Dry Fruits: రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్?
life Jun 24 2026
Author: Nandini Arava Image Credits:Freepik
Telugu
సరైన మోతాదు ఇదే
శరీరానికి కావాల్సిన పోషకాలు అందాలంటే రోజూ 4-5 బాదం పప్పులు, 2-3 జీడిపప్పులు తప్పనిసరిగా తినాలి. రోజూ 5 బాదం, 4 జీడిపప్పులు తింటే ఆరోగ్యంగా, రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
Image credits: Freepik
Telugu
పిల్లలకు ఎన్ని ఇవ్వాలి?
పిల్లల ఆరోగ్యానికి కూడా రోజుకు 4-5 బాదం, 2-3 జీడిపప్పులు సరిపోతాయి. ఇది వారి జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు, శారీరక ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది.
Image credits: Freepik
Telugu
వర్కౌట్ చేసేవారికి ప్రత్యేకం
మీరు జిమ్‌కు వెళ్తుంటే రోజుకు 8-10 బాదం పప్పులు చాలు. బాదం పప్పులను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే బాదంలోని వేడి తగ్గుతుంది.
Image credits: Pinterest
Telugu
జీడిపప్పు అతిగా తినొద్దు
జీడిపప్పును ఎక్కువగా ఇష్టపడేవారు రోజుకు 5-6 వరకు తినొచ్చు. కానీ, రోజూ అంత మోతాదులో తినకపోవడమే మంచిది. రోజుకు 4-5 జీడిపప్పులు తింటే శరీరంలో కాల్షియం, మెగ్నీషియం లోపం తగ్గుతుంది.
Image credits: Pinterest
Telugu
ఆరోగ్య ప్రయోజనాలివే
ప్రతిరోజూ జీడిపప్పు, బాదం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదంలోని విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.