MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గుడ్లను అతిగా తిన్నా అనర్థమే.. ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా..?

గుడ్లను అతిగా తిన్నా అనర్థమే.. ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా..?

గుడ్ల ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే వీటిని మోతాదుకు మించి తినడం కూడా పాణానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 30 2022, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గుడ్డును సూపర్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అంటారు. ఎందుకంటే ఇది సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్డును తింటే రోజంతా ఎనర్జిటిక్ గా, హుషారుగా ఉంటారు. అందుకే సండే అయినా.. మండే అయినా రోజూ తినండి గుడ్డు అనే మాట పుట్టుకొచ్చింది. ఇందంతా బానే ఉన్నా.. అసలు రోజుకు ఎన్ని గుడ్లను తినాలి.. ఒకవేళ గుడ్లను రోజులో ఎక్కువ సార్లు తింటే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి.. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఆరోగ్య నిపుణులు దీన్ని రోజూ తినాలని చెబుతుంటారు. గుడ్లలో విటమిన్ బి12, విటమిన్  డి, కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అయినా గుడ్లను తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

36

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి

ఆరోగ్యంగా ఉన్న వయోజనుడు ఒక గుడ్డును తింటే సరిపోతుంది. దీని నుంచి అతని శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే ఇది మన జీవన శైలిపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీకు ఏ చిన్న అనారోగ్య సమస్యలు గనుక లేనట్టైతే మీరు బేషుగ్గా మూడు గుడ్లను తినొచ్చు. కానీ వీళ్లు రెగ్యులర్ గా వ్యాయామం చేసే వారై ఉండాలి. ఎందుకంటే వ్యాయామం చేసే వారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇవి గుడ్ల నుంచే ఎక్కువగా అందుతాయి. 
 

46

గుడ్లను అతిగా తినడం వల్ల కలిగే నష్టాలు

అతిసారం

అది ఎంత మంచిదైనా కానీయండి.. అతి పనికి రాదంటారు మన పెద్దలు. అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుడ్లను మోతాదుకు మించి తింటే మాత్రం మీరు చిక్కుల్లో పడ్డట్టే. రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డును తింటే చాలు. పరిమితికి మించి తింటే మీరు డయేరియా బారిన పడొచ్చు. దీనివల్ల మీ శరీరం బలహీనంగా తయారవుతుంది. అందుకే గుడ్లను అతిగా తినకండి. ఇది మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. 
 

56

మలబద్దకం

గుడ్లను మోతాదుకు మించి తింటే.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఇది మలబద్దకానికి దారితీస్తుంది. ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే కడుపులో చికాకు పుడుతుంది. అలాగ్యే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ను కూడా ఫేస్ చేస్తారు. అంతేకాదు అపానవాయువు (పిత్తులు) సమస్యను కూడా వస్తుంది. 
 

66

కొలెస్ట్రాల్ 

గుడ్డులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అయితే గుడ్డు పచ్చసొనలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది శరీరానికి ఎలాంటి హాని కలిగించనప్పటికీ.. ఇది కొవ్వును పెంచుతుంది. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు గుడ్లను తక్కువ మొత్తంలో తినాలి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Mangalsutra: ట్రెండీ మంగళసూత్రాలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్!
Recommended image2
Silver Rings: అదిరిపోయే డిజైన్ లో వెండి ఉంగరాలు.. ధర కూడా తక్కువే!
Recommended image3
Kanauti Jhumka: ఈ ఇయర్ రింగ్స్ తో మహారాణి లుక్.. ఓ లుక్కేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved