MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Island:కేవలం ఆరుగురు మాత్రమే నివసించే మాయా ద్వీపం... ఫుడ్ కూడా హెలికాప్టర్ లోనే..!

Island:కేవలం ఆరుగురు మాత్రమే నివసించే మాయా ద్వీపం... ఫుడ్ కూడా హెలికాప్టర్ లోనే..!

Island: అందమైన మాయా ద్వీపంలో కేవలం ఆరుగురు మాత్రమే ఉంటారు. వాళ్లకు ఫుడ్ కావాలన్నా కూడా హెలికాప్టర్ నుంచి ఎవరో వచ్చి ఇవ్వాల్సిందే. ఆ ద్వీపంలో వాళ్లు ఎవరు ఉంటున్నారు..? ఆ ద్వీపం ప్రత్యేకత ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 28 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
అందమైన మాయా ద్వీపం..
Image Credit : geminiai

అందమైన మాయా ద్వీపం..

ఎటు చూసినా పచ్చని కొండలు, సముద్రపు అలల హోరు, మనుషుల జాడ లేని ప్రశాంతత వాతావరణం, ప్రపంచానికి దూరంగా ఒక అద్భుతమైన లోకం చూడాలని ఉందా? అయితే ఫారో ఐలాండ్స్ లోని మైకినెస్ ద్వీపం గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ ద్వీపంలో మీకు ఎటు చూసినా కనీసం రోడ్లు ఉండవు. ఏదైనా కొనుక్కోవడానికి ఎలాంటి దుకాణాలు కూడా ఉండవు. ఇలాంటి అరుదైన ఈ ద్వీపంలో కేవలం ఆరుగురు మాత్రమే నివసిస్తున్నారు. ఇక ఇక్కడి ప్రజలకు కావాల్సిన నిత్యవసర సరుకులు కూడా రోడ్డు మార్గం ద్వారా కాకుండా, ఏకంగా హెలికాప్టర్ ద్వారానే డెలివరీ అవుతూ ఉంటాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
టూరిస్టుల డ్రీమ్ డెస్టినేషన్....
Image Credit : geminiai

టూరిస్టుల డ్రీమ్ డెస్టినేషన్....

ఈ విచిత్ర ద్వీపం కేవలం ఒంటరితనానికే కాదు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి కూడా నిలయం. ముఖ్యంగా వేసవికాలంలో ఇక్కడకు లక్షలాదిగా వచ్చే 'పఫిన్' అనే పక్షులను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు క్యూ కడుతుంటారు. ఈ ద్వీపానికి మీరు వెళ్లాలి అంటే.. కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అంటే.. సంవత్సరంలో ఎప్పుడైనా మీరు ఇక్కడికి వెళితే.. మీరు పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. కానీ, మే నుండి ఆగస్టు మధ్య కాలంలో వెళితే మాత్రం.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా పఫిన్ పక్షులను చూడటానికి కరెక్ట్ టైమ్ ఇది. ఈ నెలల్లోనే టూరిస్టులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే, ఈ ప్రదేశాలను మీరు చూడాలంటే లోకల్ గైడ్ సహాయం తీసుకోవాలి. ఇక్కడ దాదాపు 6 నుంచి 7 కిలో మీటర్ల దూరం హైకింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇక్కడికి వెళ్లడం కూడా అంత ఈజీ కాదు. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈ ద్వీపానికి రోజుకు కేవలం 100 నుంచి 150 మందిని మాత్రమే అనుమతిస్తారు.

టూరిస్టులను పక్కన పెడితే.. ఇక్కడ కేవలం ఆరుగురు మాత్రమే నివసిస్తూ ఉంటారు. ఆ నివసించే ఆరుగురు కూడా.. అక్కడికి వచ్చే టూరిస్టుల అవసరాలు తీర్చడానికి, గైడ్ గా ఉంటూ టూరిస్టుల హెల్ప్ చేయడానికి ఉండేవారే కావడం విశేషం. వాళ్లు తప్ప.. అక్కడ ఇంకెవరూ ఉండరు. ఇక, ఈ ప్రదేశానికి ఎక్కువ మందిని అనుమతించకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎక్కువ మందిని అనుమతి ఇస్తే.. ఆ అందమైన ప్రదేశం పాడైపోతుంది. అంతేకాకుండా.. పక్షులకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పక్షులు గూడ్లు పెట్టే సున్నితమైన ప్రాంతాలను రక్షించడానికి టూరిస్టులు కేవలం నిర్దేశిత మార్గాల్లో మాత్రమే నడవాలని ట్రావెల్ నిపుణులు సూచిస్తున్నారు. వారు చెప్పిన రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలి.

View this post on Instagram

A post shared by Payal l World Travel • Photography (@stampsandsuitcase)

ఈ ద్వీపానికి సంబంధించిన ఓ వీడియోని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. ఈ విభిన్నమైన, సాహసోపేతమైన ద్వీపం గురించి తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ఆశ్చర్యపోతున్నారు. "భూమిపై స్వర్గం అంటే ఇదే కాబోలు", "హెలికాప్టర్‌లో మాత్రమే ప్రయాణించడం, క్యూట్ పఫిన్ పక్షులను నేరుగా చూడటం భలే థ్రిల్లింగ్‌గా ఉంది" అంటూ తమ మనసులోని అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Toe Rings: ఆఫీస్ కి వెళ్లే అమ్మాయిలు మెచ్చే అదిరిపోయే మెట్టెల డిజైన్లు
Recommended image2
Mangalasutram: కేవలం 2 గ్రాముల బంగారంతో షార్ట్ నల్లపూసల చైన్
Recommended image3
Banana: రోజుకో అరటిపండు తింటే శరీరంలో జరిగేది ఇదే
Related Stories
Recommended image1
River: ఈ నదిలో ప్రతి రాయి.. ఒక శివలింగంగా మారుతుంది.. ఆ నది నీళ్లలో దాగి ఉన్న రహస్యం ఏంటి?
Recommended image2
Fresh Fish Vs Dry Fish: తాజా చేపలు, ఎండు చేపలు ఏది తింటే మంచిది? ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved