Telugu

Mango: మామిడి పండ్లు ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?

Telugu

కడిగిన తర్వాతే తినాలి..

మామిడి పండ్లు చూడటానికి తాజాగా ఉన్నా కూడా వాటిని కడగకుండా తినకూడదు. కడగకుండా తింటే  ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. 

Image credits: Getty
Telugu

అతిగా అస్సలు తినొద్దు

అతిగా తింటే అమృతం కూడా విషం అవుతుందని పెద్దలు అంటారు. ఈ విషయం గుర్తుంచుకోండి. మామిడి పండ్లను ఎక్కువగా తింటే, వాటిలో ఉండే హై ఫైబర్, షుగర్ కంటెంట్ వల్ల కడుపులో గడబిడ మొదలవుతుంది.

Image credits: Getty
Telugu

ఆరోగ్యకరంగా తినండిలా

బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే, ఉదయం, సాయంత్రం వేళల్లో బాదం పప్పులతో కలిపి మామిడి పండును తినండి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.

Image credits: Getty
Telugu

తప్పుగా కట్ చేయొద్దు

మామిడి పండును ఎప్పుడూ తప్పుగా కట్ చేయొద్దు. పండును క్రిస్-క్రాస్ ప్యాటర్న్‌లో కట్ చేయడం వల్ల తినడానికి చాలా సులభంగా ఉంటుంది. పండు కూడా వృథా అవ్వదు.

Image credits: Getty
Telugu

పరగడుపున మామిడిపండు వద్దు

మామిడి పండు మీకు ఎంత ఇష్టమైనా సరే, ఉదయాన్నే పరగడుపున తినే అలవాటు అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల రోజంతా ఆకలిగా అనిపిస్తూనే ఉంటుంది.
 

Image credits: Getty
Telugu

జ్యూస్‌లు, షేక్‌లు ఎక్కువగా వద్దు

మామిడి పండు తినడం మంచిదే. కానీ మ్యాంగో జ్యూస్, మ్యాంగో మిల్క్‌షేక్‌లు ఎక్కువగా తాగొద్దు. వీటిలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెంచుతుంది.

Image credits: Getty
Telugu

టెంకను పారేయకండి

మామిడి పండు తిన్న తర్వాత టెంకను ఎప్పుడూ పడేయకండి. దానిని చట్నీలు, డ్రింక్స్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.

Image credits: Getty

Flax Seeds: రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే

Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఇంత డేంజరా..!

Cauliflower: ఇలా ఉంటే అస్సలు కొనొద్దు..ఫ్రెష్ కాలీఫ్లవర్ గుర్తుపట్టడం ఎలా?

Ragi Ambali: రోజూ రాగి అంబలి తాగితే ఏమవుతుంది?