Necklace Designs: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు
life Nov 21 2026
Author: ramya Sridhar Image Credits:Adore By Priyanka
Telugu
రూబీ ఫ్లవర్, గ్రీన్ బీడ్స్ నెక్లెస్:
ఎరుపు రంగు రాళ్ల వరుస, మధ్యలో పువ్వు ఆకారపు పెండెంట్‌తో పాటు కింద వేలాడే లేత ఆకుపచ్చ పూసలు చాలా ఫ్రెష్ లుక్ ఇస్తున్నాయి. లైట్ వెయిట్ నక్లెస్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్.
Image credits: Adore By Priyanka
Telugu
గోల్డ్ బీడ్స్ తో పర్ల్ డ్రాప్స్ చోకర్:
బంగారు పూసల వరుసలతో పాటు కింద వేలాడే పచ్చలు, ముత్యాల గుత్తులు ఈ చోకర్‌కు ఎంతో అందాన్నిస్తున్నాయి. మ్యాచింగ్ స్టడ్ ఇయర్‌రింగ్స్‌తో పట్టు చీరలపైకి గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: Adore By Priyanka
Telugu
7. పర్ల్ నెట్ కెంపు-పచ్చల హారం:
తెల్లని ముత్యాలను వలలా అల్లి, కింద కెంపులు, ముదురు ఆకుపచ్చ పూసల డ్రాప్స్‌తో చేసిన ఈ నెక్లెస్ ఎంతో ఎలిగెంట్‌గా ఉంది. చీరలో హుందాగా, ప్రత్యేకంగా కనిపించడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
Image credits: Adore By Priyanka
Telugu
చాంద్‌బాలీ స్టైల్ పర్ల్ చోకర్:
రెండు వరుసల ముత్యాల గొలుసుకు మధ్యలో నెలవంక ఆకారపు కెంపుల డిజైన్, ఆకుపచ్చ పూసలు చాలా అందంగా కుదిరాయి. చీరలపైకి కూడా ఈ ఫ్యూజన్ సెట్ బాగా సెట్ అవుతుంది.
Image credits: Adore By Priyanka
Telugu
ముత్యాల గుత్తుల చోకర్:
కెంపులు, పచ్చలు, తెల్లని రాళ్లతో చేసిన ఈ హెవీ చోకర్ అంచున గుత్తులుగా వేలాడే ముత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మెడ నిండుగా కనిపించాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక.
Image credits: Adore By Priyanka
Telugu
యాంటిక్ ఎమరాల్డ్ & పర్ల్ చోకర్:
మధ్యలో పెద్ద పచ్చ, దాని చుట్టూ కెంపులతో కూడిన ఈ యాంటిక్ ఫినిష్ చోకర్ అంచున ముత్యాల వరుస చాలా క్లాసీగా ఉంది. జతగా వచ్చిన ఫ్లోరల్ స్టడ్స్‌తో కలిపి వేసుకుంటే రాయల్ లుక్ సొంతమవుతుంది.
Image credits: Adore By Priyanka
Telugu
కుందన్, రూబీ డ్రాప్ యాంటిక్ నెక్లెస్:
మధ్యలో పెద్ద కెంపు రాయి, చుట్టూ అన్‌కట్ కుందన్ రాళ్లు, ఆకుపచ్చ పూసలతో ఉన్న ఈ నెక్లెస్ చాలా రిచ్‌గా కనిపిస్తోంది. పట్టు చీరలు, లెహంగాలపైకి ఈ సెట్ మంచి బ్రైడల్ లుక్‌ను ఇస్తుంది.