MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందా? అయితే మీకు ఈ వ్యాధి వచ్చుంటుంది.. టెస్ట్ చేయించుకోండి

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందా? అయితే మీకు ఈ వ్యాధి వచ్చుంటుంది.. టెస్ట్ చేయించుకోండి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందా? అయితే మీకు ఈ ప్రమాదకరమైన జబ్బు ఉండొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఊపిరిత్తుల సమస్య వల్లే వస్తుందని చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 04 2022, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో ఊపిరితిత్తులు ఒకటి. ఇది చాలా సున్నితమైన భాగం కూడా. న్యూమోనియా, జలుబు, ట్యాక్సిన్స్ వంటి సమస్యల వల్ల ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కలుగుతుంది. అయితే కొంతమంది ఊపిరితిత్తులు నీటితో నిండిపోతాయి. కానీ ఈ విషయం మాత్రం వాళ్లకు తెలియదు. ఇలా ఊపిరితిత్తుల్లో నీరు నిండటాన్నని పల్మనరీ ఎడెమీ అని అంటారు. ఇది ప్రమాదకరమైన జబ్బు. ఊపిరితిత్తుల్లో నీరు నిండుకుంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పల్మనరీ ఎడెమా లక్షణాలు

ఊపిరితిత్తుల్లో నీరు నిండుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. మీరుు పల్మనరీ ఎడెమా బారిన పడితే శ్వాస సరిగ్గా తీసుకోలేరు. అలాగే ఛాతిలో నొప్పి కలుగుతుంది. చంచలత, ఆందోళన, చెమట విపరీతంగా పట్టడం, దగ్గు, గుండె కొట్టుకోవడం పెరగడం, శ్వాస తీసుకునేటప్పుడు ఉబ్బరం, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్య పెరిగితే కాళ్లలో వాపు కనిపిస్తుంది. 
 

35

ఎలాంటి ఆహారం తీసుకోవాలి

పల్మనరీ ఎడెమా సమస్య ఉంటే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ రోజు వారి ఆహారంలో పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. ఆకు పచ్చకూరగాయలు, తాజా పండ్లు, చిక్కుళ్లు, చేపలు, చికెన్, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నిమ్మకాయ, నల్ల మిరియాలు, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 
 

45

ఏవి తినకూడదు

ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఉప్పు ను తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో సోడియం తీసుకుంటే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఇకపోతే ఈ సమస్య ఉన్నప్పుడు చల్లని పదార్థలను కూడా తినకూడదు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. 
 

55
smoking

smoking

ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి

సిగరేట్, ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఇక ఊపిరితిత్తులో ఎలాంటి సమస్య ఉన్నా.. సిగరేట్లు కాల్చడం, మందుకొట్టడం మానుకోవాలి.  లేదంటే ఇవి మీ ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తాయి. ఈ చిట్కాలను పాటించినా.. మీ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మర్చిపోకండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Curry Leaf: కుండీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కరివేపాకును పెంచండిలా
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Long Haaram: చీరల మీదకు ఒక్క లాంగ్ హారం ఇలాంటిది ఉంటే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved