- Home
- Life
- Grey Hair: తెల్ల జుట్టు వచ్చేస్తోందా? ఈ ఒక్క ఆకు చాలు జుట్టు రాలడం తగ్గుతుంది, తెల్ల జుట్టు మాయం అవుతుంది..!
Grey Hair: తెల్ల జుట్టు వచ్చేస్తోందా? ఈ ఒక్క ఆకు చాలు జుట్టు రాలడం తగ్గుతుంది, తెల్ల జుట్టు మాయం అవుతుంది..!
Grey Hair: చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతోనే బాధపడుతున్నారా? ఆ జుట్టు కనిపించకుండా కలర్స్ తో కవర్ చేస్తున్నారా? అలాంటి సమస్య లేకుండా తెల్ల జుట్టుని మళ్లీ నల్లగా మార్చేయచ్చు.

Grey Hair
ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం 30 ఏళ్లు నిండక ముందే జుట్టు రాలిపోవడం, తెల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు చాలా కామన్ అయిపోయాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది, రకరకాల హెన్నా లేదంటే.. కెమికల్ డైలను వాడేస్తూ ఉంటారు. వీటి వల్ల తాత్కాలికంగా తెల్ల జుట్టు రంగు మారొచ్చు. కానీ, హెయిర్ డ్యామేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ, సహజంగా ప్రకృతి పరంగా మనకు లభించే కొన్ని రకాల ఆకులు వాడితే.. తెల్ల జుట్టు మళ్లీ నల్లగా నిగనిగలాడుతుంది. అంతేకాదు.. జుట్టు రాలే సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది. మరి, ఆ ఆకులు ఏంటి? వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం...
జుట్టు రాలడానికి మునగాకు వరం..
జుట్టు సమస్యలను తగ్గించడంలో ప్రకృతి ప్రసాదించిన వరం.. మునగాకు. మనకు చాలా సులభంగా దొరికే ఈ మునగాకులు చాలా రకాల హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ని తగ్గించేస్తాయి. మునగాకును చాలా మంది కేవలం వంటలకే పరిమితం అనుకుంటారు. కానీ, ఇదే జుట్టు పెరుగుదలకు దివ్య ఔషధంలా పని చేస్తుంది.
మునగాకులో పోషకాలు..
జుట్టు ఆరోగ్యానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలన్నీ మునగాకులో పుష్కలంగా లభిస్తాయి:
విటమిన్ సి, యాంటీ ఆక్సీడెంట్స్: ఇవి జుట్టు తెల్లబడకుండా సహజసిద్ధంగా రంగును కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అమైనో ఆమ్లాలు, బయోటిన్: జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, కొత్త కుదుళ్లు వేగంగా పెరిగేలా సహాయపడతాయి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, ఐరన్: జుట్టు రాలడాన్ని అరికట్టి, తలకు తగిన పోషణను అందిస్తాయి.
మునగాకుని జుట్టుకు ఎలా వాడాలి..?
మునగాకు హెయిర్ ఆయిల్: ముందుగా మునగాకులను నీడలో ఎండబెట్టి మెత్తని పొడి చేసుకోవాలి. కొబ్బరి నూనె, ఆముదం లేదా ఉసిరి నూనె (Amla Oil).. మీరు వాడే ఏదైనా నూనెలో ఈ పొడిని కలిపి తలకు పట్టించాలి. లేదా నేరుగా నూనెలో మునగాకులను వేసి మరిగించి ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఈ నూనెను రెగ్యులర్ గా రాయడం వల్ల అకాల నెరుపు సమస్య క్రమంగా తగ్గుతుంది.
మునగాకు పవర్ ప్యాక్: మునగాకు పొడిని తాజా పెరుగులో కలపాలి. అందులో కొద్దిగా రోజ్ వాటర్ , బియ్యం కడిగిన నీళ్లు వేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని తలకు, కుదుళ్లకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, సిల్కీగా మారుతుంది.
కేవలం పైపూతగానే కాకుండా, మునగాకులను మీ ఆహారంలో క్రమం తప్పకుండా భాగం చేసుకున్నా లోపలి నుంచి శరీరానికి తగిన పోషణ అంది జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది

