MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gardening
  • Home Gardening: ఇదొక్కటి ఉంటే చాలు.. ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంట

Home Gardening: ఇదొక్కటి ఉంటే చాలు.. ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంట

Home Gardening: స్ట్రాబరీ, బ్లూబెర్రీ, మల్బరీ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఇవి రేటెక్కువ. ప్రతిసారీ కొనుక్కు తినాలంటే జేబుకు చిల్లు తప్పదు. అయితే ఏం కంగారు పడొద్దు. మీ ఇంట్లోనే ఈ బెర్రీ మొక్కలను పెంచుకోవచ్చు. హ్యాపీగా తినొచ్చు.

2 Min read
Author : Nandini Arava
Published : Jun 16 2026, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంట
Image Credit : chatgpt

ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంట

బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొనుక్కు తినాలంటే ఖరీదెక్కువ. తినాలని ఉన్నా అందరూ కొనలేరు. కానీ ఈ బెర్రీ పళ్లలో చాలా రకాల విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలా అని కొనే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడా సమస్య లేదు. ఎందుకంటే ఇంట్లోనే వీటిని ఈజీగా పెంచేయొచ్చు. చిన్న బాల్కనీ ఉన్నా, టెర్రస్, గార్డెన్..ఇలా ఏదైనా సరే సులువుగా పెరుగుతాయి. కొద్దిపాటి సంరక్షణ, ఎండ తగిలితే చాలు, ఈ మొక్కలు ఇంటిలోనే రుచికరమైన పండ్లను ఇస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్ట్రాబెర్రీ
Image Credit : Pinterest

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ అంటే చాలామందికి ఇష్టం. కానీ మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువ. కొన్నా కూడా పురుగులు ఉంటాయి. తినాలంటే భయమేస్తుంది. అందుకే పెంచుకున్న మొక్కలైతే పురుగు పట్టకుండా చూసుకోవచ్చు. అయితే దీన్ని కుండీలో లేదా హ్యాంగింగ్ బాస్కెట్‌లో సులభంగా పెంచుకోవచ్చు. స్ట్రాబెర్రీ మొక్కకు రోజూ 5 నుంచి 6 గంటల ఎండ అవసరం. మొక్క ఉన్న కుండీలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. అందుకే సారవంతమైన మట్టిని వాడాలి. క్రమం తప్పకుండా నీరు పోయాలి. చలికాలంలో స్ట్రాబెర్రీ మొక్కలు పెంచితే మరి మంచిది. సాగుకు అనుకూలమైన సమయం కూడా.

35
మల్బరీ (Mulberry)
Image Credit : our own

మల్బరీ (Mulberry)

మల్బరీ పండ్లు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. దీనిలోని డ్వార్ఫ్ లేదా గ్రాఫ్టెడ్ రకాలను పెద్ద కుండీలలో సులభంగా పెంచవచ్చు. మొక్క మరీ ఎక్కువగా పెరగకుండా, ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటే, తక్కువ స్థలంలోనే బాగా పెరుగుతుంది. టెర్రస్ మీద పెద్ద కంటైనర్‌లో పెంచిన మల్బరీ మొక్క కొన్ని సంవత్సరాల తర్వాత పండ్లను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ పండ్లు పిల్లలు, పెద్దలు ఇద్దరికీ నచ్చుతాయి.
45
బ్లూబెర్రీ మొక్క
Image Credit : our own

బ్లూబెర్రీ మొక్క

బ్లూబెర్రీని సూపర్ ఫుడ్ అంటారు. కానీ దీని ధర కూడా చాలా ఎక్కువ. వీటిని కంటైనర్ గార్డెనింగ్ ద్వారా ఇంట్లోనే పండించవచ్చు. బ్లూబెర్రీ మొక్కలకు కొద్దిగా ఆమ్లత్వం న్న మట్టి అవసరం. క్రమం తప్పకుండా ఎరువులు వేస్తూ, తగినంత ఎండ తగిలేలా చూసుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలాలనిస్తుంది. ఈ మొక్క మీ హోమ్ గార్డెన్‌కు కూడా మంచి అందాన్ని ఇస్తుంది.

55
ఫాల్సా మొక్క
Image Credit : Getty

ఫాల్సా మొక్క

వేసవిలో ఫాల్సా పండ్ల రుచి, చలువ చేసే గుణం అందరికీ నచ్చుతుంది. దీని చిన్నని ఊదా రంగు పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి చలువ చేస్తాయి. ఫాల్సా మొక్కను పెద్ద కుండీలో లేదా డ్రమ్‌లో సులభంగా పెంచవచ్చు. దీని సంరక్షణ కూడా చాలా సులభం. మీ టెర్రస్‌పై తగినంత స్థలం ఉంటే, ఈ మొక్క మీకు ఒక అద్భుతమైన ఎంపిక అవుతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
తోటపని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Recommended image2
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image3
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Related Stories
Recommended image1
Gardening Tips: ఈ మొక్కల ఆకులు నాటినా చాలు.. ఈజీగా కొత్త మొక్కను పెంచవచ్చు!
Recommended image2
gardening ideas: పనికిరాని పైపులతో మీ గార్డెన్ ను అందంగా ఇలా మార్చుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved