MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Life After 40: 40 దాటిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

Life After 40: 40 దాటిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

Life After 40: వయసు పెరుగుతుంటే శరీరంలో మార్పులు రావడం చాలా సహజం. మరి, 40 ఏళ్ల తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు..?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 24 2026, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
40 తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి..?
Image Credit : Gemini ai

40 తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి..?

40 ఏళ్లు రాగానే "అబ్బో.. వయసైపోతోందిలే" అని మనలో చాలామంది సింపుల్‌గా అనేస్తుంటారు. కానీ మన బాడీలో వచ్చే ప్రతి చిన్న మార్పు వెనుక ఒక మెసేజ్ ఉంటుంది. "వయసు పెరిగితే అంతేలే" అని సర్దుకుపోకుండా, 40 దాటిన తర్వాత మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో, మనం ఎందుకు అలర్ట్‌గా ఉండాలో ఓసారి చూద్దాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నా ప్యాంట్ నాకు పట్టడం లేదేంటి?
Image Credit : Gemini ai

నా ప్యాంట్ నాకు పట్టడం లేదేంటి?

మేం బరువు పెరగకుండా మేనేజ్ చేసేస్తున్నాం అనుకుంటారు. కానీ, బరువు పెరగకపోయినా నడుము చుట్టుకొలత పెరుగుతుంది. పాత జీన్స్ లేదా ప్యాంట్లు వేసుకుంటే.. నడుము దగ్గర బిగుతుగా అనిపిస్తుంది.40 దాటిన తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. కాబట్టి, పొట్ట తగ్గించడం చాలా ముఖ్యం.

2. స్టామినా తగ్గడం..

షాపింగ్ సంచులు ఎత్తడం లేదా కింద కూర్చుని సడన్‌గా లేవడం ఒకప్పుడు నీళ్లు తాగినంత ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు కష్టంగా అనిపిస్తోందా? వయసుతో పాటు మజిల్ మాస్ తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి.. స్ట్రెంత్ పెంచుకునే వ్యాయామాలు చేయాలి.

3. పీరియడ్స్ టైమ్ మారడం

40ల్లో ‘పెరిమెనోపాజ్’ (మెనోపాజ్ ముందు దశ) స్టార్ట్ అవుతుంది. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, హఠాత్తుగా ఒళ్లంతా చెమటలు పట్టడం , ఉన్నట్టుండి మూడ్ స్వింగ్స్ రావడం జరుగుతాయి. ఇవి మన ఎముకలు, గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

Related Articles

Related image1
Pillow: మీ దిండ్లు పసుపు రంగులోకి మారిపోయాయా?రూ.10ఖర్చుతో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు
Related image2
ఒక్కసారి ఈ గుడికి వెళ్లి పూజ చేస్తే...మీ కారుకు ప్రమాదమే జరగదు, ఈ గుడి ఎక్కడ ఉంది?
33
నిద్ర పట్టదు..
Image Credit : Gemini ai

నిద్ర పట్టదు..

రాత్రిళ్లు పడుకోగానే గాఢ నిద్రపోయే రోజులు పోయి.. పదే పదే మెలకువ వస్తుంది. గాఢ నిద్రపోలేరు.అంతేకాదు.. ఉదయం లేవగానే..అలసటగా అనిపిస్తూ ఉంటుంది.

5. తగ్గని అలసట..

ఒకప్పుడు వారం రోజులు కంటిన్యూస్ గా పని చేసినా రాని అలసట.. ఇప్పుడు ఊరికూరికే వచ్చేస్తుంది. నెలల తరబడి విశ్రాంతి తీసుకున్నా కూడా ఇంకా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది.

6. బిపి, షుగర్ కొలెస్ట్రాల్..

"నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు" అని ధీమాగా ఉంటాం. కానీ బిపి, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ బయటకు ఎలాంటి లక్షణాలు చూపించకుండానే పెరిగిపోతుంటాయి. అందుకే రొటీన్ చెకప్‌లు తప్పనిసరి.

7. చిన్న విషయాలు మర్చిపోవడం..

మొన్నటి వరకు అన్ని విషయాలు గుర్తుంచుకునే వాళ్లు.. చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు గుర్తుండటం లేదా? ఇది కూడా 40 తర్వాత వచ్చే లక్షణమే. హార్మోన్లలో మార్పులు, సరిగా నిద్రపట్టకపోవడం వల్ల మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యోగా, మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోవాలి.

8. కీళ్ల నొప్పులు త్వరగా తగ్గకపోవడం

చిన్న వెన్నునొప్పి లేదా మోకాళ్ల నొప్పులు వస్తే వారాల తరబడి అలాగే ఉండిపోతాయి. ఆర్థరైటిస్ లేదా కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం వల్ల ఇవి దీర్ఘకాలికంగా మారతాయి. ఎముకలు కూడా బలహీనంగా మారతాయి.

అయితే.. మన శరీరంలో కనిపించే ఈ మార్పులను చూసి భయపడాల్సిన పనిలేదు. కానీ "వయసు ప్రభావం" అని నిర్లక్ష్యం చేయకుండా.. హెల్దీ డైట్, వ్యాయామం, సరైన డాక్టర్ సలహాతో మనల్ని మనం కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Pillow: మీ దిండ్లు పసుపు రంగులోకి మారిపోయాయా?రూ.10ఖర్చుతో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు
Recommended image2
ఒక్కసారి ఈ గుడికి వెళ్లి పూజ చేస్తే...మీ కారుకు ప్రమాదమే జరగదు, ఈ గుడి ఎక్కడ ఉంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved