ముక్కులో వేలు పెట్టే అలవాటుందా? ఈ వ్యాధే కావొచ్చు.. చెక్ చేసుకోండి
ముక్కులో వేలు పెట్టే అలవాటు వల్ల మెదడు బలహీనపడుతుంది. దీనవల్ల మెదడులోని నరాలు కుంచించుకుపోతాయి. ఈ ముక్కులో వేలు పెట్టే అలవాటు అల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కొంతమందికి ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. నలుగురిలో కూర్చున్నప్పుడు కూడా ఎదుటివారు ఎమనుకుంటారు అని అనుకోకుండా ముక్కులో వేలు పెట్టేస్తుంటారు. కానీ ఈ అలవాటు అంత మంచిది కాదు. ఈ అల్జీమర్స్ , చిత్తవైకల్యం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. గ్రిఫిత్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ పరిశోధన ఎలుకలపై జరిగింది. మన ముక్కులో ఘ్రాణ నాడి ఉంటుంది. ఇది నేరుగా మన మెదడుతో అనుసంధానించబడి ఉంటుంది. ముక్కులో వేలు పెట్టినప్పుడు.. ఈ ఘ్రాణ నాడి ద్వారా బ్యాక్టీరియా, వైరస్ లు నేరుగా మెదడులోని కణాలకు చేరుతాయి. దీంతో మెదడు వ్యాధులు వస్తాయి.
చిత్త వైకల్యం, ఆల్టీమర్స్
చిత్తవైకల్యం నాడీకి సంబంధించిన ఒక రుగ్మత. దీనిలో మెదడు నరాలు కుంచించుకుపోవడం ప్రారంభమవుతాయి. దీనిలో కణాలు నాశనం అవుతుంటాయి. దీనివల్ల మెదడు కణాలు చురుగ్గా ఉండవు. చిత్తవైకల్యం వల్ల మెదడు హిప్పోకాంపస్ భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఇది విషయాలను గుర్తించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ చిత్తవైకల్యం వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. అల్జీమర్స్ చిత్తవైకల్యానికి మరో రూపం.
అల్జీమర్స్ కారణాలు
క్లామిడియా న్యూమోనియా అని పిలిచే బ్యాక్టీరియా అల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది. ఇది ముక్కు నుంచి ఘ్రాణ నాడి ద్వారా మన నాడీ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. ఈ తర్వాత మెదడు వ్యాధులకు కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల అమిలాయిడ్ బీటా ప్రోటీన్ మెదడులో ఉత్పత్తి అవుతుంది. ఇది చిత్తవైకల్యం, అల్జీమర్ వ్యాధికి కారణమవుతుంది.
అల్జీమర్స్, చిత్తవైకల్యం లక్షణాలు
విషయాలను మర్చిపోవడం, వాటిని మళ్లీ అడగడం.
ఊర్లపేర్లు, మనుషుల పేర్లను మర్చిపోవడం
వస్తువులను ఎక్కడో పెట్టి మర్చిపోవడం
కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఇబ్బంది
అల్జీమర్స్ మధ్యదశ లక్షణాలు
జ్ఞాపకశక్తి తగ్గడం వల్ల ఒక పనిని పదేపదే చేయడం.
నిద్రలేమి సమస్య వస్తుంది. మెదడులో బరువుగా అనిపిస్తుంది.
వినడం, చూడటం, వాసన చూడటంలో ఇబ్బంది పడటం.
అల్జీమర్స్ తీవ్రమైన లక్షణాలు
వేగంగా బరువు తగ్గుతారు
స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. జ్ఞాపకశక్తి బలహీనంగా మారుతుంది.
ఆహారం తినడానికి ఇబ్బంది.
అల్జీమర్స్ ను ఎలా నివారించాలి
అల్జీమర్స్ ను నివారించాలంటే.. కొన్ని అలవాట్లను వదులుకోవాల్సి ఉంటుంది. దీనిని నివారించాలంటే ముక్కులో వేలు పెట్టడం మానుకోవాలి. పొగకు దూరంగా ఉండాలి. మెదడును బలంగా చేసేందుకు ప్రతిరోజూ వ్యయామం చేయాలి. మెదడు వ్యాయామం కోసం చదరంగం, వర్డ్ క్యాచింగ్ వంటి ఆటలను ఆడొచ్చు. మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఆకు పచ్చని కూరగాయలు, పండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది.