MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Parenting: పిల్లలపై పేరెంట్స్ పొరపాటున కూడా అరవకూడని 5 సందర్భాలు ఇవే..!

Parenting: పిల్లలపై పేరెంట్స్ పొరపాటున కూడా అరవకూడని 5 సందర్భాలు ఇవే..!

Parenting: పిల్లలు చిన్న చిన్న తప్పులు చేసినా, చెప్పిన మాట వినకపోయినా పేరెంట్స్ వారిపై అరుస్తుంటారు. అయితే ఈ 5 సందర్భాల్లో మాత్రం పిల్లలపై పేరెంట్స్ అస్సలు అరవకూడదంటున్నారు నిపుణులు. మరి సందర్భాలేంటో, దానివల్ల పిల్లలకు ఎలాంటి సమస్యలొస్తాయో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Nov 24 2026, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిల్లలపై అరవకూడని 5 సందర్భాలు
Image Credit : AI

పిల్లలపై అరవకూడని 5 సందర్భాలు

పిల్లల పెంపకం చాలా బాధ్యతతో కూడుకున్న పని అని అందరికీ తెలుసు. పిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. అయితే పిల్లలు చెప్పిన మాట విననప్పుడు, మారాం చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు చాలామంది పేరెంట్స్ సహనం కోల్పోయి వారిపై గట్టిగా అరుస్తుంటారు. ముఖ్యంగా రోజులో కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో పిల్లలపై అరవడం వల్ల వారిలో భయం, ఆందోళన, అభద్రతాభావం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మరింత ఓపికగా, ప్రేమగా వ్యవహరించాలి. ఆ సందర్భాలేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నిద్రలేచిన ఫస్ట్ 10 నిమిషాలు
Image Credit : gemini ai

నిద్రలేచిన ఫస్ట్ 10 నిమిషాలు

పిల్లలు ఉదయం నిద్రలేచిన వెంటనే వారిపై అరవడం, కంగారు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే పిల్లల మెదడు పూర్తిగా చురుగ్గా మారడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి టైంలో కొంతమంది తల్లిదండ్రులు తొందరపెడుతూ గట్టిగా మాట్లాడుతుంటారు. త్వరగా లేవాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, స్కూల్‌కు రెడీ కావాలి అంటూ ఒకేసారి పనులన్నీ చెబుతుంటారు. పిల్లలు వెంటనే స్పందించకపోతే కోప్పడతారు. ఇలా ప్రతిరోజూ ఉదయం అరుపులతో రోజును ప్రారంభించడం వల్ల పిల్లలు రోజంతా ఒత్తిడిగా, చిరాకుగా ఉండే అవకాశం ఉంది.

36
భోజనం చేసే సమయంలో
Image Credit : Getty

భోజనం చేసే సమయంలో

పిల్లలు భోజనం సరిగ్గా చేయడం లేదని, కూరలు తినడం లేదని, అన్నం నెమ్మదిగా తింటున్నారని చాలామంది తల్లిదండ్రులు కోప్పడుతుంటారు. మరికొందరు పిల్లలు తినకపోతే గట్టిగా అరుస్తూ బలవంతంగా తినిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ భోజనం చేసే సమయం పిల్లలకు ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలి. ఆ సమయంలో తల్లిదండ్రులు అరవడం వల్ల భోజనంపై పిల్లలకు ఇష్టం తగ్గవచ్చు. కొంతమంది పిల్లల్లో భోజనం పట్ల భయం లేదా అయిష్టత కూడా ఏర్పడవచ్చు.

46
నలుగురి ముందు ఉన్నప్పుడు
Image Credit : AI

నలుగురి ముందు ఉన్నప్పుడు

పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు బంధువులు, స్నేహితులు లేదా ఇతరుల ముందు వారిని తిట్టడం, అవమానించడం కొంతమంది తల్లిదండ్రులకు అలవాటుగా ఉంటుంది. ఇతరుల ముందు పిల్లల తప్పులను ఎత్తిచూపుతూ గట్టిగా అరుస్తుంటారు. కానీ ఇది పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎదిగే వయసులో ఉన్న పిల్లలు తమను ఇతరులు ఎలా చూస్తున్నారనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందరి ముందు తల్లిదండ్రులు అవమానిస్తే పిల్లలు బాధపడటమే కాకుండా, తమపై తమకు నమ్మకం తగ్గవచ్చు.

56
స్కూల్‌కు వెళ్లే ముందు
Image Credit : Getty

స్కూల్‌కు వెళ్లే ముందు

పిల్లలు స్కూల్‌కు వెళ్లే సమయంలో వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, స్నేహితులతో గడపడానికి సిద్ధమవుతుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఉదయం హడావుడిలో పిల్లలపై అరుస్తుంటారు. యూనిఫామ్ వేసుకోలేదని, బ్యాగ్ సర్దుకోలేదని, హోంవర్క్ పూర్తి చేయలేదని కోప్పడుతుంటారు. లేటవుతోందని కంగారు పెడుతుంటారు. ఇలా ఇంటి నుంచి బయలుదేరే ముందు తల్లిదండ్రులు అరవడం వల్ల పిల్లలు భయంతో, బాధతో స్కూల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

66
రాత్రి పడుకునే ముందు
Image Credit : AI

రాత్రి పడుకునే ముందు

పిల్లలు రోజంతా ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటారు. స్కూల్‌లో చదువు, ఆటలు, స్నేహితులతో సరదా, కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు ఇలా ఎన్నో విషయాలు వారి మనసులో ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు తల్లిదండ్రులతో మాట్లాడాలని, తమ అనుభవాలను పంచుకోవాలని పిల్లలు కోరుకుంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు చదవలేదని, హోంవర్క్ పూర్తి చేయలేదని, రోజంతా అల్లరి చేశారని అరవడం మంచిది కాదు. రాత్రి పడుకునే ముందు ఎదురయ్యే కోపం, భయం పిల్లల మనసులో నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు పిల్లలతో కొంత సమయం సంతోషంగా గడపడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Nose Rings: అరగ్రాములో వచ్చే అద్భుతమైన ముక్కుపుడకలు
Recommended image2
Blouse Designs: ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపించే బ్లౌజ్ డిజైన్స్!
Recommended image3
కేవలం 3 గ్రాముల గోల్ట్‌తో వచ్చే పాపిటి బిళ్ల డిజైన్లు
Related Stories
Recommended image1
Temples Village: ఒకే గ్రామంలో వందకు పైగా దేవాలయాలు.. ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే!
Recommended image2
Ambani Family Wealth: అంబానీ కుటుంబంలో ఎవరి ఆస్తులు ఎక్కువ? ముఖేష్ అంబానీ పిల్లల సంపద ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved