MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Paneer 65: సాయంకాలం వేడివేడిగా క్రిస్పీగా పనీర్ 65 తినాలనుందా.. ఇదిగో రెసిపీ

Paneer 65: సాయంకాలం వేడివేడిగా క్రిస్పీగా పనీర్ 65 తినాలనుందా.. ఇదిగో రెసిపీ

Paneer 65:  హోటల్ లో దొరికే పనీర్ 65 గుర్తొస్తేనే నోరూరిపోతుంది. పనీర్ 65 చేసి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీని రెసిపీ ఇక్కడ మేము సింపుల్ గా చెప్పాము. ఇలా చేస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 06 2026, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పనీర్ 65 రెసిపీ
Image Credit : Getty

పనీర్ 65 రెసిపీ

పనీర్ ముక్కల్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ఉంచాలి. ఆ మిశ్రమంలో ఈ పనీర్ ముక్కలను వేసి పావుగంట పాటూ నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలా పనీర్ లోపలి వరకు ఇంకుతుంది. మంచి రుచిని ఇస్తుంది. 

ఇక క్రిస్పీగా రావడం కోసం పిండిని తయారుచేసుకోవాలి.మైదా లేదా కార్న్‌ఫ్లోర్‌ తో పాటూ కొద్దిగా బియ్యం పిండి, రవ్వ ఒక గిన్నెలో వేసుకోవాలి. పిండిలో కొద్దిగా గట్టి పెరుగు, ఇంగువ వేసి కలిపితే, వేయించినప్పుడు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మసాలా తయారు చేసుకోండి
Image Credit : Getty

మసాలా తయారు చేసుకోండి

బయట దొరికే మసాలాలకు బదులుగా ఇంట్లోనే మసాలాను తయారుచేసుకోవాలి. ఇందుకోసం జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండు మిర్చిని కళాయిలో వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడి రెస్టారెంట్ రుచిని మించిపోయే అద్భుతమైన వాసనను ఇస్తుంది.

34
పనీర్ ఫ్రై చేయండి
Image Credit : Getty

పనీర్ ఫ్రై చేయండి

ఇప్పడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి. నూనె వేడెక్కాక మీడియం మంట మీద పెట్టండి. ముందుగా మారినేట్ చేసుకున్న పనీర్‌ ముక్కును నూనెలో వేసి మీడియం మంటపై వేయించి బయటకు తీయాలి. అవి కాస్త చల్లారిన తర్వాత, మళ్లీ వేడి నూనెలో కొన్ని సెకన్ల పాటు వేయించండి. ఇలా చేయడం వల్ల పనీర్ రబ్బరులా సాగకుండా, బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటుంది. ఇలా అన్నీ పనీర్ ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

44
తాలింపు ఇలా పెట్టుకోండి
Image Credit : Getty

తాలింపు ఇలా పెట్టుకోండి

ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి అందులో  ఒక స్పూను నెయ్యి వేయాలి. అందులో  కరివేపాకు, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి వేయించాలి. ఆ తర్వాత వేయించిన పనీర్ ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి.  అంతే పనీర్ 65 సిద్ధమైనట్టే.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Tips: కూర వండే ముందు.. కూరగాయల్ని ఎలా శుభ్రం చేయాలి?
Recommended image2
Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్
Recommended image3
లిప్‌స్టిక్‌ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి
Related Stories
Recommended image1
Dogs and Bikes: బైకులు, కార్ల వెనుక కుక్కలు ఎందుకు వెంటపడతాయి? అసలు కారణాలు ఇవే!
Recommended image2
Fish: ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే తినాల్సింది చేపలు.. మాంసం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved