Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Maggi Masala:మ్యాగీని పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ ఇష్టపడతారు. అది హెల్దీ కాదు అని తెలిసినా తింటూ ఉంటారు. బయట దొరికే మసాలాలో అజీనోమోటో కలుపుతారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

Maggi Masala
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఫుడ్స్ లో మ్యాగీ మొదటి వరసలో ఉంటుంది. అందులో ఉండే ఆ ప్రత్యేకమైన మసాలానే దానికి ఆ టేస్ట్‌ను ఇస్తుంది. అయితే బయట మార్కెట్లో దొరికే ప్యాకెట్ మ్యాగీ మసాలాలో రుచి కోసం రకరకాల ప్రిజర్వేటివ్స్, రసాయనాలు వాడతారు. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజూ లేదా తరచూ అలాంటివి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి పిల్లలకు మ్యాగీ ఇష్టం, బయట మసాలా ఆరోగ్యానికి మంచిది కాదు.. ఈ సమస్యకు పరిష్కారమేంటి?
ఎలాంటి కెమికల్స్ లేకుండా, కేవలం కొన్ని నిమిషాలలో మన ఇంట్లోనే అచ్చం బయట దొరికేలాంటి రుచికరమైన "మ్యాగీ మసాలా"ను తయారు చేసుకోవచ్చు
ఇంట్లోనే మ్యాగీ మసాలా తయారీ విధానం
మసాలా దినుసులు వేయించడం : మొదటగా పాన్‌లో లవంగాలు, నల్ల మిరియాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి వేసి తక్కువ మంటపై కొన్ని సెకన్ల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల మసాలా దినుసుల్లోని తేమ తొలగిపోతుంది, దీనివల్ల మసాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కావాలంటే వీటిని ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు. వేయించిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారబెట్టాలి.
మెత్తని పొడిగా రుబ్బుకోవడం :
చల్లారిన ఆ మసాలా దినుసులను మిక్సీ జార్‌లో వేయాలి. అందులోనే కారం, పసుపు, ఉప్పు, వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి వెజిటేరియన్ అరోమాటిక్ పౌడర్ (Vegetarian Aromatic Powder) కలపాలి. వీటన్నింటినీ కలిపి మెత్తని, స్మూత్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. అంతే మ్యాగీ మసాలా రెడీ..
ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయడం : ఇలా తయారు చేసుకున్న ఘుమఘుమలాడే హోంమేడ్ మ్యాగీ మసాలను గాలి తగలని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో భద్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా సువాసన, రుచి తగ్గకుండా ఉంటాయి. తేమ తగలకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. బయట కొనే వాటికి స్వస్తి పలికి, ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన పదార్థాలతో మ్యాగీ మసాలా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి సొంతం అవుతుంది. ఈ మసాలాని మీరు కేవలం మ్యాగీకి మాత్రమే కాదు.. నూడిల్స్, కర్రీస్ లేదా ఏ ఇతర వంటకాల్లోకి కూడా వేయచ్చు. జస్ట్ చిటికెడు వేస్తే చాలు.. రుచి అద్భుతంగా ఉంటుంది.

