MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Rice: అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలి? ఈ డౌట్ మీకూ ఉందా?

Rice: అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలి? ఈ డౌట్ మీకూ ఉందా?

Rice: ఇంట్లో అన్నం వండే ముందు బియ్యాన్ని కడగడం సహజమే. అయితే బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలి? ఒకసారి కడిగితే సరిపోతుందా? లేక నీళ్లు తేటగా వచ్చే వరకు కడగాలా? ఈ విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. బియ్యం కడిగే సరైన పద్ధతి ఏంటో తెలుసుకుందాం.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 20 2026, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలి?
Image Credit : AI Generated Image

బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలి?

ఇంట్లో అన్నం వండే ముందు బియ్యాన్ని కడగడం సహజమే. అయితే బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలి? ఒకసారి కడిగితే సరిపోతుందా? లేక నీళ్లు తేటగా వచ్చే వరకు కడగాలా? ఈ విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఎన్నిసార్లు కడగాలనే దానిపై చాలామందికి క్లారిటీ లేదు. కొందరు రెండు మూడు సార్లు కడుగుతారు. మరికొందరు నీళ్లు తెల్లగా వచ్చేదాకా నాలుగైదు సార్లు కడుగుతారు. సాధారణంగా బియ్యాన్ని రెండు లేదా మూడు సార్లు సున్నితంగా కడిగితే సరిపోతుంది. అయితే, బియ్యం రకం, అందులో ఉండే దుమ్ము, ప్యాకెట్ మీద ఉండే సూచనలను బట్టి ఇది మారొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బియ్యాన్ని గట్టిగా పిసికి కడగొచ్చా?
Image Credit : X

బియ్యాన్ని గట్టిగా పిసికి కడగొచ్చా?

మొదటిసారి బియ్యాన్ని కడిగినప్పుడు పైన ఉండే దుమ్ము, చిన్న చిన్న రేణువులు పోతాయి. రెండు, మూడోసారి కడిగినప్పుడు బియ్యం పైన ఉండే అదనపు స్టార్చ్ (గంజి లాంటిది) కొంతవరకు పోతుంది. దీనివల్ల వండినప్పుడు అన్నం అతుక్కోకుండా ఉంటుంది. అలాగని కడిగినంత మాత్రాన అన్నం పొడిపొడిగా వస్తుందని గ్యారెంటీ లేదు. బియ్యం రకం, పోసే నీళ్ల పరిమాణం, నానబెట్టే సమయం, వండే పద్ధతిపైనే అన్నం ఎలా వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. అందుకే గిన్నెలో బియ్యం తీసుకుని, నీళ్లు పోసి చేత్తో సున్నితంగా కలిపి నీటిని వంపేయాలి. ఇలా రెండు మూడు సార్లు చేయొచ్చు.

35
అన్నం వండే సరైన పద్ధతి
Image Credit : Social Media

అన్నం వండే సరైన పద్ధతి

బియ్యాన్ని మరీ గట్టిగా పిసికి కడగకూడదు. ముఖ్యంగా త్వరగా విరిగిపోయే బియ్యం రకాలను కడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అసలు బియ్యాన్ని కడగకుండానే వండేయొచ్చా అనే డౌట్ కూడా చాలామందికి వస్తుంది. బియ్యంలో ఉండే దుమ్ము, ఇతర చెత్తను పోగొట్టడానికి కడగడమే మంచి పద్ధతి. అయితే, ముందే కడిగి ప్యాక్ చేసినట్లు కవర్ మీద రాసి ఉంటే మాత్రం, ఆ సూచనలు పాటించాలి. బియ్యాన్ని కడిగినంత మాత్రాన అందులో ఉండే మైక్రోప్లాస్టిక్ పూర్తిగా పోతాయని అనుకోకూడదు. కడగడం వల్ల కొన్ని ధూళి తగ్గినా, అది బియ్యం రకం, కాలుష్యంపై ఆధారపడి ఉంటుంది.

45
బియ్యంలో దుమ్మును తొలగించే విధానం
Image Credit : Gemini AI Generated

బియ్యంలో దుమ్మును తొలగించే విధానం

బియ్యంలో సహజంగా ఉండే ఆర్సెనిక్ లాంటి మూలకాలను కేవలం నీటితో కడగడం ద్వారా పూర్తిగా తొలగించలేం. బియ్యాన్ని శుభ్రంగా కడగడం మంచి అలవాటే అయినా, అన్ని రకాల కాలుష్యాలను ఇది పోగొట్టలేదని మనం అర్థం చేసుకోవాలి. బియ్యాన్ని కడిగేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. దాన్ని గట్టిగా రుద్దకూడదు. వేగంగా, బలంగా రుద్దితే కొన్ని రకాల బియ్యం విరిగిపోతాయి. దీనివల్ల వండిన తర్వాత అన్నం ఆకారం, రుచి మారిపోతాయి.

55
అన్నం వండేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి
Image Credit : AI Image

అన్నం వండేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి

ఒక గిన్నెలో బియ్యం తీసుకుని, శుభ్రమైన తాగునీరు పోసి చేత్తో సున్నితంగా కలపాలి. ఆ తర్వాత నీటిని వంపేసి మళ్లీ కొత్త నీళ్లు పోయాలి. బియ్యంలో రాళ్లు, ఇసుక లేదా ఇతర చెత్త కనిపిస్తే వాటిని చేత్తో ఏరేయాలి. అలాగే, బియ్యాన్ని ఎక్కువసేపు నీటిలో నానబెట్టాలా వద్దా అనేది ఆ బియ్యం రకంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల బియ్యాన్ని నానబెడితే మంచిది. మరికొన్నింటికి ప్యాకెట్ మీద ఉన్న సూచనలను పాటించడమే ఉత్తమం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: పట్టుచీరల మీదకు అందంగా కనిపించాలా? ఈ గాజులు ట్రై చేయండి
Recommended image2
Early Periods: నెలసరి తొందరగా రావాలా? ఈ ఐదు ఫుడ్స్ తింటే చాలు
Recommended image3
Egg Yolk: గుడ్డులోని పచ్చసొన అధికంగా తింటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ?
Related Stories
Recommended image1
Sadhguru : భూమిపై ఇక 60 పంటలు పండుతాయి.. మట్టిసారంపై సద్గురు ఆందోళన, ప్రపంచానికి వార్నింగ్
Recommended image2
Diwali Vacation: దీపావళి లాంగ్ వీకెండ్‌కు అదిరిపోయే ట్రిప్.. 10 బెస్ట్ డెస్టినేషన్లు.. లైఫ్ టైం మెమొరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved