Lifestyle: ఖరీదైన ఫేస్‌వాష్‌తో పనే లేదు.. మీ వంటింట్లోనే మ్యాజిక్ ఉంది
Lifestyle: ఎండ, కాలుష్యం వంటి కారణాల ద్వారా ముఖం వాడిపోయినట్లవడం సాధారణం. దీంతో ఖరీదైన ఫేస్‌వాష్‌లను ఉపయోగిస్తుంటాం. అయితే ఈ సమస్యకు సహజంగా చెక్ పెట్టొచ్చు. వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో ముఖం మెరిసేలా చేసుకోవచ్చు.

ఖరీదైన ఫేస్‌వాష్‌ల అవసరం లేదు
మంచి చర్మం కోసం చాలా మంది ఖరీదైన ఫేస్‌వాష్‌లు, బ్యూటీ ప్రొడక్ట్స్ పై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మొదట్లో ఇవి ఫలితం ఇచ్చినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో చర్మం పొడిబారడం, మంటలు, సున్నితత్వం పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఫేస్ వాష్ వాడిన తర్వాత ముఖంపై లాగిన భావన, కాలుతున్నట్లు అనిపించడం కూడా చాలామందికి ఎదురవుతోంది.
సహజ పదార్థాలే సురక్షితం
చర్మ నిపుణులు సహజ పదార్థాల వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ఇవి చర్మానికి హాని చేయకుండా శుభ్రం చేస్తాయి. చర్మానికి అవసరమైన పోషణ కూడా అందుతుంది. స్కిన్ టైప్ అర్థం చేసుకుని వీటిని ఉపయోగిస్తే ఖరీదైన ప్రొడక్ట్స్ అవసరం ఉండదు.
ఆయిలీ స్కిన్ కోసం శనగపిండి + పెరుగు
చర్మం ఎక్కువగా ఆయిల్‌గా ఉండే వారికి శనగపిండి, పెరుగు కలిపిన మిశ్రమం చాలా ఉపయోగపడుతుంది. శనగపిండి అదనపు నూనెను తొలగిస్తుంది. పెరుగు చర్మానికి తేమను ఇస్తుంది. ఈ పేస్ట్‌తో మృదువుగా మసాజ్ చేస్తే ముఖం శుభ్రంగా, ఫ్రెష్‌గా మారుతుంది.
తక్షణ గ్లో కోసం తేనె + నిమ్మరసం
పొడిబారిన చర్మానికి తేనె సహజ క్లీన్సర్‌లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. నిమ్మరసం మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రం చేస్తే వెంటనే కాంతి కనిపిస్తుంది.
సున్నిత చర్మానికి అలోవెరా + రోజ్ వాటర్
చర్మం త్వరగా ఎర్రబడే వారు, మంటలు వచ్చే వారికి అలోవెరా, రోజ్ వాటర్ మిశ్రమం చాలా సురక్షితమైన పరిష్కారం. ఇది చర్మానికి చల్లదనం ఇస్తుంది. లోపల నుంచే శుభ్రత కలిగిస్తుంది. డెడ్ స్కిన్, ట్యానింగ్ తగ్గాలంటే పెరుగు, ఓట్స్, తేనెతో స్క్రబ్ చేయవచ్చు. శనగపిండి, పాలు, పసుపుతో పల్చని మిశ్రమం మచ్చలను మెల్లగా తగ్గిస్తుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచరంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

