Neck Pain: మెడనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? దానికి కారణాలు ఇవే..!
Neck Pain: ఈ రోజుల్లో నడుం నొప్పి, మెడనొప్పి వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇందుగు గల కారణాలేంటో తెలుసా..?

Neck Pain: ఈ మధ్యకాలంలో మెడనొప్పి (Neck pain), నడుం నొప్పి (back pain) వంటివి సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. కానీ మెడనొప్పి తీవ్రమైన బాధను కలిగిస్తుంది. ఈ సమస్య వల్ల రోజూ వారి పనులతో పాటుగా ఆఫీసు పనులను కూడా చేసుకోలేరు. అయితే ఈ మెడనొప్పికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
ఆఫీసుల్లో కూర్చొనే (Sitting)విధానం, నడిచే (Walk) విధానం, పడుకునే పొజీషన్ (Sleeping position) వంటివన్నీ మెడనొప్పి (Neck pain)కి కారణమవుతాయి.
neck pain
అలాగే వాహనాలను (Vehicles) ఎక్కువగా నడిపే వారు కూడా మెడనొప్పి సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే.. డ్రైవింగ్ చేసే సమయంలో మెడపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీంతో మెడనొప్పి షురూ అవుతుంది. దీన్ని లైట్ గా తీసుకుంటే.. స్పాండిలైటిస్ (Spondylitis)కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నొప్పి ఎక్కువ అయితే.. నెక్ సర్జరీ వరకూ వెళ్లాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
neck-pain
మనం పనిచేసే తీరు, కూర్చునే విధానంతోనే 90 శాతం మంది మెడనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే బైక్ లను నడిపేవారు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే.. డ్రైవింగ్ చేసే సమయంలో భుజాలు, మణికట్టు సరైన దిశలో పెట్టరు. దీంతో వారి మెడపై పై ఒత్తిడి పెరుగుతుంది.
ఇకపోతే ఈ రోజుల్లో వర్క్ హోం కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇంటిదగ్గర గంటలకు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా మెడపై చెడు ప్రభావం పడటం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది.
నిద్రపోయే పొజీషన్ సరిగ్గా లేకున్నా..మెడనొప్పి వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారికి నెక్ సర్జరీ యే మార్గం అని హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కంప్యూటర్ల ముందు పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మోచేతులు , భుజాలు సమాంతరంగా ఉండేట్టు జాగ్రత్త వహించాలి. ఇక మణికట్టు కీబోర్డుకు సమాంతరంగా ఉండేట్టు చూసుకోవాలి.
టూ వీలర్ డ్రైవ్ చేసేవారు కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. బైక్ పై నిటారుగా కూర్చొని భుజాలు మీ మెడకు parallelగా ఉండేలాగ జాగ్రత్త వహించాలి.
మెడనొప్పి ఉండేవాళ్లు ఖచ్చితంగా రోజుకు నాలుగైదు సార్లు మెడ ఎక్సర్ సైజెస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఒకే దగ్గర గంటల కొద్దీ కూర్చోకండి. ఎంత పనిఉన్నా.. మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ నడవండి.