MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇంట్లో పెంచే మందార మొక్క‌ల‌కు తెల్ల పురుగులు ఎందుకుప‌డ‌తాయి.? వీటికి ఎలా చెక్ పెట్టాలి

ఇంట్లో పెంచే మందార మొక్క‌ల‌కు తెల్ల పురుగులు ఎందుకుప‌డ‌తాయి.? వీటికి ఎలా చెక్ పెట్టాలి

Planting: మందారం, గులాబీ, మల్లె,  కరివేపాకు వంటి మొక్కలను చాలా మంది ఇంటి ఆవరణలో పెంచుకుంటారు. అయితే వీటికి తరచుగా తెల్లనల్లి, పేనుబంక, మెలీబగ్స్, అఫిడ్స్ వంటి చిన్న పురుగులు సోకి మొత్తం మొక్క దెబ్బ తింటుంది. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టే చిట్కాలివే. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 04 2026, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొక్కలకు నల్లి పురుగులు ఎందుకు పడతాయి?
Image Credit : Gemini AI

మొక్కలకు నల్లి పురుగులు ఎందుకు పడతాయి?

తెల్లనల్లి, పేనుబంక వంటి పురుగులు సాధారణంగా మొక్కల లేత ఆకులు, కొత్త కొమ్మలపై ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మొక్కలోని రసాన్ని పీలుస్తూ జీవిస్తాయి. ఈ పురుగులు రావడానికి మొక్కలకు సరైన గాలి ప్రసరణ లేకపోవడం, అధిక తేమ ఉండటం, కుండీల్లో నీరు నిల్వ ఉండటం, బలహీనమైన మొక్కలు, ఎక్కువగా నత్రజని ఎరువులు వేయడం వంటివి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పొచ్చు. ఈ పురుగులు పెరిగిన తర్వాత ఆకులు ముడుచుకుపోవడం, పసుపు రంగులోకి మారడం, పూలు రాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టే కొన్ని స‌హ‌జ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేపనూనె స్ప్రే.. సహజమైన ఉత్తమ పరిష్కారం
Image Credit : Gemini AI

వేపనూనె స్ప్రే.. సహజమైన ఉత్తమ పరిష్కారం

మొక్కలకు వచ్చే చాలా రకాల పురుగులను నియంత్రించడంలో వేపనూనె అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేప నూనెను త‌యారు చేయ‌డానికి ఒక లీటర్ నీరు, 5 మిల్లీలీటర్ల వేపనూనె, అర టీస్పూన్ లిక్విడ్ సోప్ తీసుకోవాలి. అనంత‌రం ఈ మూడింటిని బాగా కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి.

ఎలా ఉపయోగించాలి?

సాయంత్రం సమయంలో ఆకుల పైభాగం, కింద భాగం, కొమ్మలపై పూర్తిగా స్ప్రే చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. వేపనూనె పురుగుల పెరుగుదలను అడ్డుకుని వాటి జీవచక్రాన్ని దెబ్బతీస్తుంది.

Related Articles

Related image1
Train: రైలు ఇంజన్ అద్దానికి ఇనుప జాలిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఆలోచించారా.?
Related image2
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
35
వెల్లుల్లి-మిర్చి స్ప్రేతో పురుగులకు చెక్
Image Credit : Gemini AI

వెల్లుల్లి-మిర్చి స్ప్రేతో పురుగులకు చెక్

ఇంట్లోనే తయారుచేసుకునే మరో మంచి సహజ మందు వెల్లుల్లి, పచ్చిమిర్చి మిశ్రమం. ఈ మిశ్ర‌మాన్ని త‌యారు చేయ‌డానికి 10 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చిలు, ఒక లీటర్ నీరు తీసుకోవాలి. అనంత‌రం వీటిని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు వడకట్టి స్ప్రేగా వాడాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వెల్లుల్లిలోని సహజ గంధకం, మిర్చిలోని కారపు పదార్థాలు పురుగులను దూరం చేస్తాయి. ముఖ్యంగా మందారం మొక్కలపై కనిపించే తెల్లనల్లి సమస్యకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

డిష్ వాష్ లిక్విడ్ ఉపయోగించే విధానం

మొక్కలపై పురుగులు ఎక్కువగా కనిపించినప్పుడు సబ్బు ద్రావణం కూడా మంచి ఫలితం ఇస్తుంది. సబ్బు ద్రావణం, ఒక లీటర్ నీటిలో ఒక టీస్పూన్ డిష్ వాష్ లిక్విడ్ కలపాలి. ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తే పురుగుల శరీరంపై ఉండే రక్షణ పొర దెబ్బతింటుంది. దీంతో అవి త్వరగా చనిపోతాయి. అలాగే.. కాటన్‌ను కొద్దిగా ఐసోప్రొపిల్ ఆల్కహాల్‌లో ముంచి పురుగులపై నేరుగా రాయవచ్చు. అయితే ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ వాడకూడదు. లేదంటే ఆకులు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

45
పురుగులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు
Image Credit : Gemini AI

పురుగులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు

పురుగులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. వారానికి కనీసం రెండు సార్లు మొక్కలను పరిశీలించాలి. ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించాలి. కుండీల్లో నీరు నిల్వ ఉండనివ్వకూడదు. మొక్కల మధ్య తగినంత దూరం ఉంచాలి. నెలకు ఒకసారి వేపపిండి వేయాలి. ఉదయం సూర్యరశ్మి బాగా అందే చోట మొక్కలను ఉంచాలి. కొత్తగా తెచ్చిన మొక్కలను వెంటనే ఇతర మొక్కల దగ్గర పెట్టకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే తెల్లనల్లి, పేనుబంక వంటి పురుగులు ఎక్కువగా వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.

55
మొక్కల ఆరోగ్యమే పూల అందానికి మూలం
Image Credit : Gemini AI

మొక్కల ఆరోగ్యమే పూల అందానికి మూలం

మందారం వంటి పూల మొక్కలకు నల్లి పురుగులు పట్టడం సాధారణమే అయినప్పటికీ, సరైన సమయంలో గుర్తించి చర్యలు తీసుకుంటే వాటిని పూర్తిగా నియంత్రించవచ్చు. వేపనూనె, వెల్లుల్లి-మిర్చి స్ప్రే, సబ్బు ద్రావణం వంటి సహజ పద్ధతులు మొక్కలకు ఎలాంటి హాని చేయకుండా మంచి ఫలితాలు ఇస్తాయి. క్రమం తప్పకుండా మొక్కల సంరక్షణ చేపడితే అవి ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ పూలతో ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తోటపని
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: ఏ వయసు వారికైనా సూటయ్యే గోల్డ్ బాలీ ఇయర్ రింగ్స్ ..!
Recommended image2
Pearl Choker: మీ అందాన్ని మరింత పెంచే ముత్యాల చోకర్.. సూపర్ డిజైన్లు
Recommended image3
AC temperature : ఏసీ టెంపరేచర్ 24 డిగ్రీలే ఎందుకు ఉండాలి? తగ్గినా, పెరిగినా ప్రాబ్లం ఏంటి..?
Related Stories
Recommended image1
Train: రైలు ఇంజన్ అద్దానికి ఇనుప జాలిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఆలోచించారా.?
Recommended image2
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved