MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Chicken: ఆడవాళ్లు చికెన్ తినకూడదా? తింటే హార్మోన్ల సమస్యలు వస్తాయా?

Chicken: ఆడవాళ్లు చికెన్ తినకూడదా? తింటే హార్మోన్ల సమస్యలు వస్తాయా?

Chicken: ఆడవాళ్లు చికెన్ తినవచ్చా? తినకూడదా? సోషల్ మీడియాలో మహిళలు చికెన్ తినకూడదనమే ప్రచారం ఎంతవరకు నిజం? అసలు డాక్టర్లు ఏం చెబుతున్నారు? చికెన్ తినడం వల్ల వచ్చే లాభాలు నష్టాలు ఏమిటి?

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 16 2026, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆడవాళ్లు చికెన్ తినకూడదా?
Image Credit : chatgpt

ఆడవాళ్లు చికెన్ తినకూడదా?

ఇప్పుడు సోషల్ మీడియాలో  ఆడవాళ్లు చికెన్ తినకూడదు అనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. మహిళలు చికెన్  తింటే హార్మోన్ల సమస్యలొస్తాయని, PCOS పెరుగుతుందని, బరువు పెరిగిపోతారని ఎన్నో పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇవి చూసి కొంతమందిలో భయం పెరిగిపోతోంది. మరికొంతమంది ఏకంగా చికెన్ తినడమే మానేస్తున్నారు. ఈ విషయంపై అసలు వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మహిళలకు చికెన్ తింటే ఏమవుతుంది?
Image Credit : pinterest

మహిళలకు చికెన్ తింటే ఏమవుతుంది?

చికెన్‌ పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ తినాల్సిన ఆహారం. ఇందులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. మహిళలకు  ప్రోటీన్ చాలా అవసరం. ఇది కండరాలను బలోపేతం చేస్తుంది, కణాల మరమ్మతుకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు, చికెన్‌లో ఉండే విటమిన్ B6, విటమిన్ B12, నియాసిన్, ఫాస్పరస్, సెలీనియం, జింక్ వంటి పోషకాలు జీవక్రియ, నాడీ వ్యవస్థ పనితీరు, రక్త కణాల ఏర్పాటుకు తోడ్పడతాయి. రుతుస్రావం కారణంగా ఐరన్ లోపంతో బాధపడే మహిళలకు, సమతుల్య ఆహారంలో భాగంగా చికెన్ తీసుకోవడం మంచి పోషణను అందిస్తుంది.

34
హార్మోన్ సమస్యలకు, చికెన్‌కు సంబంధం?
Image Credit : Getty

హార్మోన్ సమస్యలకు, చికెన్‌కు సంబంధం?

నిజానికి చికెన్ తినడం వల్ల నేరుగా హార్మోన్ల సమస్యలు వస్తాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.  PCOS, హార్మోన్ల మార్పులు, ఊబకాయం వంటివి జన్యువులు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అధిక కేలరీల ఆహారం వంటి అనేక కారణాల వల్ల వస్తాయి. వీటన్నింటికీ చికెన్‌ను కారణంగా చెప్పడం ఒక అపోహ మాత్రమే.

బ్రాయిలర్ కోళ్లకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు అనే ప్రచారం కూడా ఉంది. కానీ, చాలా దేశాల్లో వాణిజ్య కోళ్ల పెంపకంలో హార్మోన్ల వాడకం చట్టవిరుద్ధం. కోళ్లు వేగంగా పెరగడానికి జన్యుపరమైన ఎంపిక, నాణ్యమైన దాణా, ఆధునిక పెంపకం వంటి పద్ధతులనే పాటించాలి.

44
చికెన్ ఎలా తినాలి?
Image Credit : vismaifood/youtube

చికెన్ ఎలా తినాలి?

చికెన్‌ను ఆరోగ్యకరమైన పద్ధతిలో వండుకుని తింటే మంచిది.  వారానికి 2 నుంచి 3 సార్లు చికెన్ తినవచ్చు.  ఉడకబెట్టి, గ్రిల్ చేసి లేదా ఆవిరిపై వండి తినడం అన్ని  విధాలా ఆరోగ్యకరం. ఎక్కువ నూనెలో వేయించిన , ప్రాసెస్ చేసిన చికెన్ వంటకాలను తినడం ఏమాత్రం మంచిది కాదు. కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లతో కలిపి తింటే అది సంపూర్ణ సమతుల్య ఆహారం అవుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken: చికెన్ కూర వండేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. కూర రుచి పాడౌతుంది..!
Recommended image2
Lunch Box Recipes: నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీలు.. టేస్ట్ అదుర్స్!
Recommended image3
Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో
Related Stories
Recommended image1
Most Stolen Thing: ప్రపంచంలో అత్యధికంగా దొంగలు ఎత్తుకుపోయేది దీన్నే.. బంగారం, వజ్రాలు మాత్రం కాదు
Recommended image2
Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుందో తెలుసా? ఎవరూ కొనలేరేమో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved