MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Face Glow : ఖరీదైన క్రీములతో పనిలేదు..ఈ వాటర్ తో ముఖంపై ముడతలు మాయం, యవ్వనంగా కనిపిస్తారు..!

Face Glow : ఖరీదైన క్రీములతో పనిలేదు..ఈ వాటర్ తో ముఖంపై ముడతలు మాయం, యవ్వనంగా కనిపిస్తారు..!

Face Glow : అందంగా కనిపించాలని ఖరీదైన క్రీములు, టోనర్లు వాడుతున్నారా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే టోనర్ తయారు చేయచ్చు. దానితో మీ అందాన్ని పెంచుకోవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 14 2026, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Face Glow
Image Credit : Gemini AI

Face Glow

లవంగాలు దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉంటాయి. ఈ లవంగాలను మనం దాదాపు మసాలా కూరల్లోనూ, బిర్యానీల్లోనూ వాడుతూ ఉంటాం. కానీ ఇవే లవంగాలు మన అందాన్ని కూడా పెంచుతాయని మీకు తెలుసా? అవును.. మన ఇంట్లో ఉన్న లవంగాలతో ఇంట్లోనే టోనర్ తయారు చేసుకోవచ్చు. ఈ టోనర్ తో.. ముఖంపై ముడతలు మాయం అవడమే కాదు.. మీ అందం కూడా రెట్టింపు అవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

లవంగం నీటిని సహజసిద్ధమైన టోనర్ గా ఉపయోగించడం వల్ల చర్మానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
లవంగం నీటిని ఫేస్ టోనర్‌గా వాడితే కలిగే ప్రయోజనాలు:
Image Credit : Getty

లవంగం నీటిని ఫేస్ టోనర్‌గా వాడితే కలిగే ప్రయోజనాలు:

లవంగాల్లో 'యూజినాల్' అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, చర్మ కణాలను కాపాడుతుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

ముడతలు, గీతలు తగ్గుతాయి:మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో లవంగం నీరు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వాడితే ముఖంపై వచ్చే సన్నని గీతలు, ముడతలు తగ్గుతాయి. ఫలితంగా యవ్వనంగా కనిపిస్తారు.

మొటిమలు, మచ్చలు మాయం: లవంగాల్లోని యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాని నశింపజేస్తాయి. మొటిమలు, వాటి వల్ల వచ్చే ఎర్రటి మచ్చలను తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇది సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్‌గా పనిచేసి, ముఖంపై ఉండే పెద్ద చర్మ రంధ్రాలను (Open Pores) బిగుతుగా మార్చి చర్మాన్ని సమంగా ఉంచుతుంది. ఈ టోనర్ వాడటం వల్ల రోజంతా ముఖం ఫ్రెష్ గా కనపడుతుంది. జిడ్డుగా మారదు.

33
లవంగం నీటిని ఎలా తయారు చేయాలి..?
Image Credit : Getty

లవంగం నీటిని ఎలా తయారు చేయాలి..?

తాజా లవంగాలను నాలుగు లేదా ఐదు తీసుకొని.. మంచి నీటిలో వేయాలి. రాత్రంతా అలానే వదిలేస్తే.. ఆ నీరు రంగు మారుతుంది. ఇప్పుడు ఆ నీటిని మనం ఏదో ఒక బాటిలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత.. ఈ నీటిని ముఖానికి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. యవ్వనంగా కనిపిస్తారు. కావాలంటే లవంగాలను నీటిలో మరిగించి.. ఆ నీటిని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకొని కూడా వాడొచ్చు.

దీనిని ఎలా ఉపయోగించాలి? 

ముందుగా మీ ముఖాన్ని మైల్డ్ ఫేస్ వాష్‌తో శుభ్రంగా ముఖం కడుక్కొని, తడి లేకుండా తుడుచుకోవాలి.తయారుచేసుకున్న లవంగం టోనర్‌ను ముఖంపై స్ప్రే చేయండి లేదా కాటన్ తో ముఖానికి, మెడకు అప్లై చేసుకోవచ్చు. 2 మూడు నిమిషాలు దానిని ఆరనిచ్చి.. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. ఉదయం, సాయంత్రం రెండుపూటలా వాడొచ్చు. అయితే.. దీనిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మంట, దురద లేకపోతే.. ముఖానికి అప్లై చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image2
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!
Related Stories
Recommended image1
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Recommended image2
సముద్రం మధ్యలో ‘ తియ్యటి నీరు’.. దీని వెనక సీక్రెట్ ఏంటి? శివాజీ మహారాజ్ కి ఇదెలా సాధ్యమైంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved