Cooking Tips: వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే కూర రుచి పాడైపోతుంది
life Oct 05 2026
Author: ramya Sridhar Image Credits:stockPhoto
Telugu
ఏ వంటకైనా ప్రిపరేషన్ ముఖ్యం.
ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వంట మొదలుపెట్టకూడదు. అన్నీ ముందుగా సిద్ధం చేసుకోకపోతే పదే పదే గ్యాస్ ఆన్, ఆఫ్ చేయాల్సి వస్తుంది. దీని వల్ల మంటలో తేడా వచ్చి, వంట పాడైపోతుంది.
Image credits: stockPhoto
Telugu
మంట ఎక్కువగా పెట్టడం
సమయం ఆదా అవుతుందని కొందరు మంటను ఎక్కువగా పెట్టి వంట చేస్తారు. దీనివల్ల రుచి పాడవుతుంది. ఎప్పుడైనా సరే తక్కువ లేదా మీడియం మంటపైనే వంట చేయాలి.
Image credits: stockPhoto
Telugu
ఉప్పు, మసాలాలు
వంటలో ఉప్పు చాలా కీలకం. ఇది కొంచెం ఎక్కువైనా, తక్కువైనా రుచి మారిపోతుంది. అలాగే మసాలాలు ఎంత మోతాదులో వాడాలో కచ్చితంగా తెలిసి ఉండాలి.
Image credits: stockPhoto
Telugu
తాజా కూరగాయలు
ఏ వంటకైనా సరే తాజా కూరగాయలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే వంటకు మంచి రుచి వస్తుంది. అలాగే వాడే ఇతర దినుసులు కూడా తాజాగా ఉండాలి.
Image credits: stockPhoto
Telugu
సమయం కేటాయించడం
ప్రతి వంటకానికి దానికి తగిన సమయం పడుతుంది. అందుకే వంటను ఎప్పుడూ నెమ్మదిగా, ఓపికగా చేస్తేనే ఫుడ్ చాలా టేస్టీగా వస్తుంది.