MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pet Animals : కుక్కలు, పిల్లులే కాదు... మనుషులతో కలిసిపోయే టాప్ 7 జంతువులివే

Pet Animals : కుక్కలు, పిల్లులే కాదు... మనుషులతో కలిసిపోయే టాప్ 7 జంతువులివే

Human Friendly Pets : చాలా జంతువులను మనిషి మచ్చిక చేసుకున్నాడు… కానీ మనకు కుక్క, పిల్లివంటివే పెంపుడు జంతువులుగా తెలుసు. ఇవికాకుండా మరికొన్ని జంతువులు కూడా మనుషులతో ఇట్టే కలిసిపోతాయి. అలాంటి 7 పెంపుడు జంతువులివే.. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 01 2025, 09:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
మనుషులు పెంచుకునే జంతువులు
Image Credit : stockPhoto

మనుషులు పెంచుకునే జంతువులు

మన చుట్టూ చాలా రకాల జంతువులు ఉంటాయి. ప్రతి జంతువుకీ దానిదైన ప్రత్యేక లక్షణాలు, స్వభావాలు ఉంటాయి. చాలా మందికి జంతువుల్ని పెంచుకోవడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఇష్టం. కొన్ని జంతువులు మనుషులతో చాలా త్వరగా కలిసిపోతాయి. మీరు కూడా అలాంటి జంతువుల్ని పెంచుకోవాలనుకుంటే ఈ జాబితా చూడండి.

DID YOU
KNOW
?
పాముల్ని పెంచుకునే గ్రామం
చైనాలో పాములను పెంచుకునే ఓ ఊరు ఉంది. జిసికియావో ప్రజలు కింగ్ కోబ్రా, రస్సెల్స్ వైపర్, రాటిల్ స్నేక్ వంటి అత్యంత విషపూరిత పాములను పెంచుకుంటారు. ప్రతిఏటా ఇక్కడ మూడు మిలియన్ల పాములను పెంచుతారు.
28
1. కుక్క
Image Credit : stockPhoto

1. కుక్క

నమ్మకంగా ఓ స్నేహితుడిలా ఉండే జంతువు కుక్క. ఒకసారి మనతో కలిసిపోతే చాలు... తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మనల్ని కాపాడుతుంది. కుక్కలు చాలా రకాలుగా ఉంటాయి. తమ యజమానులతో ఎక్కడికైనా వెళ్లడం, ఆడుకోవడం వాటికి చాలా ఇష్టం. కొన్ని కుక్కలు సరదాగా పెంచుకునేవి ఉంటాయి... మరికొన్ని రక్షణకోసం పెంచుకునేవి ఉంటాయి. 

Related Articles

Related image1
మీ pet dog ను రిజిస్ట్రర్ చేసుకున్నారా? లేకపోతే రూ. 50 వేల ఫైన్..
Related image2
Pets: పెంపుడు జంతువులని ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?
38
2. పిల్లి
Image Credit : Getty

2. పిల్లి

పిల్లులు ఎప్పుడూ స్వేచ్ఛగా తిరగడానికే ఇష్టపడతాయి. కానీ కుక్కల్లాగే అవి కూడా ప్రేమను పంచుకునే జంతువులే. వాటితో ప్రేమగా ఉండే వారితో సమయం గడపడం వాటికి ఇష్టం. ఒకసారి తిండి పెడితే చాలు, మిమ్మల్ని వదిలి వెళ్ళవు. అయితే ఇండియాలో వీటి పెంపకం చాలా తక్కువ… విదేశాల్లో ఎక్కువగా పిల్లులను పెంచుకుంటారు. 

48
3. గినియా పిగ్
Image Credit : X/cutebabypix

3. గినియా పిగ్

చాలా ప్రశాంతమైన జంతువు ఇది. ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. ఇవి మనుషులతో త్వరగా కలిసిపోతాయి.

58
4. కుందేలు
Image Credit : Getty

4. కుందేలు

మనుషులతో బాగా కలిసిపోయే జంతువు కుందేలు. ఇంట్లో, బయట ఎక్కడైనా సరే ఇవి హాయిగా ఉంటాయి. పిల్లలకి కుందేళ్లంటే చాలా ఇష్టం. తెల్లతెల్లగా మెరిసిపోయే కుందేళ్లతో ఆడుకునేందుకు ఇష్టపడతారు. 

68
5. చిలుక
Image Credit : Getty

5. చిలుక

కుక్కలు, పిల్లుల్లాగే పక్షుల్ని కూడా ఇంట్లో పెంచుకుంటారు. చిలుకలు కూడా మనుషులతో బాగా కలిసిపోతాయి. యజమానులతో మంచి స్నేహం పెంచుకుంటాయి. ఒకసారి పరిచయం అయ్యాక మీ గొంతు, మీ ఉనికిని బట్టి మిమ్మల్ని గుర్తుపడతాయి. రంగురంగుల చిలుకలను ఇంట్లో పెంచుకోడానికి చాలామంది ఇష్టపడతారు. ఇక మాట్లాడే చిలుకలకు మంచి డిమాండ్ ఉంటుంది. 

78
6. గుర్రం
Image Credit : pinterest

6. గుర్రం

గుర్రాలు మనుషులతో మంచి స్నేహం చేస్తాయి. ఒకసారి కలిసిపోతే మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమగా చూస్తాయి, గుర్తుపెట్టుకుంటాయి. గతంలో దూర ప్రయాణాల కోసం గుర్రాలను వాడేవారు. ప్రస్తుతం సరదాాకోసం, గుర్రపు స్వారీని ఇష్టపడేవారు మాత్రమే పెంచుకుంటున్నారు.  కొన్ని అరుదైన గుర్రాలు చాలా ఖరీదు… లక్షలు, కోట్లు విలువచేస్తాయి. 

88
7. ఏనుగు
Image Credit : Getty

7. ఏనుగు

ఏనుగులకి మంచి తెలివితేటలు ఉంటాయి. మనుషులతో కలిసి ఉండడానికి ఇష్టపడే జంతువు ఏనుగు. కొండంత శరీరముండే ఏనుగులు మనుషుల ప్రేమకు ఇట్టే కరిగిపోతాయి… తమ బాగోగులు చూసేవారు ఎలా చెబితే అలా చేస్తుంటారు. కానీ వీటి పోషణ చాలా కష్టంతో కూడుకున్నది. అందుకే వీటిని సాధారణంగా పెంచుకోరు... ప్రత్యేక అవసరాల కోసం పెంచుకుంటుంటారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
చిన్నారుల సంరక్షణ
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Recommended image1
Onion: ఇలా చేస్తే..ఉల్లిపాయ కోసినా కళ్లల్లో నుంచి నీళ్లు రావు
Recommended image2
Cancer Symptoms: క్యాన్సర్ విషయంలో 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Recommended image3
Do you Know: 90 శాతం మందికి ఇవేంటో తెలియ‌దు.. ఇంత‌కీ స్టీల్ ప‌రికరం ఉప‌యోగం ఏంటంటే?
Related Stories
Recommended image1
మీ pet dog ను రిజిస్ట్రర్ చేసుకున్నారా? లేకపోతే రూ. 50 వేల ఫైన్..
Recommended image2
Pets: పెంపుడు జంతువులని ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved