MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Bed Sheet Care: బెడ్ షీట్లను ఎన్నిరోజులకొకసారి ఉతకాలి? ఈ సింపుల్ టిప్ తో తళతళ మెరుస్తాయి

Bed Sheet Care: బెడ్ షీట్లను ఎన్నిరోజులకొకసారి ఉతకాలి? ఈ సింపుల్ టిప్ తో తళతళ మెరుస్తాయి

Bed Sheet Care: చాలా మంది బెడ్ షీట్లు, దిండు కవర్లు నెలల తరబడి ఉతకరు. దానివల్ల రోగాలు తప్పవు. మరి ఎన్నిరోజులకు ఉతకాలి? ఎప్పుడు వాష్ చేసినా కొత్త వాటిలా తళతళ మెరవాలంటే ఏం చేయాలి? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 21 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఈ సింపుల్ టిప్‍తో కొత్తవాటిలా మెరుస్తాయి
Image Credit : Asianet News

ఈ సింపుల్ టిప్‍తో కొత్తవాటిలా మెరుస్తాయి

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. అందులో తినే ఆహారం, తాగే నీరు పక్కనపెడితే…మనం రోజూ వాడే బెడ్ షీట్లు, దిండు కవర్లు చాలా ముఖ్యం. గంటల తరబడి వాడే బెడ్‌షీట్లపై మన నుంచి వచ్చే చెమట, దుమ్ము, మృతకణాలు, కంటికి కనిపించని సూక్ష్మక్రిములు చేరతాయి. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే చెడు వాసన వస్తుంది. అంతేకాకుండా శరీరంపై అలర్జీ, చర్మ సమస్యలు, తుమ్ములు, గొంతునొప్పి, దగ్గు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే చాలు మీ బెడ్‌షీట్లను ఎక్కువకాలం కొత్తవాటిలా ఉంచుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
వారానికి ఒకసారి ఉతకడం మంచి అలవాటు
Image Credit : Instagram

వారానికి ఒకసారి ఉతకడం మంచి అలవాటు

బెడ్‌షీట్లను కనీసం వారానికి ఒకసారి ఉతకాలి. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి, 5 నుంచి 7 రోజులకు ఒకసారి ఉతికితే ఇంకా మంచిది. చిన్నపిల్లలు లేదా పెంపుడు జంతువులు వాడే బెడ్‌షీట్లను ఇంకాస్త తరచుగా శుభ్రం చేయాలి. మరీ ముఖ్యంగా కాస్త వేడి నీళ్లు వాడితే మరీ మంచిది. 

Related Articles

Related image1
Home Decor: మెట్ల కింద ఖాళీ స్థలాన్ని ఇలా సెటప్ చేస్తే మీ ఇల్లు లగ్జరీ హోమ్‌లా కనిపిస్తుంది
Related image2
Home Gardening: ఇదొక్కటి ఉంటే చాలు.. ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంట
310
సరైన డిటర్జెంట్ వాడండి
Image Credit : Pinterest

సరైన డిటర్జెంట్ వాడండి

ఎక్కువ రసాయనాలు ఉన్న డిటర్జెంట్లు వాడితే బట్టల రంగు, మృదుత్వం త్వరగా పోతాయి. వాటికి బదులుగా మైల్డ్ డిటర్జెంట్ లేదా సున్నితమైన సోపులను ఎంచుకోవడం మంచిది. దీనివల్ల బెడ్‌షీట్ల నాణ్యత ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.
410
సహజ పద్ధతుల్లో వాసన పోగొట్టండి
Image Credit : Instagram

సహజ పద్ధతుల్లో వాసన పోగొట్టండి

ఉతికేటప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా లేదా వైట్ వెనిగర్ కలపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చెమట వాసన, సబ్బు అవశేషాలు, బట్టల్లో పేరుకుపోయిన మురికిని తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో బట్టలకు మంచి సువాసన వస్తుంది.
510
ఎండలో ఆరబెట్టాలి
Image Credit : Pinterest

ఎండలో ఆరబెట్టాలి

ఉతికిన బెడ్‌షీట్లను నేరుగా ఎండలో ఆరబెట్టడం చాలా ప్రయోజనకరం. సూర్యరశ్మి తేమను పూర్తిగా తొలగించడమే కాకుండా, మిగిలిపోయిన సూక్ష్మక్రిములను చంపేస్తుంది. పూర్తిగా ఆరని బట్టలను మడతపెట్టి పెట్టకూడదు. అలా చేస్తే మురికి వాసన వచ్చి నిద్ర పట్టనివ్వదు. 

610
గాలి తగలడం చాలా అవసరం
Image Credit : Instagram

గాలి తగలడం చాలా అవసరం

ఉదయం నిద్రలేవగానే వెంటనే దుప్పటి మడవకుండా, 15 నుంచి 20 నిమిషాల పాటు బెడ్‌షీట్లను అలాగే పరచి ఉంచండి. దీనివల్ల రాత్రిపూట చేరిన తేమ ఆవిరైపోయి, దుర్వాసన రాకుండా ఉంటుంది. 

710
అల్మారాలో జాగ్రత్తగా సర్దండి
Image Credit : Instagram

అల్మారాలో జాగ్రత్తగా సర్దండి

ఉతికి బాగా ఆరిన తర్వాతే బెడ్‌షీట్లను మడతపెట్టి అల్మారాలో పెట్టాలి. వాటితో పాటు నాఫ్తలీన్ గోళీలు, కర్పూరం లేదా ఎండిన పువ్వులను ఉంచితే ఎక్కువసేపు మంచి వాసన వస్తుంది. అల్మారా ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి.
810
మార్చి మార్చి వాడండి
Image Credit : Pinterest

మార్చి మార్చి వాడండి

ఒకే బెడ్‌షీట్‌ను రోజూ వాడకుండా, రెండు లేదా మూడు సెట్లను మార్చి మార్చి వాడటం మంచిది. దీనివల్ల ప్రతి బెడ్‌షీట్‌కు విశ్రాంతి దొరికి, దాని లైఫ్ పెరుగుతుంది. అదే సమయంలో ఎప్పుడూ శుభ్రమైన బెడ్‌షీట్‌ను వాడుకునే సౌలభ్యం ఉంటుంది.
910
ఐరన్ చేసుకోవాలి
Image Credit : Pinterest

ఐరన్ చేసుకోవాలి

ఉతికిన తర్వాత తేలికగా ఐరన్ చేస్తే బట్టలపై ఉన్న ముడతలు పోయి అందంగా కనిపిస్తాయి. అంతేకాకుండా, వేడికి కొన్ని సూక్ష్మక్రిములు చనిపోయే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా కాటన్ బెడ్‌షీట్లకు ఇది మంచి సంరక్షణ పద్ధతి.
1010
ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తాయి!
Image Credit : Pinterest

ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తాయి!

బెడ్‌షీట్లను శుభ్రంగా ఉంచుకోవడం కేవలం శుభ్రత కోసమే కాదు, మంచి ఆరోగ్యం, నాణ్యమైన నిద్రకు కూడా అవసరం. వారానికోసారి ఉతకడం, సరిగ్గా ఆరబెట్టడం, శుభ్రంగా దాచుకోవడం వంటి సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. మీ బెడ్‌షీట్లు ఎక్కువ కాలం మన్నికొస్తాయి. కొత్తవాటిలా మృదువుగా, సువాసనతో ఉంటాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Fathers Day Gifts: ఈ ఫాదర్శ్ డే గిఫ్ట్ మధురమైన జ్ఞాపకంలా మిగిలిపోతుంది
Recommended image2
Fathers Day Gift: వావ్.. ఫాదర్శ్ డే బెస్ట్ గిఫ్ట్ ఐడియాస్ చూసేయండి
Recommended image3
Father's Day Wishes: ప్రతి నాన్న కోసం ప్రత్యేకంగా బెస్ట్ ఫాదర్స్ డే విషెస్, ఎమోషనల్ కోట్స్
Related Stories
Recommended image1
Home Decor: మెట్ల కింద ఖాళీ స్థలాన్ని ఇలా సెటప్ చేస్తే మీ ఇల్లు లగ్జరీ హోమ్‌లా కనిపిస్తుంది
Recommended image2
Home Gardening: ఇదొక్కటి ఉంటే చాలు.. ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved