MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Pressure Cooker: కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? ఇలా చేస్తే వాటర్ బయటకు రాదు

Pressure Cooker: కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? ఇలా చేస్తే వాటర్ బయటకు రాదు

Pressure Cooker:  ప్రెజర్ కుక్కర్ విజిల్ వచ్చిన ప్రతిసారీ.. నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయా? దీని వల్ల స్టవ్ మొత్తం పాడైపోతుందా? అయితే,  సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. పాత కుక్కర్ అయినా సరే వాటర్ లీక్ అవ్వదు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 27 2026, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రెజర్ కుక్కర్...
Image Credit : Instagram

ప్రెజర్ కుక్కర్...

ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రెజర్ కుక్కర్ ఉండటం చాలా సహజం. దాదాపు అందరూ పప్పు, అన్నం లాంటివి అందులోనే వండుతూ ఉంటారు. ప్రెజర్ కుక్కర్ లో వంట చాలా తొందరగా అవుతుంది. టైమ్ కలిసొస్తుంది. అందులో వంట చేయడం కూడా చాలా సులువు. అయితే… వచ్చిన సమస్యల్లా.. పప్పు, అన్నం ఉడికేటప్పుడు  కుక్కర్ నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి.  అయితే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే….వాటర్ లీకేజ్ నుంచి బయటపడొచ్చు.  అదెలాగో ఇప్పుడు చూద్దాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కుక్కర్ మూత ఎప్పుడు పెడుతున్నారు..?
Image Credit : stockPhoto

కుక్కర్ మూత ఎప్పుడు పెడుతున్నారు..?

చాలా మంది కుక్కర్ సరిగా వాడకపోవడం వల్ల వాటర్ లీకేజ్ అవుతుంది.  పప్పు, రాజ్మా లాంటివి వండేటప్పుడు కుక్కర్ లో పప్పు, నీళ్లు వేసి మూత పెట్టి.. ఆ తర్వాత.. పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటారు. కానీ.. ఇది సరైన పద్దతి కాదు. ఇలా చేయడం వల్లే.. కుక్కర్ లీక్ అయ్యి.,. వాటర్ బయటకు వస్తుంది.

కుక్కర్ ని వాడే అసలైన పద్ధతి….

 ముందుగా.. ఖాళీ కుక్కర్ ని గ్యాస్ పై పెట్టాలి. సుమారు 10 సెకన్ల తర్వాత కుక్కర్ కొద్దిగా వేడి ఎక్కుతుంది. ఆ తర్వాత.. కుక్కర్ లో పప్పు, నీళ్లు పోయాలి. దానికి అవసరమైన ఉప్పు, పసుపు కూడా వేయాలి. 50 నుంచి 60 సెకన్ల ఆగితే… నీరు వేడెక్కుతుంది. నీరు వేడెక్కి ఆవిరి రావడం మొదలైన తర్వాత కుక్కర్ కి మూత పెట్టాలి.

34
ఇదే సరైన పద్ధతి....
Image Credit : freepic and meta ai photo

ఇదే సరైన పద్ధతి....

ఇలా ఆవిరి వస్తున్నప్పుడు మూత పెట్టడం వల్ల నీళ్లు బయటకు పొంగవు, మీ వంటగది కూడా పాడవ్వదు. మీరు ఏ సైజు కుక్కర్ వాడినా కూడా ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. 

పప్పు కన్నా ముందే తాలింపు పెట్టాల్సి వస్తే, గ్యాస్ ఆన్ చేసిన వెంటనే నూనె వేయకండి. ముందుగా ఖాళీ కుక్కర్‌ను పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేడెక్కనివ్వాలి (సుమారు 10-15 సెకన్లు). కుక్కర్ వేడెక్కిన తర్వాత నూనె వేసి, అది కాగాక ఆవాలు, జీలకర్ర లేదా కూరగాయలు వేసి తాలింపు రెడీ చేయాలి. తాలింపు అయ్యాక పప్పు, నీళ్లు పోసినప్పుడు, కుక్కర్ అప్పటికే వేడిగా ఉండటంతో నీళ్లు త్వరగా మరగడం మొదలవుతుంది. నీళ్లు మరిగి ఆవిరి రావడం మొదలయ్యాక మాత్రమే మూత పెట్టాలి.

44
ఈ ట్రిక్ ఎలా పని చేస్తుంది..?
Image Credit : Asianet News

ఈ ట్రిక్ ఎలా పని చేస్తుంది..?

సాధారణంగా మనం చల్లటి నీళ్లు పోసి వెంటనే కుక్కర్ మూత పెట్టినప్పుడు, కుక్కర్ లోపలి గాలి, నీరు రెండూ ఒకేసారి వేడెక్కి, పీడనం పెరిగేకొద్దీ నీటిని బయటకు నెట్టేస్తాయి. కానీ, ఈ  ట్రిక్ పాటిస్తే.. కుక్కర్ ముందే వేడెక్కి ఆవిరి వచ్చిన తర్వాత మూత పెడితే, ఆ ఆవిరి పీడనం నీటిని కిందకు అదిమి పట్టి, కేవలం ఆవిరి మాత్రమే విజిల్ ద్వారా బయటకు వస్తుంది. దీంతో నీళ్లు బయటకు పొంగడం ఆగిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Related Stories
Recommended image1
Maggi Masala: పది నిమిషాల్లో ఇంట్లోనే మ్యాగీ మసాలా..ఎలా తయారు చేయాలో తెలుసా?
Recommended image2
AC Explode: ఈ పొరపాట్లు చేస్తే.. ఏసీలు బాంబ్ లా పేలిపోతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved