MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Purple Gold: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, పర్పుల్ ఆకులు కేజీ రూ.పదివేలు .. రైతుల పంట పండినట్లే..!

Purple Gold: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, పర్పుల్ ఆకులు కేజీ రూ.పదివేలు .. రైతుల పంట పండినట్లే..!

 Purple Gold: తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు.. అంతర్జాతీయ మార్కెట్ లో భారీ డిమాండ్ కారణంగా రైతులు ఇప్పుడు ఈ పర్పుల్ గోల్డ్ పంటపై దృష్టి పెడుతున్నారు.. అసలు ఏంటి ఈ పర్పుల్ గోల్డ్..? దీనికి ఉన్న డిమాండ్ ఏంటి..? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 11 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏంటి ఈ పర్పుల్ గోల్డ్...? ఎందుకంత స్పెషల్..?
Image Credit : chat GPT

ఏంటి ఈ పర్పుల్ గోల్డ్...? ఎందుకంత స్పెషల్..?

ఒకప్పుడు కాశ్మీర్ అనగానే ముందుగా యాపిల్ తోటలు గుర్తుకొచ్చేవి. ఆ తర్వాత కుంకుమపువ్వు ఫేమస్ అయ్యేది. కానీ.. ఇప్పుడు కాశ్మీర్ రైతులు తమ ఆలోచనను మార్చుకున్నారు. మరో కొత్త రకం వ్యవసాయానికి తెరలేపారు. చాలా మంది రైతులు యాపిల్ సాగు తగ్గించి.. దాని స్థానంలో లావెండర్ సాగుపై శ్రద్ధ చూపుతున్నారు. ఈ పంటకు తక్కువ పెట్టుబడి పెట్టినా.. లాభాలు మాత్రం ఎక్కువ స్థాయిలో వస్తుండటంతో.. అందరూ దీనిపై ఫోకస్ పెడుతున్నారు. దీనిని ‘పర్పుల్ గోల్డ్’ అని పిలుస్తారు. మరి.. ఈ లావెండర్ పంటతో ఎలాంటి లాభాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
యాపిల్ సాగు ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు...?
Image Credit : chat GPT

యాపిల్ సాగు ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు...?

కాశ్మీర్ లో యాపిల్ సాగు ఎన్నో సంవత్సరాలుగా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో వాతావరణంలో మార్పులు, మార్కెట్ ధరల్లో వచ్చే మార్పులు.. అడవి జంతువుల బెడద, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో చాలా మంది రైతులు ఈ పంటను పక్కన పెట్టేసి.. ప్రత్యామ్నాయ పంటల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో.. యాపిల్ తోటలను పక్కన పెట్టేసి.. లావెండర్ పంటలు వేయడం మొదలుపెట్టారు.

లావెండర్ పంటే ఎందుకు వేస్తున్నారు..?

లావెండర్ పంటకు ఇతర పంటలతో పోలిస్తే.. మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఒక్కసారి మొక్కలు నాటితే.. అనేక సంవత్సరాల పాటు దిగుబడి వస్తుంది. అంతేకాదు, ఈ లావెండర్ ఆకుల నుంచి ఎసెన్షియల్ ఆయిల్ కి దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ ఆయిల్ ని చాలా రకాల సుగంధ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, అరోమా థెరపీ, స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

33
  ఈ పంటతో రైతుకు వచ్చే లాభం ఏంటి..?
Image Credit : chat GPT

ఈ పంటతో రైతుకు వచ్చే లాభం ఏంటి..?

లావెండర్ సాగు ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు.. ఈ ఆకుల నూనె ద్వారా అదనంగా ఆదాయం లభిస్తుంది. కేవలం పంటను మాత్రమే కాకుండా..దానితో తయారు చేసే ఉత్పత్తులు అమ్మడం ద్వారా కూడా రైతులు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. ఈ ఆకులను కేజీ రూ. పదివేల వరకు అమ్ముతున్నారు. ఎక్కువ లాభాలు వస్తుండటంతో.. ఈ పంటపైనే ఎక్కువ మంది ఫోకస్ పెడుతున్నారు. అంతేకాదు, ఈ రకం పంటలు వేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. ఈ మొక్కల పెంపకంపై శిక్షణ కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో ఎక్కువ మంది ఈ పంటపై ఆసక్తి చూపిస్తున్నారు.

పర్యాటకులను ఆకర్షిస్తున్న లావెండర్ తోటలు..

కాశ్మీర్ పర్యటనకు వెళ్లే టూరిస్టలను ఈ లావెండర్ తోటలు చాలా ఆకర్షిస్తున్నాయి. వాటిని చూడటానికి, ఆ తోటల్లో ఫోటోలు దిగడానికి ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికి వెళ్తున్నారు. పర్యాటకులను ఆకర్షిస్తుండటంతో.. ప్రభుత్వం కూడా వీటిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Floating Village: గ్రామం మొత్తం నీటిపైనే తేలుతుంది..ఇంట్లో కి అడుగుపెట్టాలన్నా నీటిలో ఈదాల్సిందే
Recommended image2
Luxury Trains: ఈ రైళ్ల ముందు.. విమానం కూడా దిగదుడుపే, 5స్టార్ హోటల్ భోజనం.. మన దేశంలో లగ్జరీ రైళ్లు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved