MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఆముదం నూనెతో లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి..

ఆముదం నూనెతో లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి..

ఆముదం నూనెను చర్మం, జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తారు. ఈ నూనె చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. హెయిర్ ఫాల్, చుండ్రు వంటి సమస్యలను తొలగిస్తుంది. అయితే ఈ ఆముదం నూనె కూడా ఎన్నో సమస్యలను పుట్టిస్తుందన్న సంగతి మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 03 2022, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
castor oil

castor oil

ఆముదం నూనె మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ నూనెను చర్మం, జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ నూనె మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదల, రాటడం, తెల్ల జుట్టు వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ నూనెలో రిసినోలిన్ ఆమ్లం వంటి పదార్ధాలు ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆముదం నూనెను ఉపయోగించడం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఈ నూనె ఆర్థరైటిస్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఈ ఆముదం నూనె క్యాప్సూల్ ను వరుసగా నాలుగు వారాల పాటు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఆముదం నూనె రోగనిరోధక శక్తి ని పెంచుతుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.  ఈ నూనె ఏదైనా బ్యాక్టీరియా సంక్రమణను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ నూనె వల్ల ఎన్నో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..? ఈ నూనె వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

పరిశోధనల ప్రకారం.. ఆముదం నూనె విరేచనాలకు కారణమవుతుంది. ఈ నూనెను అధికంగా తీసుకోవడం వల్ల పేగు కండరాల పనితీరు దెబ్బతింటుంది. దీనివల్లే విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.
 

35

ఆముదం నూనె అలెర్జీలకు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కానీ కొంతమందికి ఈ నూనెను తీసుకోవడం వల్ల అలెర్జీ వస్తుంది. అలాగే చర్మంపై దీనిని అప్లై చేయడం వల్ల అలర్జీలు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి దీనిని ఉపయోగించే ముందు ఇది మీకు పడుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. 
 

45

ఆముదం నూనె పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఈ నూనెను ఉపయోగించడం మంచిదా? కాదా? అన్న విషయం తెలుసుకుని వాడండి. లేకపోతే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్న వారవుతారు. 

55

అయితే ఆముదం నూనెను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఈ నూనెలో కొబ్బరినూనెను మిక్స్ చేసి మాస్క్ లా తయారుచేసుకోవచ్చు. దీన్ని మీ జుట్టుకు అప్లై చేస్తే హెయిర్ సమస్యలన్నీ పోతాయి. చర్మ సంరక్షణ కోసం..  ఏదైనా ఆరోగ్యవంతమైన నూనెను ఆముదం నూనెతో కలిపి చర్మానికి మసాజ్ చేయొచ్చు. అయితే దీన్ని ఉపయోగించడానికి ముందు ఇది మీ చర్మానికి పడుతుందా? లేదా? అని నిర్దారించుకున్న తర్వాతే వాడండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 30 వేల‌తో మొద‌లై నెల‌కు రూ. 30 ల‌క్ష‌లు.. అవినాష్ స‌క్సెస్ స్టోరీ, ఇలా చేస్తే మీకు కూడా సాధ్య‌మే
Recommended image2
Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు
Recommended image3
Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే బర్నర్‌ను వెంటనే ఇలా క్లీన్ చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved