు తీసుకునే బదులు, కొన్ని తెలివైన పద్ధతులు పాటిస్తే తల్లిదండ్రుల మనసు మార్చే అవకాశం పెరుగుతుంది. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
భవిష్యత్ ప్లాన్ గురించి చెప్పడం
Image Credit : Chat GPT

భవిష్యత్ ప్లాన్ గురించి చెప్పడం

తల్లిదండ్రుల అతిపెద్ద ఆందోళన ఏంటంటే.. వీళ్లు పెళ్లి చేసుకుని సంసారాన్ని ఎలా నెట్టుకొస్తారు? అని. అందుకే, ప్రేమ గురించి పదే పదే చెప్పే బదులు, మీ జీవితాన్ని మీరు బాధ్యతగా నడపగలరని ముందు నిరూపించుకోవాలి. ఉద్యోగం, సంపాదన, పొదుపు, భవిష్యత్ ప్రణాళిక, కుటుంబ బాధ్యతలు వంటి విషయాల్లో మీరు స్పష్టంగా ఉంటే తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుంది. 'మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నాం' అని చెప్పడం కంటే, 'మా భవిష్యత్తును ఇలా ప్లాన్ చేసుకున్నాం' అని మాట్లాడితే మీ మాటకు ఎక్కువ విలువ ఉంటుంది.

37
సరైన సమయంలో మాట్లాడటం
Image Credit : Gemini AI

సరైన సమయంలో మాట్లాడటం

ప్రేమ పెళ్లి గురించి మాట్లాడటానికి సరైన సమయం కూడా ముఖ్యం. తల్లిదండ్రులు ఇప్పటికే కోపంగా, ఒత్తిడిలో లేదా ఏదైనా కుటుంబ సమస్యలో ఉన్నప్పుడు ఈ విషయం చెప్తే, వ్యతిరేక సమాధానం వచ్చే అవకాశం ఎక్కువ. ప్రశాంతమైన సమయం చూసుకుని, ముందుగా ఒక్కరితోనే మాట్లాడటం మంచి పద్ధతి. మీతో చనువుగా ఉండే అమ్మ, నాన్న లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని ఎంచుకుని, ముందుగా వాళ్లతో మీ మనసులోని మాట చెప్పాలి. మొదటి సంభాషణలోనే పెళ్లికి ఒప్పించాలని చూడకుండా, నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి.. అని మొదలుపెడితే పరిస్థితి కాస్త తేలికపడుతుంది.

47
ప్రేమించే వ్యక్తి గురించి నిజాలు దాచొద్దు
Image Credit : AI

ప్రేమించే వ్యక్తి గురించి నిజాలు దాచొద్దు

తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుంటామనే పద్ధతి వాళ్ల భయాన్ని మరింత పెంచుతుంది. దానికి బదులుగా, మీరు ప్రేమించే వ్యక్తి చదువు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యం, గుణం, భవిష్యత్ ప్రణాళిక వంటి వివరాలను దాచకుండా చెప్పాలి. తల్లిదండ్రులు అడగబోయే ప్రశ్నలకు ముందే సమాధానాలు సిద్ధం చేసుకోవడం మంచిది. మీరు ప్రేమించిన వ్యక్తి ఉద్యోగం, సంపాదన ఎలా ఉంది? కుటుంబ నేపథ్యం ఏంటి? భవిష్యత్ జీవితంపై ప్రణాళిక ఏంటి? ఇద్దరూ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? పెళ్లి తర్వాత తల్లిదండ్రులతో సంబంధం ఎలా ఉంటుంది? వీటికి స్పష్టమైన సమాధానాలు ఉంటే, ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు అనే నమ్మకం తల్లిదండ్రులకు కలుగుతుంది.

57
నమ్మకమైన మధ్యవర్తి సాయం తీసుకోవడం
Image Credit : AI

నమ్మకమైన మధ్యవర్తి సాయం తీసుకోవడం

కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పే మాటలను వెంటనే అంగీకరించకపోవచ్చు. కానీ, వాళ్లు గౌరవించే బంధువు లేదా ఫ్యామిలీ ఫ్రెండ్ అదే విషయాన్ని ప్రశాంతంగా చెప్తే వాళ్ల మనసు మారే అవకాశం ఉంది. అందుకే, రెండు కుటుంబాలకు దగ్గరైన, నిదానంగా మాట్లాడగలిగే ఒకరిని ఎంచుకుని వారి సహాయం తీసుకోవాలి. కానీ, ఒకేసారి చాలామంది బంధువులను ఇందులో ఇన్వాల్వ్ చేయడం అనవసరమైన ఒత్తిడిని సృష్టిస్తుంది.

67
బెదిరింపులు వద్దు
Image Credit : ChatGPT

బెదిరింపులు వద్దు

చాలామంది ప్రేమికులు చేసే తప్పు ఏంటంటే.. మీరు ఒప్పుకోకపోయినా నేను పెళ్లి చేసుకుంటా, ఇల్లు వదిలి వెళ్లిపోతా వంటి మాటలు మాట్లాడుతుంటారు. ఆ సమయంలో ఇలాంటి మాటలు తల్లిదండ్రుల భయాన్ని, వ్యతిరేకతను మరింత పెంచుతాయి. దానికి బదులుగా, మీ ఆశీర్వాదంతోనే ఈ పెళ్లి జరగాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పడం బంధాన్ని కాపాడుతుంది. తల్లిదండ్రులకు కొంత సమయం కావాలంటే ఇవ్వడం కూడా అవసరం.

77
వీటిని ముందే మాట్లాడుకోవడం మంచిది
Image Credit : AI Generated

వీటిని ముందే మాట్లాడుకోవడం మంచిది

ప్రేమలో ఒకరినొకరు ఇష్టపడితే చాలు.. కానీ, పెళ్లి జీవితానికి చాలా విషయాలు అవసరం. డబ్బు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత హద్దులు, పిల్లల భవిష్యత్ ప్రణాళిక, ఇరు కుటుంబాలతో సంబంధాలు.. ఇలా చాలా అంశాలను ముందే మాట్లాడుకోవడం మంచిది. తల్లిదండ్రుల వ్యతిరేకతను బద్దలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకోవడం కంటే, వాళ్ల భయాలను అర్థం చేసుకుని వాటికి సమాధానం ఇవ్వడమే తెలివైన పద్ధతి.

ముఖ్యంగా… ప్రేమ పెళ్లికి తల్లిదండ్రుల సమ్మతిని పొందడంలో తొందరపాటు, బెదిరింపులు, అబద్ధాలు లేదా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ వంటివి దీర్ఘకాలంలో సమస్యలను సృష్టిస్తాయి. దానికి బదులు, బాధ్యత, పారదర్శకత, ఓర్పు, గౌరవంతో సంప్రదిస్తే తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందే అవకాశం పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rani Haram: ఒక్క రాణి హారం చాలు.. ఎవరైనా మహారాణిలా మెరిసిపోతారు
Recommended image2
Cumin: ఇంట్లో కుండీలోనే జీలకర్ర ఎలా పెంచాలో తెలుసా?
Recommended image3
Flax Seeds: ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసెగింజలు తింటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Parenting: పిల్లలకు రోజుకో కథ చెప్తే వారిలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం మీపై క్రష్ ఉన్న వాళ్లు అనుకోకుండా చేసే 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved