Best Tips for Sleep: తొందరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా..?
Best Tips for Sleep: అబ్బా నిద్ర రావడం లేదే అంటూ బెడ్ పై అటూ ఇటూ దొర్లేవారు నేడు చాలా మందే ఉన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండేందు నిద్ర ఎంతో అవసరం. కానీ ఆ నిద్రలేని వారు ప్రస్తుతం చాలా మంది ఉన్నారు. అలాంటి వారు కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే చక్కగా తొందరగా నిద్రలోకి జారుకుంటారు.

Best Tips for Sleep: పొద్దంతా కష్టపడి అలసిన శరీరానికి ప్రశాంతమైన నిద్ర ఎంతో అవసరం. నిద్రతోనే శరీరం తిరిగి ఎనర్జీని పొందుతుంది. అంతేకాదు కంటినిండా నిద్రపోతేనే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఎలాంటి పనులనైనా సులభంగా చేసేస్తుంది. అదే శరీరానికి కావాల్సిన నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎంత సేపు బెడ్ పై అటు ఇటు దొర్లినా.. కళ్లు మూసుకోవు.. నిద్ర పట్టదు. ఈ సమస్య వల్ల వారు అనేక మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు శారీరకంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే ఈజీగా నిద్రలోకి జారుకుంటారు. ఆ చిట్కాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
పడుకునే ముందు గసగసాలను దోరగా వేయించి వాటిని ఒక పల్చటి బట్టలో వేసి వాసన పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తే కూడా తొందరగా నిద్రపడుతుంది. అలాగే ఆవునెయ్యిని గోరువెచ్చగా చేసి పడుకునే ముందు ముక్కలో రెండు చుక్కలు వేస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది.
పడుకునేటప్పుడు అరికాళ్లను నెమ్మదిగా మర్దన చేస్తే కూడా తొందరగా నిద్రపడుతుంది. అలాగే దువ్వెనతో లేదా చేతి వేళ్లతో నెత్తిని సున్నితంగా దువ్వుతూ ఉంటే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో నిద్రించే సమయంలో అరికాళ్లకు మర్దన చేయాలి. పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలతో చక్కటి నిద్ర వస్తుంది.
ముఖ్యంగా పడుకునే ముందు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. పడుకోవడానికి ఇంకా రెండు గంటల సమయం ఉండగానే టీవీలను, సెల్ ఫోన్లను, ల్యాప్ టాప్ లను చూడటం మానేయాలి. అంతేకాదు మొబైల్ ఫోన్లు పడుకున్నప్పుడు తలపక్కన పెట్టుకోవడం వల్ల దాని నుంచి రిలీజయ్యే రేడియేషన్ మన పై తీవ్ర ప్రభావాన్ని చూపించి.. నిద్రను చెడగొడుతుంది. కాబట్టి సెల్ ఫోన్లను మీకు దగ్గరలో అస్సలు పెట్టుకోకూడదు.
ప్రశాంతమైన మ్యూజిక్ కూడా నిద్రను ప్రేరేపిస్తుంది. అందుకే పడుకునే ముందు కాసేపు మృదువైన సంగీతాన్నికల్లు మూసుకుని ఆస్వాదించండి. ఆ సమయంలో మీ ధ్యాసంతా కేవలం మీ శ్వాస మీదే ఉండాలి. అలా చేస్తేనే నిద్ర తొందరగా నిద్రలోకి జారుకుంటారు.
ధ్యానం కూడా నిద్ర రావడానికి ఎంతో సహాయపడుతుంది. పడుకునే ముందు కాసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయండి. లేదా మంచి అందమైన ప్రదేశాలను ఊహించుకోండి. వాటిని
Memorize చేసుకుంటే కూడా చక్కగా నిద్రపడుతుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే నిద్రలేమి సమస్యలను వీలైనంత తొందరగా వదిలించుకోవచ్చు.