గర్భిణులు పెద్ద పెద్ద సౌండ్లను వినడం ఇంత డేంజరా..?
గర్భిణులు పెద్దగా సౌండ్ పెట్టుకుని సాంగ్స్ విన్నా.. బయట హారన్, పాటలు వంటి పెద్ద పెద్ద శబ్దాలను విన్నా.. బిడ్డ చెవిటి వాడు లేదా.. నెలలు నిండాకుండానే పుట్టే ప్రమాదం ఉంది.
గర్భధారణ అనేది తల్లికీ, బిడ్డకు చాలా సున్నితమైన సమయం. ఈ సమయంలో తల్లి చేసే ప్రతి పని బిడ్డపై ప్రభావం చూపుతుంది. అందుకే గర్భిణులు చాలా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద శబ్దాలను అసలే వినకూడదు. ఎందుకంటే ఎప్పుడూ శబ్దాలను వినడం వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఆరో నెల నుంచే కడుపులో పెరుగుతున్న బిడ్డకు శబ్దాలు వినిపిస్తాయి. ఇలాంటి సమయంలో గర్భిణులు పెద్ద పెద్ద శబ్దాలను వినడం అస్సలు మంచిది కాదు. ఒక వేళ వింటే బిడ్డకు చెవికి సంబంధించిన సమస్యలు వస్తే.. తల్లి ఒత్తిడికి గురవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు పెద్ద శబ్దాలను వినకుండా ఉండండి.
అన్ని రకాలు శబ్దాలు గర్భిణీ స్త్రీలకు మంచివి కావు. ముఖ్యంగా అసౌకర్యంగా అనిపించే ధ్వనులను అసలే వినకూడదు. ఇవి మీ బిడ్డను ప్రమాదంలో పడేస్తాయి. ట్రాఫిక్, ఎమర్జెన్సీ సైరన్ లు, లౌడ్ స్పీకర్ లు, పేలుళ్లు, పెద్ద సంగీతం, మెషిన్ ల నుంచి పెద్ద శబ్దాలు వినడం వల్ల గడుపులో పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. అందేకాదు ఇది బిడ్డకు వినికిడి సమస్యలను కలిగిస్తుంది కూడా. అలాగే బిడ్డ నెలలు నిండకుండానే పుట్టొచ్చు. గర్భిణులు పెద్ద శబ్దాలను వినడం వల్ల బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం..
వినికిడి సమస్య : గర్భిణులు ఎక్కువ శబ్దాన్నివింటే బిడ్డకు వినికిడి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంటే మీ బిడ్డకు చెవులు మొత్తమే వినిపించకపోవచ్చు. లేదా ఇతర చెవి సమస్యలు కలగొచ్చు.
అపరిపక్వత : గర్భిణీ స్త్రీలు పెద్ద పెద్ద శబ్దాలను వినడం వల్ల పిండం పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. ఇది మీ పిల్లవాడిని మానసికంగా బలహీనంగా చేస్తుంది. ఇది బిడ్డ ఎదుగుదలకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉంది.
నెలలు నిండకుండానే పుట్టడం: గర్భధారణ సమయంలో పెద్ద శబ్దాలను వినడం వల్ల బిడ్డ నెలలు నిండకుండానే పుడతాడు. ఇది తల్లితో పాటుగా బిడ్డకు కూడా ప్రమాదకరం. బిడ్డ ముందుగా పుడితే.. చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే గర్భిణులు పెద్ద పెద్ద శబ్దాలకు దూరంగా ఉండాలి.
పుట్టుకతో లోపాలు రావడం: పుట్టుకతో వచ్చే లోపాలు పిల్లలను శారీరకంగానే కాదు మానసికంగా కూడా ప్రభావితం చేస్తాయి. బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలకు పెద్ద పెద్ద శబ్దాలను వినడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు పెద్ద శబ్దం ఉన్న చోటికి వెళ్లకపోవడమే మంచిది.
పెద్ద శబ్దాలుగర్భిణీ స్త్రీల వినికిడి వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంటే శబ్దాల వల్ల వీరు చెవిటివాళ్లుగా మారిపోయే ప్రమాదం ఉంది. గర్భిణులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విశ్రాంతినివ్వాలి. టైం ప్రకారం నిద్రపోవాలి. దీనివల్ల శబ్దాలను వినలేరు.. ఒత్తిడికీ లోనుకాలేరు.
విపరీతమైన సౌండ్స్ ను వింటే గర్భిణులు ఒత్తిడికి బాగా గురవుతారు. ఒత్తిడి హార్మోన్ల పెరుగుదల పిల్లవాడు నెలలు నిండకుండానే పుట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే గర్భిణులు ఎలాంటి సౌండ్స్ వినిపించని ప్లేస్ లో ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు 80 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ తో 8 గంటల వరకు పాటలు వింటే.. పిల్లవాడు నెలలు నిండకుండానే పుట్టు అవకాశం పెరుగుతుంది. అంతేకాదు ఎప్పుడూ సౌండ్స్ ను వినడం వల్ల బిడ్డ బరువు పెరిగే అవకాశం ఉండదు.