Gastric Problems : గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి..లేదంటే?
Gastric Problems : కడుపు ఉబ్బరం సమస్య ఉన్న వాళ్లు కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, మంట, అజీర్థి, వికారం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే ఆ సమస్య మరింత పెరిగే ప్రమాదముంది.

Gastric Problems : మనం తీసుకునే ఆహార పదార్థాలు, మారుతున్న జీవన శైలి కారణంగా ఎన్నో రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా వేళాపాళా లేని తిండి, ఆయిల్ ఫుడ్, మసాలలతో నిండిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గ్యాస్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తున్నాయి.
గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువైతే మాత్రం అల్సర్ కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అల్సర్ల బారిన పడితే మాత్రం మీరేమీ తినలేరు. తినాలని మీకు ఉన్నా కడుపు ఉబ్బరం కారణంగా మీరు ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అప్పటికే పరిమితమైతే కాదు. ఇది దీర్ఘకాలిక సమస్య అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్యాస్ ప్రాబ్లమ్ బారిన పడటానికి కారణాలు చాలానే ఉన్నాయి. వేళా పాళా లేని తింటి, మలబద్దకం, గాలిని మింగడం, తరచుగా ఒకే రకమైన ఆహారాలను తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది.
ఆహారాన్ని నమలకపోవడం, సోడాలను తాగడం, బబుల్ గమ్ లను నమలడం, కూల్ డ్రింక్ లను ఎక్కువగా తాగడం వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది.
మీకు తెలుసా.. మానసిక సమస్యలు, భయం, ఉద్వేగం, ఆందోళన వంటి వాటి వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే డీ హైడ్రేషన్, పేగుపూత, అల్సర్ల వల్ల కూడా గ్యాస్ సమస్య వస్తుంది.
గ్యాస్ సమస్య ఉన్న వారిలో కడుపు మంట, నొప్పి, ఉబ్బరం, అజీర్థి, రక్తంతో కూడిన వాంతులు, కొంచెం తిన్నా కడుపు నిండినట్టుగా అనిపించడం, ఆకలి తగ్గడం, వికారం, కొంతమందిలో మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణక్రియకు అవసరమయ్యే Enzymes తక్కువగా ఉన్నప్పుడు, పిండి పదార్థాలు సరిగ్గా ఉడకనప్పుడు, Antibiotics ను ఎక్కువ మొత్తంలో ఉపయోగించే వారికే ఈ గ్యాస్ తయారువుతుందని నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వారు ముల్లంగి, పిండి పదార్థాలు, కాలీఫ్లవర్, చక్కెర, వంటి ఆహారాలను అస్సలు తినకూడదు. ఒకవేళ వీటిని తింటే గ్యాస్ తయారవుతుంది. గ్యాస్ రాకుండా ఉండకూడదంటే పీచు పదార్థాలను ఎక్కువగా తినండి. వీటిని తింగే మీ జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది.
అలాగే కూరగాయలు, పీచు పదార్థాలు, బెర్రీలు, కీరాలు, దోసకాలయను, నీటిని ఎక్కువగా తాగుతూ ఉండండి. ఇవి Digestive system కు అవసరమైన ఎంజైమ్ లను అందిస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా గ్యాస్ సమస్య వేధిస్తుంటే తప్పక వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు.