బరువు తగ్గేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
Mistakes During Weight Loss: బరువు తగ్గడం అంత సులువేమీ కాదు. దీనికోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గే సమయంలో కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అలా చేస్తే తగ్గడానికి బదులు బరువు మరింత పెరుగుతారు.

ఈ రోజుల్లో అధిక బరువు సమస్య సర్వ సాధారణంగా మారిపోయింది. కానీ అధిక బరువు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు వ్యాయామాలు, డైట్ వంటివి పాటించే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇవి పాటించినా బరువు తగ్గని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. వీరు చేసే కొన్ని మిస్టేక్స్ వల్లే బరువు తగ్గరు. వీటి వల్ల బరువు తగ్గాల్సిన వారు కాస్త మరింత బరువు పెరుగుతుంటారు. ఇంతకీ బరువు తగ్గే వారు చేయకూడదని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ తప్పులు తెలియకుండానే జరుగుతాయి: మన ఆరోగ్యం మన ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ జోలికి అస్సలు వెల్లకూడదు. ముఖ్యంగా ఉదయం ఈ తప్పులు చేస్తే బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగిపోతారు జాగ్రత్త..
breakfast
బ్రేక్ ఫాస్ట్ మానేయడం
బరువు మరింత పెరిగిపోతామని చాలా మంది ఉదయం అల్పాహారం (Breakfast) తినరు. ఇలా తినకపోతే బరువు తగ్గుతామని అనుకుంటారు. వాస్తవానికి అలా జరగనే జరగదు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెగుతారు. అలాగే మీ శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభించదు. దీనివల్ల మీరు బాగా అలసిపోతారు. అలాగే శరీరం వాపు కూడా వస్తుంది. అందుకే ఏదేమైనా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను మాత్రం మానకండి.
సమాయానికి నిద్రపోకపోవడం
ఈ రోజుల్లో అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్లనో లేకపోతే ల్యాప్ టాప్ లను చూసుకుంటూ టైం పాస్ చేసేవారు ఎక్కువయ్యారు. ఏడ మూడు నాలుగు గంటలకో నిద్రపోతుంటారు. దీంతో వారు ఉదయం చాలా లేట్ గా నిద్రలేస్తారు. ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల మీరు ఉదయం వ్యాయామం చేయలేరు. అలాగే బ్రేక్ ఫాస్ట్ కూడా మిస్ అవుతుంది. దీనివల్ల బరువు పెరగడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.
ఆహారాన్ని తినకపోవడం
మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్న సంగతి తెలుసు. అదే సమయంలో మన ఆహారంలో ఖచ్చితంగా పోషకాలుంటాయి. ఒకవేళ లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. అంతేకాదు ఎక్కువ సేపు ఆకలితో ఉండి.. ఆహారంలో ఫాస్ట్ ఫుడ్ తింటే.. మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఇది మీరు మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది.