మీరు కొన్న పదార్థాలు కల్తీవో? కాదో? ఇలా కనిపెట్టండి..
ఈ రోజుల్లో స్వచ్ఛమైనవి లభించడం చాలా కష్టం. మనం కొంటున్న పాల నుంచి నూనె వరకు ప్రతిదాంట్లో కల్తీ కలుస్తూనే ఉంది. దీన్ని గుర్తించకుండా అలాగే వాడితే.. ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుత కాలంలో.. కల్తీ లేకుండా ఎలాంటి ఆహారాలు లభించడం లేదనండంలో ఎలాంటి సందేహం లేదు. పాల నుంచి మొదలు పెడితే.. పప్పులు, ఉప్పులు, నూనెలు, బియ్యం అంటూ వంటింటింట్లో వాడే ప్రతీదీ కల్తీ అవుతూనే ఉంది. ఇలాంటి వాటిని గుర్తించకుండా ఉపయోగిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం బయట కొంటున్న ఆహార పదార్థాలు కల్తీవో కావో ఇలా తెలుసుకోవచ్చు.
కారం.. బయట షాపుల్లో దొరికే ఏ వస్తువు కల్తీ అయ్యిందో.. ఏది కాలేదో చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రస్తుతం అన్ని కల్తీ అవుతూనే ఉన్నాయి. ఇక మనం షాపుల్లో కొనే కారం పొడి కల్తీ అయ్యిందో కాలేదో అని కనుక్కోవాలంటే.. టీ స్పూన్ కారం పొడిని తీసుకుని గ్లాస్ నీటిలో వేయండి. అందులో కొంత కారం పొడైనా గ్లాస్ అడుగుభాగానికి చేరుకుంటే అది ఇటుక పొడి అని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం చాలా మంది కారం పొడిలో ఇటుక పొడిని కలుపుతున్నారు.
మరియాలు.. మిరియాలు, బొప్పాయి గింజలు చూడటానికి కొంచెం అటు ఇటుగా ఒకేలా కనిపిస్తాయి. అందుకే చాలా మంది వీటిని కూడా కల్తీ చేస్తున్నారు. బొప్పాయి గింజలను మిరియాల్లో మిక్స్ చేస్తున్నారు. మీరు కొన్ని మిరియాల్లో బొప్పాయి గింజలు ఉన్నాయో లేవో.. వాటిని కాస్త నిశితంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. రుచి చూసినా తెలుస్తుంది.
లవంగాలు.. లవంగాలు కూడా కల్తీ అవుతున్నాయి. ఎలా అంటే లవంగాల నుంచి నూనెన తీసిన వాటిని కూడా మంచి వాటిలో కలుపుతున్నారు. ఇవి నాసీరకం లవంగాలు. వీటిని ఒరిజినల్ వాటిలో కలిపి జనాలను మోసం చేస్తున్నారు. వీటిని ఒక గిన్నెలో వేడి చేస్తే అవి ముడుచుకు పోతే అవి నాసీరకం అని అర్థం చేసుకోవాలి.
చక్కెర.. చక్కెరలో బేకింగ్ సోడా వేసి కల్తీ చేస్తున్నారు. అందుకే షాపుల్లో చక్కెరను కొన్నప్పుడు.. అది కల్తీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి గ్లాస్ వాటర్ తీసుకుని అందులో టీ స్పూన్ చక్కెరను వేసి.. ఫాస్ట్ ఫాస్ట్ గా కలపండి. అప్పుడు అందులో నురగలుల కనిపిస్తే అది కల్తీదని అర్థం చేసుకోండి.
కొబ్బరి నూనె.. కొబ్బరి నూనె కల్తీ అయ్యిందో లేదో కనిపెట్టుడు చాలు సులువు. ఇందుకోసం ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో కొంచెం కొబ్బరి నూనెను పోసి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టండి. అదంతా గడ్డ కడితే ఎలాంటి కల్తీ జరగలేదని అర్థం చేసుకోండి. అదే గడ్డ కట్టకపోతే అది కల్తీ అయ్యిందని అర్థం చేసుకోండి. ఎందుకంటే కల్తీ నూనె గడ్డ కట్టదు.
పాలు.. పాలలో ఒక్కటేమిటీ ఎన్నో ఎన్నో కలుపుతుంటారు. కల్తీలేని స్వచ్ఛమైన పాలు దొరకడం ఈ రోజుల్లో కష్టమనే చెప్పాలి. అయితే ఈ కల్తీ పాలను గుర్తించడం అంత సులువు కాదు. అయితే మీరు కొన్న పాలను వేడి చేసేటప్పుడు అవి కాస్త పసుపు రంగులోకి మారినా..పాల రుచి తేడాగా అనిపించినా అవి కల్తీ అయ్యాయని అర్థం చేసుకోండి.