Health Tips: గోర్ల రంగు ఇలా మారిందా? అయితే జాగ్రత్త వహించాల్సిందే..
Health Tips: గోర్లు అందాన్నే కాదు.. ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. కొంతమంది తమ గోర్లను ఎంత నీట్ గా ఉంచుకున్నా.. గోర్ల మధ్యలో ఈ రంగు పాలిపోతుంది. దీనికి కారణం ఏంటో తెలుసా?

గోర్ల ఒక వ్యక్తి ఎంత పరిశుభ్రంగా, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో తెలియజేస్తాయి. అందులోనూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గోర్ల గురించి ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ గోర్లు వాటి ఆకర్షణను కోల్పోవచ్చు.అంటే గోర్ల మధ్యలో రంగు పాలిపోయి ఉంటుంది. దీనికి అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డార్క్ క్యూటికల్స్ (Dark cuticles) అనేది గోరు పరిశుభ్రతను కోల్పోయే పరిస్థితి. మీరు గోర్లను ఎంత పరిశుభ్రంగా ఉంచినప్పటికీ గోళ్ళ మధ్య రంగు పాలిపోతుంది. దీనికి అనేక కారకాలున్నాయి. అవేంటంటే..
గోళ్ళ మధ్య నలుపు రంగు ఏర్పడటానికి అసలు కారణం.. శరీరం డీహైడ్రేషన్ గురికావడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. అందుకే మీ శరీరానికి సరిపడా నీళ్లను రోజూ తాగుతూ ఉండండి. బాడీ హైడ్రేట్ గా ఉంటే ఇలాంటి సమస్యలు రావు.
వాతావరణంలో మార్పులు కూడా ఈ సమస్యకు దారితీస్తాయి. ప్రధానంగా వాతావరణంలో వేడి పెరిగితే గోర్లు నిర్జలీకరణానికి (Dehydration) గురవుతాయి. లేదా గోర్లను ఎక్కువ సేపు తడపడం వల్ల బ్యాక్టీరియా-ఫంగల్ సంక్రమణ కూడా కారణం కావచ్చు.
మన శరీరంలో వివిధ విధులకు విటమిన్లు చాలా అవసరం అవుతాయి. మన ఒంట్లో విటమిన్ల లోపం ఏర్పడితే ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ బి లోపం ఏర్పడినప్పుడు గోళ్ళ మధ్య ముదురు క్యూటికల్స్ ఏర్పడతాయి. ఇది కాకుండా ఇది ప్రోటీన్, ఇతర పోషకాల లోపం వల్ల కూడా కావచ్చు.
పైన పేర్కొన్న కారణాలతో పాటుగా గోళ్ళ మధ్య నలుపు రంగు ఏదైనా ఇతర ఆరోగ్య పరిస్థితులు, రుగ్మతలకు సంకేతంగా కూడా చూడవచ్చు. సోరియాసిస్, తామర వంటి వ్యాధుల కారణంగా కూడా ఇలా జరుగుతుంది.
కొంతమందికి చర్మానికి సంబంధించిన అలర్జీలు ఉంటే కూడా గోళ్ళ మధ్య నలుపు రంగు ఏర్పడుతుంది. అలాగే కొన్ని చర్మ ఉత్పత్తులు (Skin products)కూడా దీనికి కారణం కావచ్చు.
Dermatologistని కలిసిన తర్వాతే ఇది ఎందువల్ల వచ్చిందని తెలుసుకోగలరు.
వ్యక్తిగత పరిశుభ్రతను పాటించనప్పటికీ గోర్ల రంగు ఇలా మారొచ్చు. ఎందుకంటే.. మురికిని సరిగనప్పుడు గోళ్ల మధ్యన అది పేరుకుపోయినప్పుడు అది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది గోళ్ల అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది.
చేయాల్సిన పనులు...
ఈ విధంగా గోళ్ళ మధ్య నలుపు రంగు ఉంటే మీరు మొదటగా చేయాల్సింది.. మంచి ఆహారాన్ని తీసుకోవడం. అలాగే పుష్కలంగా నీరు తాగుతూ ఉండండి. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోండి. శ్రద్ధ తీసుకున్న తర్వాత కూడా గోర్ల రంగు మారకపోతే.. వైద్యుడిని సంప్రదించండి.