Roti Side effects : జాగ్రత్త.. చపాతీలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదరకం..
Roti Side Effects: ప్రస్తుత కాలంలో జొన్న రెట్టెలను తినడం జనాలు పూర్తిగా తగ్గించారు. గోధుమ రొట్టెలను తినడం ఎక్కువ చేశారు. ముఖ్యంగా అన్నం కంటే చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. మీకు తెలుసా.. చపాతీలను మోతాదుకు మించి తినడం వల్ల ఎన్నో ఆనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Roti Side Effects: దక్షిణ భారతదేశాన్ని మినహాయించి.. ఇండియా అంతటా జొన్న రొట్టెలను, చపాతీలను తినడం బాగా అలవాటు. ఎందుకంటే రోటీలతో ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని. అందుకే వీటిని రోజు వారి ఆహారంలో ప్రజలు భాగం చేసుకున్నారు. అన్నం తిన్నా.. రొట్టెలు తినకపోతే .. వారికి తిన్నామనే సంతృప్తి ఉండదు. అందుకే ఆహారం తీసుకున్నా.. రొట్టెలను ఖచ్చితంగా తింటుంటారు. అందులోనూ రైస్ కంటే రోటీల వల్లే ఆరోగ్యం బాగుంటుందని ప్రజలు నమ్ముతుంటారు. ఇది వాస్తవమే అయినప్పటికీ.. రోటీలను మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రోటీలను తినడం వల్ల ఊబకాయం బారిన పడే ప్రమాదమే ఉండదని జనాలు వీటిని మోతాదుకు మించి తీసుకుంటున్నారు. అందులోనూ జొన్నలు, సజ్జల రొట్టెలకు బదులుగా గోధుమ రొట్టెలనే ఎక్కువగా తింటున్నారు. గోధుమ రోటీలతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్లు, క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. అంతేకాదు ఇవి మన బాడీలో Toxic substances ఏర్పడకుండా చేస్తాయి.
రోటీల్లోఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది తొందరగా జీర్ణం అవుతుంది. కానీ వీటిని ప్రతి రోజూ ఎక్కువగా తీసుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజంతా రోటీలతోనే కడుపు నింపుకునే వారికి ఆరోగ్యం దెబ్బతింటుందట. మఖ్యంగా ఊబకాయం, అలసట, రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం వంటి సమస్యలను తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి చపాతీలను ఎక్కువగా తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు పెరగడం: రోటీని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదముంది. నిజానికి చపాతీలను ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో Carbohydrates పెరుగుతాయి. అంతేకాదు గోధుమల్లో ఉండే gluten Size పెరగడంతో.. మన బాడీలో Fat అధికమవుతుంది.
షుగర్ లెవల్స్ పెరుగుతాయి: చపాతీలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన బీపీని పెంచుతాయి. అందుకే చపాతీ మోతాదుకు మించి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలసట: గోధుమ చపాతీలల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అలసటను పెంచుతాయి. చపాతీలను ఎక్కువగా తినడం వల్ల మన శరీరం నీరసంగా మారడం, బద్దకంగా తయారవుతుంది.
బాడీ వార్మింగ్: రోజంతా రోటీలనే తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల మన శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. అంతేకాదు చెమట కూడా విపరీతంగా పడుతుంది. తద్వారా మన బాడీలో నీటి కొరత ఏర్పడి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది.
కడుపు ఉబ్బరం: చపాతీలను తిన్న తర్వాత చాలా మందికి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అంతేకాదు గ్యాస్, అజీర్థి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రోటీలను వీలైనంత తక్కువగా తినాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.