MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Floating Village: గ్రామం మొత్తం నీటిపైనే తేలుతుంది..ఇంట్లో కి అడుగుపెట్టాలన్నా నీటిలో ఈదాల్సిందే

Floating Village: గ్రామం మొత్తం నీటిపైనే తేలుతుంది..ఇంట్లో కి అడుగుపెట్టాలన్నా నీటిలో ఈదాల్సిందే

 Floating Village: నీటిపై పడవ తేలుతుంది. ఆ పడవలాగా.. ఇల్లు కూడా నీటిపై తేలితే.. ఒక్క ఇల్లు కాదు.. ఒక ఊరు ఊరంతా.. నీటిపైనే ఉంటే..ఎలా ఉంటుంది. ఇలాంటి వింత గ్రామాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 10 2026, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నీటిలో తేలాడే గ్రామాలు...
Image Credit : chat GPT

నీటిలో తేలాడే గ్రామాలు...

నీటిలో తేలియాడే ఊరు ఎప్పుడైనా చూశారా? మన కాళ్ల కింద మట్టి కాకుండా నీళ్లు తగిలితే ఎలా ఉంటుంది..? పిల్లలు నడవడం కంటే ముందే ఈత నేర్చుకుంటే ఎలా ఉంటుంది.. ఎప్పుడైనా ఇలా ఊహించుకున్నారా? నిజంగా ఇలా నీటిలో తేలాడుతూ సంవత్సరాలపాటుగా జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయని మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా నీటిపై తేలాడుతూ ఉండే గ్రాములు కొన్ని ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి..? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
  1.ఉరోస్ దీవులు
Image Credit : chat GPT

1.ఉరోస్ దీవులు

నీటి మీద తేలాడే గ్రామాల్లో ఉరోస్ దీవులు కూడా ఒకటి. టిటికాకా సరస్సు మీద ఈ గ్రామం తేలి ఆడుతూ ఉంటుంది.ఈ గ్రామంలో కొన్ని శతాబ్దాలుగా ప్రజలు జీవిస్తున్నారు. అయితే.. మనలాగా వాళ్లు ఇసుక, ఇటుక, సిమెంట్ తో ఇంటిని నిర్మించుకోలేరు. కాబట్టి టోటోరా రైలు అనే మొక్కను కలపగా వాడి.. వారు ప్రత్యేకంగా ఇంటిని నిర్మించుకుంటారు. ఇది నీటిపై తేలుతూ ఉంటుంది. అందుకే.. వారి జీవనం సజావుగా సాగుతుంది.దాదాపు 2వేల మంది ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఇక.. వీరు పందులు, బాతులు వంటి జంతువులను కూడా ఇక్కడ పెంచుతూ ఉంటారు.

34
గాన్వీ..
Image Credit : Asianet News

గాన్వీ..

నీటిపై తేలాడే మరో గ్రామం గాన్వీ. బెనిన్ లోని నోకౌయే సరస్సు లో ఈ గాన్వీ గ్రామం ఉంటుంది.ఈ గ్రామానికి వెళ్లాలంటే పడవల్లోనే వెళ్లాలి. ఇక.. ఈ గ్రామ ప్రజలు నీటిలో తేలాడే చెక్కతో ఇంటిని నిర్మించుకున్నారు. ఇక్కడ 20 వేల మందికి పైగా నివసిస్తున్నారు.ఈ గ్రామానికి యూనెస్కో గుర్తింపు కూడా ఉంది.

3.టోన్లే స్లాప్ సరస్సు..

ఆగ్నేయాసియాలో ఉన్న మంచి నీటి సరస్సు టోన్లే సాఫ్ సరస్సు. ఈ సరస్సులో ఒకటి కాదు రెండు కాదు దాదాపు 170 నీటిపై తేలాడే గ్రామాలు ఉన్నాయి. వెదురు, కలప, నీటితో తేలాడే సీసాలతో ఇక్కడి ప్రజలు ఇంటిని నిర్మించుకుంటారు. కేవలం ఇల్లు మాత్రమే కాదు దేవాలయాలు, పాఠశాలలు అన్నీ వీరు నిర్మించుకోవడం విశేషం.

44
ఇన్లే సరస్సు
Image Credit : Asianet News

ఇన్లే సరస్సు

మయన్మార్ లోని షాన్ కొండల్లో ఉంది ఇన్లే సరస్సు ఉంది. ఈ సరస్సు దాదాపు 22 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ నీటిపై తేలాడే గ్రామాలు చాలా ఉంటాయి. ఇక్కడి ప్రజలు వ్యవసాయం కూడా చేస్తారు. ఎక్కువగా చేపల వేట వీరి జీవన ఆధారం. ఈ గ్రామంలో ప్రజలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమను మార్చుకుంటారు. ముఖ్యంగా ఒంటి కాలిపై తమ బాడీని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఒక కాలితో బ్యాలెన్స్ చేస్తూ.. మరో కాలితో చెక్క పడవలను నడుపుతారు. వీరు నీటిపై తేలాడే మొక్కలను పెంచి.. వాటితో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇది వీరి ప్రత్యేకత.

ఈ గ్రామాల్లో ప్రజలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పెరుగుతారు. ముఖ్యంగా పిల్లలు చిన్నతనంలోనే ఈత నేర్చుకుంటారు. జీవన ఆధారం కోసం చేపలు పట్టడం లాంటివి కూడా చేయించుకుంటారు. మనం రెగ్యులర్ గా చూసే ప్రపంచం కంటే వీరి జీవితం చాలా భిన్నంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Generic Medicine: జనరిక్ మెడిసిన్ అంటే ఏమిటి? జనరిక్ మందులకు, బ్రాండెడ్ మందులకు తేడా ఏమిటి?
Recommended image2
Lost Rivers India: ఇండియాలో కనిపించకుండా మాయమైపోయిన నదులు ఇవి.. అసలు కారణాలు ఏంటి?
Recommended image3
DMart: సూపర్ మార్కెట్లో క్యారీ బ్యాగ్ కు డబ్బులు కడుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసుకోండి
Related Stories
Recommended image1
Luxury Trains: ఈ రైళ్ల ముందు.. విమానం కూడా దిగదుడుపే, 5స్టార్ హోటల్ భోజనం.. మన దేశంలో లగ్జరీ రైళ్లు ఇవే..!
Recommended image2
Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved