MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Mango Storage Tips : మామిడి పండ్లు కుళ్లిపోతున్నాయా..? ఇలా చేస్తే 15 రోజులైనా తాజాగా ఉంటాయి

Mango Storage Tips : మామిడి పండ్లు కుళ్లిపోతున్నాయా..? ఇలా చేస్తే 15 రోజులైనా తాజాగా ఉంటాయి

ఎంత ఇష్టపడి కొన్న మామిడి పండ్లు తినకుండా దాచిపెడితే వెంటనే పాడైపోతున్నాయా..? అయితే మామిడి పండ్లను 15 రోజుల వరకు తాజాగా, పాడవకుండా నిల్వ ఉండాలంటే ఈ సూపర్ టిప్స్, నిపుణుల సలహాలు పాటించండి. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 16 2026, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మామిడి పండ్లు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి..?
Image Credit : Chta GPT

మామిడి పండ్లు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి..?

వేసవి వచ్చిందంటే చాలు… ఇళ్లంతా మామిడి పండ్ల సువాసనతో నిండిపోతుంది. చాలామంది రూ.100-200 కు కిలో అయినా సరే ఎంతో ఇష్టపడి ఈ పండ్లను కొంటారు. కానీ మామిడి పండ్లు ఓ రెండ్రోజులు కూడా నిల్వ ఉండవు… తినడం కాస్త ఆలయస్యమయ్యిందా మెత్తబడి కుళ్లిపోతాయి. ఇలా ఇష్టంగా కొన్న పండ్లు పాడయిపోతే బాధగా ఉంటుంది.

అయితే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్లే మామిడి పండ్లు వాటి రుచిని, నాణ్యతను కోల్పోతాయి. మరి మామిడి పండ్లను 10-15 రోజుల వరకు తాజాగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కొనేటప్పుడు జాగ్రత్త..
Image Credit : Getty

కొనేటప్పుడు జాగ్రత్త..

చాలామంది పూర్తిగా పండిన, మెత్తటి పండ్లనే ఎంచుకుంటారు. కానీ కొనేటప్పుడు కొద్దిగా దోరగా లేదా కాస్త గట్టిగా ఉన్న పండ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఇవి ఇంట్లో నెమ్మదిగా పండుతాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కొనేటప్పుడు పండు మీద ఎలాంటి నల్ల మచ్చలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

Related Articles

Related image1
Mango Benefits : మామిడి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Related image2
Mango: మామిడి పండ్లు ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?
36
 పండిన పండ్లు, కాయలు ఒకేచోట ఉంచొద్దు..
Image Credit : Getty

పండిన పండ్లు, కాయలు ఒకేచోట ఉంచొద్దు..

బాగా పండిన మామిడి పండ్లు సహజంగా 'ఇథిలీన్' అనే గ్యాస్‌ను విడుదల చేస్తాయి. ఇది కాయలు త్వరగా పక్వానికి రావడానికి సహాయపడుతుంది. అందుకే పూర్తిగా పండిన మామిడి పండ్లను, పచ్చి కాయలను కలిపి ఉంచవద్దు. 

బాగా పండిన పండు విడుదల చేసే ఇథిలీన్ పక్కనున్న కాయలను టైమ్‌కి ముందే పండిస్తుంది… దీంతో ఒకేసారి పండ్లు అవుతాయి… తొందరగా తినలేదో అవి కుళ్లిపోతాయి. ఆపిల్, అరటిపండ్ల నుంచి కూడా మామిడి పండ్లను దూరంగా ఉంచాలి… ఎందుకంటే అవి కూడా ఇథిలీన్ గ్యాస్‌ను విడుదల చేస్తాయి.

46
బాగా గాలి తగలనియ్యండి..
Image Credit : Asianet News

బాగా గాలి తగలనియ్యండి..

మామిడి పండ్లకు గాలి బాగా తగలడం చాలా ముఖ్యం. మార్కెట్ నుంచి తీసుకురాగానే ప్లాస్టిక్ కవర్ల నుంచి పండ్లను బయటకు తీయండి. అలాగే ఉంచితే లోపల వేడి పెరిగి పండ్లు చెమట పడతాయి. దీనివల్ల బ్యాక్టీరియా చేరి పండు త్వరగా మెత్తబడుతుంది. పండ్లను వెదురు బుట్టల్లో లేదా గాలి ఆడే చెక్క పెట్టెల్లో ఉంచడం మంచిది. నేలపై పేపర్ వేసి, దానిపై పండ్లను విడివిడిగా పెట్టడం కూడా మంచి పద్ధతే.

56
మామిడి పండ్లను కడగకండి...
Image Credit : stockPhoto

మామిడి పండ్లను కడగకండి...

మామిడి పండ్లను నిల్వ చేసే ముందు ఎప్పుడూ కడగకండి. తేమ ఉంటే ఫంగస్ లేదా బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు పండ్లను త్వరగా పండించాలనుకుంటే వాటిని బ్రౌన్ పేపర్ బ్యాగ్‌లో ఉంచండి. అదే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే, ఒక్కో పండును విడివిడిగా న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్‌లో చుట్టి పెట్టండి. ఇది పండులోని అదనపు తేమను పీల్చుకుంటుంది.

66
వెంటనే ఫ్రిజ్ లో పెట్టకండి..
Image Credit : Freepik

వెంటనే ఫ్రిజ్ లో పెట్టకండి..

చాలా మంది చేసే సాధారణ తప్పు ఏంటంటే, పచ్చిగా లేదా పూర్తిగా పండని మామిడికాయలను ఫ్రిజ్‌లో పెట్టడం. పండ్లు పూర్తిగా పండే వరకు వాటిని గది ఉష్ణోగ్రత (Room Temperature) వద్దే ఉంచాలి. పూర్తిగా పండిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. 

ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు కూడా ఒకదానిపై ఒకటి వేయకుండా, టిష్యూ పేపర్‌లో చుట్టి వెజిటబుల్ బాక్స్‌లో పెడితే 5-7 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అలాగే మామిడి పండ్లను రోజుకొకసారి మెల్లగా తిప్పుతూ ఉండండి. ఒకేచోట ఎక్కువ రోజులు ఉంచితే ఆ భాగంపై ఒత్తిడి పడి పండు మెత్తబడి పాడవ్వొచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Mango Benefits : మామిడి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Recommended image2
Mango: మామిడి పండ్లు ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved