MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఆరోగ్యానికి మంచివని ఆపిల్స్ ను ఎక్కువగా తింటే మీకు ఈ తిప్పలు తప్పవు జాగ్రత్త..

ఆరోగ్యానికి మంచివని ఆపిల్స్ ను ఎక్కువగా తింటే మీకు ఈ తిప్పలు తప్పవు జాగ్రత్త..

శరీరంలో పీచు పదార్థం పెరిగిపోతే.. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలొస్తాయి. అలాగే ఫైబర్ ఎక్కువైతే కూడా కడుపు ఉబ్బరం, మలబద్దకానికి దారితీస్తుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 15 2022, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రోజూ ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదనే మాటను చిన్నప్పటి నుంచీ వినే ఉంటారు. అవును మరీ.. ఆపిల్ పండులో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. వీటిలో ఫాస్పరస్, విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అంటువ్యాధులను, ఇతర వ్యాధులను దూరంగా ఉంచడానికి సహాయపడుతాయి. ఆపిల్స్ ఎంత ఆరోగ్యకరమైనవైనా.. వీటిని ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం సేఫ్ కాదు. ఆపిల్స్ ను ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం పదండి.. 
 

26

జీర్ణ సమస్యలు

మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ కంటెంట్ చాలా అవసరం.  ఈ ఫైబర్ ఆపిల్స్ లో పుష్కలంగా ఉంటుంది. అయితే ఇది మన శరీరంలో పీచు పదార్థం పెరిగి పోతే జీర్ణక్రియకు సంబంధించి ఎన్నో సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ కంటెంట్ ను మోతాదుకు మించి తీసుకుంటే కడుపు ఉబ్బరంతో పాటుగా మలబద్దకం సమస్య కూడా వస్తుంది. రోజుకు 70 గ్రాముల కంటే ఎక్కువ పీచుపదార్థం తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. సో ఇంతకు మించి తీసుకోకండి.
 

36

స్థూలకాయం

ఒక మీడియం సైజులో ఆపిల్ పండులో సుమారు 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.  అయితే ప్రతిరోజూ ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటే మాత్రం మీరు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక ఆపిల్ పండుకు మించి తినకండి.
 

46

బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి

మధుమేహులు ఆపిల్ పండ్లను ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే వీటిలో షురగ్ కంటెంట్, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక మధుమేహులు ఆపిల్స్ ను ఎక్కువగా తింటే మాత్రం వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. 
 

56
apple

apple

దంతాలు దెబ్బతింటాయి
 
ఆపిల్స్ ను మితిమీరి తింటే మాత్రం మీ దంతాలు దారుణంగా దెబ్బతింటాయి. ఎందుకంటే ఆపిల్స్ లో యాసిడ్ ఉంటుంది. దీనివల్ల ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటే దంతాలు దెబ్బతింటాయి. 

66

అలర్జీలు

పండ్ల  వల్ల అలర్జీ వచ్చే వారు ఆపిల్ పండ్లకు ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది అలర్జీ సమస్యను పెంచుతుంది. అలర్జీ సమస్యలతో బాధపడేవారు  ఆపిల్ పండ్లను తింటే పొత్తి కడుపు నొప్పి వస్తుంది. అలాగే వికారం, వాంతులు, తిమ్మిరి వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: పరగడుపున రోజూ ఇవి తింటే.. బరువు తగ్గడం చాలా ఈజీ..!
Recommended image2
మహిళలు ప్రతి ఏడాది ఈ టెస్టులు చేయించుకుంటే బెటర్
Recommended image3
Flax Seeds: చలికాలంలో అవిసె గింజలు తినొచ్చా? తింటే ఏమవుతుంది? ఎవ్వరు తినకూడదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved