MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cardamom Powder: మజ్జిగలో చిటికెడు యాలకుల పొడి కలిపి తాగితే ఏం జరుగుతుంది? వచ్చే మార్పులు ఇవే

Cardamom Powder: మజ్జిగలో చిటికెడు యాలకుల పొడి కలిపి తాగితే ఏం జరుగుతుంది? వచ్చే మార్పులు ఇవే

Cardamom Powder: అందరూ యాలకులను వంటలో మంచి సువాసన కోసం వాడుతూ ఉంటారు. కానీ, ఇదే యాలకుల పొడిని మజ్జిగలో చిటికెడు కలిపి తీసుకోవడం వల్ల.. ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 01 2026, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మజ్జిగలో యాలకుల పొడి..
Image Credit : gemini ai

మజ్జిగలో యాలకుల పొడి..

భారతీయులు తమ భోజనంలో రెగ్యులర్ గా పెరుగు భాగం చేసుకుంటూ ఉంటారు. పెరుగును అన్నంలో కలిపి తీసుకోవడమే కాదు.. మజ్జిగ, లస్సీ రూపంలో తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ... లస్సీ, మజ్జిగను తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మరి, అదే మజ్జిగ లేదా లస్సీలో చిటికెడు యాలకుల పొడి కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం...

యాలకుల్లో పోషకాలు...

యాలకులను చాలా సంవత్సరాలుగా వంటల్లో వాడుతూ వస్తున్నాం. మంచి వాసనతో పాటు.. కమ్మనైన రుచిని కూడా అందిస్తుంది. అంతేకాదు, యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని శ్వాసకోస సమస్యల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్ ల ఉత్పత్తికి కూడా ఇవి తోడ్పడతాయి. యాలకులు మంచి మౌత్ ఫ్రెషనర్ గా కూడా హెల్ప్ చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ ఇవి సహాయపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మజ్జిగలో యాలకుల పొడి కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు...
Image Credit : Getty

మజ్జిగలో యాలకుల పొడి కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు...

1. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యాలకుల పొడి కలపడం వల్ల జీర్ణక్రియకు మరింత మద్దతు లభిస్తుంది. పేగుల్లో ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌ అభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది.

2. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయం

పెరుగులో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మరోవైపు యాలకుల్లో మాంగనీస్ ఉంటుంది. ఈ రెండింటి కలయిక రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుందని చెబుతారు. తద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాలను తగ్గించడంలో కూడా తోడ్పడవచ్చు.

33
3. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది
Image Credit : Getty

3. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది

బరువు తగ్గాలనుకునేవారు పెరుగు కి బదులు మజ్జిగ తీసుకుంటూ ఉంటారు. అయితే, ఇందులో చిటికెడు యాలకుల పొడి కలపడం వల్ల శరీరంలోని జీవక్రియ ప్రక్రియలకు మద్దతు లభిస్తుంది. అదనపు బరువు తగ్గించే ప్రయత్నాల్లో ఇది సహాయపడవచ్చు.

4. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది

యాలకుల్లో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడవచ్చు. మరోవైపు పాల ఉత్పత్తులు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. కాబట్టి రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత కలగడంతో పాటు మంచి నిద్రకు కూడా తోడ్పడవచ్చు.

5. చర్మ ఆరోగ్యానికి మేలు

పెరుగులో ఉండే ప్రొటీన్, ప్రోబయోటిక్స్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యాలకుల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది చర్మంపై వచ్చే దద్దుర్లు, వాపు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అందుకే యాలకులు కలిపిన మజ్జిగ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee: మీగడతో చేసే నెయ్యి ఫ్రెష్ గా ఉండాలంటే ఇదొక్కటి ట్రై చేయండి
Recommended image2
Silver Bangles: నేటితరం అమ్మాయిలు మెచ్చే వెండి గాజులు.. సూపర్ డిజైన్స్
Recommended image3
Vitamin B12 Deficiency: ఈ విటమిన్ లోపం ఉంటే కోపం, చిరాకు ఎక్కువ.. సగం గొడవలకు కారణం ఇదే!
Related Stories
Recommended image1
Fish: ఈ చేప తన పిల్లలు నోట్లోనే దాచి మరీ పెంచుకుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
Chanakya Niti: పిల్లల ముందు పేరెంట్స్ అస్సలు చేయకూడని 4 పనులు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved