MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hygiene tips: టాయ్ లెట్ లో కంటే ఎక్కువ క్రిములు ఇక్కడే ఉంటాయ్, జాగ్రత్త..!

Hygiene tips: టాయ్ లెట్ లో కంటే ఎక్కువ క్రిములు ఇక్కడే ఉంటాయ్, జాగ్రత్త..!

Hygiene tips:  టాయ్ లెట్ లో ఎక్కువ క్రిములు ఉంటాయి అని మనందరికీ తెలుసు. కానీ.. టాయ్ లెట్ ని మించిన బాక్టీరియా ఇంట్లో… చాలా ప్లేసుల్లో ఉంటాయి. మనం పడుకునే బెడ్ దగ్గర నుంచి.. రోజూ వాడే ఫోన్ వరకు.. అన్నింట్లో సూక్ష్మ జీవులు ఉంటాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 10 2025, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాయ్ లెట్..
Image Credit : Freepik

టాయ్ లెట్..

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనే అనుకుంటారు. ముఖ్యంగా, బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. బాత్రూమ్ లో మన కంటికి కనిపించని క్రిములు లక్షల్లో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎక్కువ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే... టాయ్ లెట్ ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ... మన ఇంట్లో వేరే ముఖ్యమైన ప్రదేశాల్లో టాయ్ లెట్ ని మించిన క్రిములు ఉంటాయి అని మీకు తెలుసా? ఎక్కడెక్కడ క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వంట గది...
Image Credit : Getty

వంట గది...

టాయ్ లెట్ లో కంటే.. మన వంట గదిలో క్రిములు ఎక్కువగా ఉంటాయి అంటే మీరు నమ్మగలరా? మరీ ముఖ్యంగా, మనం పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజి క్రిములను నివసించడానికి స్వర్గధామం. ఆ స్పాంజిపై ఉన్న ఆహార కణాలు, తేమ కారణంగా, బాక్టీరియా లక్షలాది సంఖ్యలో వచ్చి చేరతాయి. అదే స్పాంజితో మనం పాత్రలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తే... ఆ బాక్టీరియా ఆ పాత్రలకు కూడా అంటుకుంటుంది. ఆ పాత్రల్లో మీరు భోజనం చేస్తే... అవి మీలోకి ప్రవేశిస్తాయి. దీని వల్ల కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Tips and Tricks: ఇదొక్కటి కలిపితే చాలు.. మీ బియ్యం, పప్పులకు పురుగులు పట్టవు..!
Related image2
Health Tips : ఇది పేదవాడి డైట్ ప్లాన్ .. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు పొందే టిప్స్
35
చాపింగ్ బోర్డు...
Image Credit : Getty

చాపింగ్ బోర్డు...

మనం కూరగాయలు, మాంసం లాంటివి కట్ చేయడానికి చాపింగ్ బోర్డు వాడుతూ ఉంటాం. ఆ చాపింగ్ బోర్డు పై కూడా లక్షలాది క్రిములు వచ్చి చేరతాయి. ముఖ్యంగా, కట్ చేసిన మాంసాన్ని సరిగా శుభ్రం చేయకపోతే, ఇది ఇతర ఆహార పదార్థాలను కూడా కలుషితం చేస్తుంది.

45
బెడ్రూమ్...
Image Credit : Getty

బెడ్రూమ్...

కిచెన్, చాపింగ్ బోర్డు తర్వాత ఎక్కువ క్రిములు ఉండే మరో ప్రదేశం బెడ్రూమ్. మనం రోజూ నిద్రించే పడక గదిలో , దిండు కవర్లలో టాయ్ లెట్ కంటే ఎక్కువ బాక్టీరియా ఉంటుంది. మన చెమట, లాలాజలం, డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కలిసి సూక్ష్మ క్రిములు పెరగడానికి కారణం అవుతాయి. ఇవన్నీ, ముఖంపై మొటిమలు రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం లాంటి సమస్యలు రావడం మొదలౌతాయి. స్కిన్, హెయిర్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది.

55
మొబైల్ ఫోన్, రిమోట్..
Image Credit : Getty

మొబైల్ ఫోన్, రిమోట్..

మనం ప్రతిరోజూ ఉపయోగించే మన మొబైల్ ఫోన్లు కూడా ఈ జాబితాలోకి వస్తాయి. మనం ఎక్కడికి వెళ్లినా మన మొబైల్ ఫోన్లు వెంట తీసుకొని వెళ్తూ ఉంటాం. కొందరు అయితే... ఫోన్ ని ఏకంగా టాయ్ లెట్ కి కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ క్రిములన్నీ ఫోన్ కి అంటుకునే అవకాశం ఉంది. మీరు నమ్మరు కానీ, టాయ్ లెట్ సీటు కంటే పది రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు ఫోన్ లపై ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చేతులు కడుక్కోకుండా ఫోన్ లను, రిమోట్ లను తాకడం వల్ల బాక్టీరియా అక్కడ పేరుకుపోతుంది. చేతుల మురికి, ఆహార కణాలు మొదలైనవి ఫోన్, రిమోట్ బటన్ల మధ్య సులభంగా పేరుకుపోతాయి. ఇంట్లో ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగిస్తారు కాబట్టి, ఒకరి నుండి మరొకరికి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతాయి. అందుకే... వీటన్నింటినీ... ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dry Fruits: రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్?
Recommended image2
కేవలం వారంరోజులు ఉప్పు తినకుంటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Sreeleela Fitness: శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట
Related Stories
Recommended image1
Tips and Tricks: ఇదొక్కటి కలిపితే చాలు.. మీ బియ్యం, పప్పులకు పురుగులు పట్టవు..!
Recommended image2
Health Tips : ఇది పేదవాడి డైట్ ప్లాన్ .. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు పొందే టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved