రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే ఎంత ప్రమాదమో తెలుసా..?
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుకు ఐదారు కప్పుల టీని తాగేవారు చాలా మందే ఉన్నారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. ఇకముందు టీ జోలికే వెళ్లరు తెలుసా..?

ఇండియాలో టీని ఇష్టంగా తాగేవారు చాలా మందే ఉన్నారు. టీ తాగకుండా చిన్న పనికూడా చేయరు. టీ తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి రీఫ్రెష్ గా అనిపిస్తుంది. అందుకే ఆఫీసులకెళ్లి పనిచేసేవారు, ఇతర పనులను చేసేవారు రోజులో ఎన్నో సార్లు టీని లాగించేస్తుంటారు. కొందరికైతే టీ వ్యసనంగా మారిపోయి ఉంటుంది. కానీ టీ ని ఎక్కువ సార్లు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని కప్పుల టీని తాగాలో తెలుసుకుందాం పదండి.
టీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. సాధారణంగా మనం తాగే కప్పు టీ లో 60 మి.గ్రా కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే మీరు రోజుకు 3 కప్పులకు మించి ఎక్కువ టీ ని తాగకూడదు. లేదంటే మీ ఆరోగ్యం డేంజర్ జోన్ లో పడుతుంది.
రోజులో నాలుగు కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల టీని తాగితే శరీరంలో ఉండే టానిన్లు ఇనుము శోషణ సామర్థాన్ని తగ్గిస్తాయి.ముఖ్యంగా శాకాహారులపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది.
టీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడుపై చెడు ప్రభావాన్నిచూపుతుంది. దీంతో మైకము కమ్ముకుంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు టీని ఎక్కువగా తాగకూడదని చెప్తుంటారు.
రోజుకు 5 నుంచి 10 కప్పుల టీని తాగితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య దారుణంగా పెరిగిపోతుంది. అందుకే టీని మోతాదులోనే తాగండి. లేదంటే మొత్తమే టీ అలవాటును మానుకోవడం బెటర్.
టీ తాగడం వల్ల రీఫ్రెష్ గా అనిపిస్తుంది. ఒత్తిడి నుంచి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. అంతేకాదు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.
అన్నింటికీ మించి మోతాదుకు మించి టీని తాగడం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. మీకు తెలుసా.. గొంతు క్యాన్సర్ కు వేడి టీ తాగడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు.
శరీరంలో ఐరన్ లోపం, రక్తహీనత సమస్య ఉన్న వాళ్లు టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే టీ తాగితే ఐరన్ మరింత తగ్గుతుంది. దీనివల్ల అలసట, తలనొప్పి, డ్రై స్కిన్ వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే వీటికి బదులు గ్రీన్ టీ లేదా లెమన్ టీ తాగండి.