MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బాదం, జీడిపప్పు నెలల తరబడి ఫ్రెష్‌గా నిల్వ ఉండాలంటే ఈ సూపర్ టిప్స్ పాటించండి

బాదం, జీడిపప్పు నెలల తరబడి ఫ్రెష్‌గా నిల్వ ఉండాలంటే ఈ సూపర్ టిప్స్ పాటించండి

బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ లాంటి ఖరీదైన డ్రై ఫ్రూట్స్ జాగ్రత్తగా స్టోర్ చేయకపోతే త్వరగా పాడవుతాయి. ఇవి నెలల తరబడి పాడవ్వకుండా ఉండాలంటే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వీటిని ఎలా నిల్వ చేయాలో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 23 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బాదం, జీడిపప్పు పాడవ్వకుండా...
Image Credit : Pixabay

బాదం, జీడిపప్పు పాడవ్వకుండా...

బాదం, జీడిపప్పు, వాల్‌నట్, పిస్తా లాంటివి ఖరీదైన డ్రైఫ్రూట్స్. వీటిని కొన్న తరువాత సరిగా స్టోర్ చేయకపోతే కొన్ని రోజులకే మెత్తగా మారిపోతాయి. ఒక్కోసారి వింత వాసన కూడా వస్తాయి. దీనికి ప్రధాన కారణాలు వేడి, గాలి, వెలుతురు, తేమ. ఈ గింజల్లో సహజంగానే కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గాలిలోని ఆక్సిజన్‌తో కలిసినప్పుడు కాలక్రమేణా రుచి, వాసన మారిపోతాయి. దీన్నే ఫ్యాట్ ఆక్సిడేషన్ అంటారు.

అలాగే, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే బాదం, జీడిపప్పు ఆ తేమను పీల్చుకుని క్రిస్పీగా ఉండే స్వభావాన్ని కోల్పోతాయి. తేమ అలాగే ఉంటే ఫంగస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే వీటిని నిల్వ చేసేటప్పుడు గాలి, వేడి, వెలుతురు, తేమ... ఈ నాలుగింటిని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం.

సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రిడ్జ్‌లో 6 నెలలు, ఫ్రీజర్‌లో ఏకంగా ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏ డ్రై ఫ్రూట్‌ను ఎన్ని రోజులు నిల్వ?
Image Credit : pinterest

ఏ డ్రై ఫ్రూట్‌ను ఎన్ని రోజులు నిల్వ?

అన్ని డ్రై ఫ్రూట్స్‌కు ఒకే రకమైన జీవితకాలం ఉండదు. డ్రై ఫ్రూట్ రకం, ప్యాకింగ్ విధానం, గది ఉష్ణోగ్రతను బట్టి వాటి జీవితంకాలం మారుతుంది.

బాదం

గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1-2 నెలల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.

ఫ్రిడ్జ్‌లో: సుమారు 6 నెలల వరకు నాణ్యత తగ్గకుండా ఉంటాయి.

ఫ్రీజర్‌లో: గట్టిగా మూతపెట్టి ఉంచితే ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

జీడిపప్పు

గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1 నెల.

ఫ్రిడ్జ్‌లో: సుమారు 6 నెలల వరకు.

ఫ్రీజర్‌లో: ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.

వాల్‌నట్స్

వాల్‌నట్స్‌లో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. కాబట్టి వీటిని వేడిగా ఉండే చోట ఎక్కువ రోజులు ఉంచకూడదు.

గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1 నెల.

ఫ్రిడ్జ్‌లో: సుమారు 6 నెలలు.

ఫ్రీజర్‌లో: ఏడాది పాటు నిల్వ చేయొచ్చు.

పిస్తా

గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1-2 నెలలు.

ఫ్రిడ్జ్‌లో: సుమారు 6 నెలల వరకు.

ఫ్రీజర్‌లో: ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.

ఎండు ద్రాక్ష (కిస్మిస్)

వీటిలో తేమ ఉంటుంది కాబట్టి బాదం, జీడిపప్పు కంటే కాస్త భిన్నంగా నిల్వ చేయాలి.

గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1-2 నెలలు.

ఫ్రిడ్జ్‌లో: 6 నెలల వరకు మంచి కండిషన్‌లో ఉంటాయి.

ఖర్జూరం

ఖర్జూరం రకం, అందులో ఉండే తేమను బట్టి నిల్వ ఉండే కాలం మారుతుంది.

గది ఉష్ణోగ్రత వద్ద: సుమారు 1 నెల.

ఫ్రిడ్జ్‌లో: 6 నెలల వరకు నిల్వ చేయొచ్చు.

33
ఎలా నిల్వ చేయాలి
Image Credit : Pixabay

ఎలా నిల్వ చేయాలి

డ్రై ఫ్రూట్స్ సరిగా నిల్వ చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. తుందన్నదే ఇక్కడ ముఖ్యం.

గాజు డబ్బా

గాలి చొరబడని మూత ఉండే గాజు డబ్బాలో డ్రైఫ్రూట్స్ ను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి బెస్ట్ ఆప్షన్. దీనివల్ల లోపల ఏముందో ఈజీగా చూడొచ్చు. డ్రైఫ్రూట్స్ ఎలాంటి వాసనను పీల్చుకోవు.

స్టీల్ డబ్బా

గట్టిగా మూతపడే స్టీల్ డబ్బా కూడా మంచి ఆప్షనే.

  • వెలుతురును అడ్డుకుంటుంది.
  • ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.
  • మన వంటగదుల్లో వాడటానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.

అయితే స్టీల్ డబ్బా అనగానే గాలి చొరబడదని కాదు. మూత టైట్‌గా పడుతుందో లేదో చెక్ చేసుకోవాలి.

ప్లాస్టిక్ డబ్బా

ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ డబ్బాలను వాడొచ్చు. కానీ నాసిరకం లేదా మూత సరిగా పడని ప్లాస్టిక్ డబ్బాలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వాడకపోవడమే మంచిది.

అయితే ఏది బెస్ట్?

గాలి చొరబడని గాజు డబ్బా లేదా గట్టిగా మూతపడే స్టీల్ డబ్బా... ఈ రెండూ ఇంట్లో వాడటానికి బెస్ట్. డబ్బా పేరు కంటే గాలి, తేమ లోపలికి వెళ్లకుండా చూసుకోవడమే అసలైన ట్రిక్. బాదం నిల్వ గైడ్‌లైన్స్‌లో కూడా తేమ, గాలి చొరబడకుండా ఉండే మంచి ప్యాకేజింగ్ చాలా ముఖ్యమని చెప్పారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image2
Silver Mangalsutra:రూ.2వేలకే సిల్వర్ మంగళసూత్రాలు..డైలీవేర్ కి బెస్ట్
Recommended image3
Snakes: వానాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సూపర్ ట్రిక్ ఇదే
Related Stories
Recommended image1
DMart: డి-మార్ట్‌లో ఈ 5 వస్తువులు కొనే ముందు ఆలోచించండి.. తొందరపడకండి
Recommended image2
Indian River: మనదేశంలో కంటికి కనిపించకుండా ప్రవహిస్తున్న ఒకే ఒక్క నది ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved