MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dmart: డీమార్ట్ లో సరుకులు కొంటున్నారా? ఇవి బల్క్ లో కొంటే..మీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే..!

Dmart: డీమార్ట్ లో సరుకులు కొంటున్నారా? ఇవి బల్క్ లో కొంటే..మీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే..!

Dmart: నెలవారీ సరుకులు డీమార్ట్ లో కొంటున్నారా? ఒకేసారి బల్క్ లో కొనుగోలు చేస్తున్నారా? అయితే, కొన్ని వస్తువుల విషయంలో మాత్రం ఆ పొరపాటు చేయకూడదు. వేటిని ఎక్కువ క్వాంటిటీలో కొనకూడదో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 31 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Dmart Shopping
Image Credit : gemini ai

Dmart Shopping

ఈ రోజుల్లో ఇంట్లోకి నెలవారీ సరుకులు కావాలి అంటే దాదాపు అందరూ డీమార్ట్ లేదా ఏదైనా సూపర్ మార్కెట్ కే వెళ్లిపోతున్నారు. ఆ స్టోర్స్ లో నిత్యం ఏవో ఒక ఆఫర్లు ఉంటూనే ఉంటాయి. 20శాతం ఆఫర్, బై 1 గెట్ 1 ఫ్రీ అనే బోర్డులు మనల్ని చాలా ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఆ ఆఫర్లు చూసి డబ్బులు మిగులుతాయి కదా అని.. అవసరం ఉన్నా లేకున్నా చాలా మంది.. ప్రతి వస్తువును కేజీలకు కేజీలు, ప్యాకెట్లకు ప్యాకెట్లు బల్క్ గా కొనేస్తుంటారు. సరుకుల కోసం పదే పదే షాప్ కి వెళ్లే పని తప్పుతుంది కదా, ఆఫర్ లో తక్కువకి వస్తున్నాయని.. కొన్ని సరుకులను బల్క్ లో ఎప్పుడూ కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల డబ్బులు ఆదా అవ్వడం అటునుంచి, అవి పాడైపోయి చెత్తబుట్టలో పారేయాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తాజా వస్తువులు...
Image Credit : Asianet News

తాజా వస్తువులు...

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, పాలు, కూరగాయలు కొనుక్కోవడంలో తప్పు లేదు.కానీ, వీటని బల్క్ లో అస్సలు కొనకూడదు. తక్కువ ధరకు వస్తున్నాయని పెద్ద సంచి నిండా యాపిల్స్, టమాటలు, పాలు, పెరుగు లాంటివి కొనుగోలు చేస్తే.. అవి తొందరగా పాడైపోతాయి. ఇవి చాలా తొందరగా పాడైపోతాయి కాబట్టి.. అవసరం అయినంత వరకు మాత్రమే కొనుక్కోవాలి, అయిపోయాకక మళ్లీ తాజాగా కొని తెచ్చుకోవడం తెలివైన పని.

మసాలా దినుసులు...

మన భారతీయ వంటకాల్లో మసాలా దినసులు ఎంత కీలకమో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, మసాలాలకు కూడా ఎక్స్ పైరీ డేట్ కూడా ఉంటుంది. మనం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి.. ఇంట్లో డబ్బాల్లో నిల్వ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సరిగా నిల్వ చేయకపోతే.. మసాలాలు తమ రుచిని, సువాసన కోల్పోతాయి. అందుకే, వీటిని కూడా ఎక్కువ క్వాంటిటీలో కొనుగోలు చేయకూడదు.

34
వంట నూనె...
Image Credit : DMart

వంట నూనె...

వంట నూనెలను బల్క్‌గా కొని తెచ్చుకుంటే నిల్వ చేసుకోవడం మంచిది కాదు. అన్ని రకాల ఆయిల్స్ కాలక్రమేణా పాడైపోతాయి. మీ ఇంట్లోని నూనె పాడైందో లేదో తెలుసుకోవడానికి ఒక స్పూన్ ఆయిల్ తీసి వాసన చూడండి. అది మెటల్స్ లేదా క్రేయాన్స్ వాసన వస్తుంటే అది పాడైపోయినట్లే. అందుకే నూనెలను ఎప్పటికప్పుడు చిన్న ప్యాకెట్లలో కొనుక్కోవడం శ్రేయస్కరం.

4. కోడిగుడ్లు

పోషకాలు నిండిన కోడిగుడ్లు సాధారణంగా తక్కువ ధరకే లభిస్తాయి, ట్రేల రూపంలో కొంటే ఇంకా చౌకగా అనిపిస్తాయి. కానీ గుడ్లు కూడా త్వరగా పాడైపోతాయి. అధికారిక 'Ask USDA' సమాచారం ప్రకారం.. ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లు గరిష్టంగా 5 వారాల వరకు మాత్రమే తాజాగా ఉంటాయి. కాబట్టి ఆఫర్ ఉందని డజన్ల కొద్దీ కొని ఫ్రిజ్‌లో పెట్టేయడం సరికాదు.

44
కూల్ డ్రింక్స్..
Image Credit : Gemini AI

కూల్ డ్రింక్స్..

బిగ్ మార్కెట్లలో కూల్ డ్రింక్స్‌పై ఎప్పుడూ "బై 1 గెట్ 1" ఆఫర్లు దర్శనమిస్తుంటాయి. కానీ వీటిని బల్క్‌గా కొనడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కూల్ డ్రింక్స్‌లో గ్యాస్ (Fizz), తాజా రుచి ఉండాలంటే వాటిని ఎల్లప్పుడూ చల్లగా నిల్వ చేయాలి. ఎక్కువ బాటిళ్లు కొంటే ఫ్రిజ్‌లో స్థలం సరిపోక ఇబ్బంది పడాల్సి వస్తుంది, పైగా త్వరగా తాగేయాలనే ఒత్తిడి పెరుగుతుంది.

పిండి.. 

మనం ఇంట్లో గోధుమ పిండి వాడినట్లుగా ఇతర మొక్కజొన్న పిండి, బియ్యం పిండి వాడం. ఈ పిండి పదార్థాలు గాలిలోని తేమను త్వరగా పీల్చుకుని బూజు పట్టడం లేదా వాసన రావడం జరుగుతుంది. వీటిని ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేయవచ్చు కానీ.. బల్క్‌గా కొంటే ఫ్రిజ్ అంతా వీటితోనే నిండిపోతుంది.

అందుకే, వస్తువులు ఆఫర్ లో వస్తున్నాయి అని ఎగబడి కొనే ముందు.. వాటిని మనం ఎంతకాలంలో వాడగలమో ఆలోచించడం చాలా అవసరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Arranged Marriage: అరేంజ్ట్ మ్యారేజీలో ఈ విషయాలే గొడవలకు కారణం
Recommended image2
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Recommended image3
హైద‌రాబాద్‌లో మాత్ర‌మే ల‌భించే స్పెష‌ల్ ఫుడ్‌.. లుఖ్నీని ఎప్పుడైనా ట్రై చేశారా.?
Related Stories
Recommended image1
Kitchen Hacks: కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా? చిటికెలో సరిచేసే సీక్రెట్ టిప్స్
Recommended image2
Vodka: వోడ్కా లో నీళ్లు ఎందుకు కలపరు..? అసలు వోడ్కానీ దేనితో తయారు చేస్తారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved