కుండీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లో కరివేపాకు మొక్కను పెంచండిలా
life Jul 26 2026
Author: Haritha Chappa Image Credits:Getty
Telugu
ఎంత బ్యాగు కావాలి
మీరు మార్కెట్లో నల్లగా, మందంగా ఉండే గ్రో బ్యాగ్ కొనుక్కోవచ్చు. లేదా ఇంట్లో మందపాటి ప్లాస్టిక్ బ్యాంగు ఉన్నా వాడుకోవచ్చు. కరివేపాకు మొక్క కోసం 12x12 సైజు ఉన్న బ్యాగ్‌ను ఎంచుకోండి.
Image credits: Getty
Telugu
మట్టి మిశ్రమం ఇలా వేయండి
ప్లాస్టిక్ బ్యాగులో మట్టి, పశువుల ఎరువు, కోకోపీట్ సమానంగా కలిపి వేయండి. దీనికి కొద్దిగా వేపపిండి కలిపితే వేరు కుళ్లిపోవడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి
.
Image credits: Getty
Telugu
ఎండ తగలాలి
మట్టిలో కరివేపాకు మొక్కను నాటి నీళ్లు చల్లి ప్రతిరోజూ కనీసం 5–6 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చూసుకోవాలి.
Image credits: Getty
Telugu
నీరు నిలవకూడదు
మట్టి తడిగా ఉండే నీరు అవసరం లేదు. మట్టి పొడిగా ఉండే నీళ్లు వేయాలి. నీరు ఎక్కువగా నిలిచిపోతే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది
Image credits: Getty
Telugu
పుల్లటి మజ్జిగ
బాగా పులిసిన మజ్జిగలో పది రెట్లు నీళ్లు కలిపి మొక్కపై చల్లుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొక్క వేగంగా పెరగడమే కాకుండా, ఆకులు పచ్చగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
వేరుశనగ చెక్క
వేరుశనగ చెక్కను మూడు రజులు నీటిలో నానబెట్టి పులియబెట్టాలి. ఆ తర్వాత, దానికి ఎక్కువ నీటిని కలిపి పల్చగా చేసి రెండు వారాలకు ఒకసారి మొక్కకు పోయాలి.
Image credits: Getty
Telugu
వెల్లుల్లి-వేప నూనె
ఆకులపై తెల్లటి చుక్కలు, పురుగులను నివారించడానికి వెల్లుల్లి-వేప నూనె ఆకులపై చల్లితే మంచిది. ఇలా పాటిస్త కరివేపాకులు బ్యాగులో పచ్చగా ఎదుగుతుంది.