MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Chicken Shop: చికెన్ బొక్కలు.. పీకేసిన ఈకలు..ఏముందక్కడ..? దీనికి అవార్డా..?

Chicken Shop: చికెన్ బొక్కలు.. పీకేసిన ఈకలు..ఏముందక్కడ..? దీనికి అవార్డా..?

Chicken Shop:  ఫేమస్ ఫోటో గ్రాఫర్లు తీసే ఫోటోలకు ఎంత క్రేజ్ ఉంటుందో స్పెషల్ గా చెప్పకర్లేదు.  వాళ్లు తీసే ఫోటోలు చాలా అందంగా, అద్భుతంగా ఉంటాయి. కానీ, ఓ  ఫోటో గ్రాఫర్ రోడ్డు మీద కనిపించిన చికెన్ షాప్ ఫోటో తీస్తే దానికి అవార్డు వచ్చింది అంటే నమ్ముతారా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 09 2026, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చికెన్ బొక్కలు... పీకేసిన ఈకలు దానికి అవార్డా?
Image Credit : julia denin

చికెన్ బొక్కలు... పీకేసిన ఈకలు దానికి అవార్డా?

చికెన్ షాపు అంటే గుర్తొచ్చేది ఏంటి? చికెన్ కొట్టే వ్యక్తి, పీకేసిన ఈకలు, ఎముకలు, రక్తం, పేగులు అవే కదా. చాలామందికి చికెన్ అంటే ఎంత ప్రాణమైనా ఉండనీ దాని చుట్టుపక్కలకి వెళ్లడానికే ఇష్టపడరు.ఎంత శుభ్రంగా కట్ చేయని ఆ వాసన తట్టుకోవడం కష్టమే. ఇక ఆ రక్తం, పేగులు చూస్తే కడుపులో తిప్పడం ఖాయం. ఎప్పటికప్పుడు షాపులో శుభ్రం చేసినా దరిదాపుల్లోకి వెళ్లం బాబోయ్ అనేవాళ్లే ఎక్కువ. అలాంటిది రోడ్డు పక్కన కట్ చేసే వాటి సంగతి వేరే చెప్పాలా?

ఈకలన్నీ అక్కడే పోగుపడి ఉంటాయి. రక్తం ఆ పక్కనే పారుతూ ఉంటుంది. పనికిరాని ముక్కలు, పేగులు, పక్కనే బోనులో బిక్కుబిక్కుమంటూ ఉండే కోళ్లు... ఇక ఆ గందరగోళం సంగతి వేరే చెప్పాలా?

దీనిలో ఏదైనా అద్భుతం కనిపించిందా? కానీ ఓ పోటీలో న్యాయనిర్ణేతలను మెప్పించిందంటే నమ్ముతారా? నిజమండీ బాబు. రోడ్డు పక్కన ఒకతను చికెన్ కొడుతుంటే ఫొటో తీసిందో అమ్మాయి. దాన్ని వావ్ అంటూ మెచ్చుకోవడమే కాదు, ప్రత్యేక అవార్డునీ ప్రకటించారు. సందుకో చికెన్ షాపు. అడుగడుగునా ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్ని చూస్తాం? దానిలో వాళ్లని అంతగా మెప్పించిందేముంది అన్న సందేహం వచ్చే ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎవరు ఈ ఫోటోగ్రాఫర్..
Image Credit : julia denin

ఎవరు ఈ ఫోటోగ్రాఫర్..

ముందు అది తీసిన అమ్మాయి గురించి తెలుసుకుందాం. ఆమె పేరు జులియా డునిన్. మనమ్మాయి కాదులెండి. ఐర్లాండ్ అమ్మాయి. ఫొటో అంటే మనుషులు, ప్రదేశాలే కాదు. అదీ ఎన్నో విషయాలు చెబుతుందని ఈమె నమ్మకం. అందుకే తనకు నచ్చిన పనినే చేయడం ప్రారంభించింది. అయ్యో పాపం ఫొటోగ్రాఫరా అన్న జాలి అక్కర్లేదు. పెద్ద పెద్ద బ్యూటీ బ్రాండ్లు, హోటల్లు, మోడళ్లు ఈమె కస్టమర్లు. బ్యూటీ మ్యాగజీన్లకీ పని చేస్తుంది. ఇక పోటీల సంగతైతే చెప్పనే అక్కర్లేదు బోలెడు అందుకుంది.

ఇలాంటి ఫొటోగ్రాఫరంటే ఒక స్టూడియో పెట్టుకుని కూర్చోరుగా. దేశదేశాలు తిరుగుతారు. అలాగే ఈమె కూడా 2019లో ఇండియా... ఇంకా చెప్పాలంటే కోల్ కతాకి వచ్చింది. అయితే ఓ మంచి పనికోసం లెండి. ద హోప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ఛారిటీ కోసం వచ్చింది. ఈ సంస్థ వీధి బాలలకోసం పనిచేస్తుంది. అలా వచ్చిన ఆమె డాక్యుమెంటరీలో భాగంగా ఇక్కడి జనాల జీవనం, ఆహారం, సంస్కృతి తెలిసేలా ఎన్నో ఫొటోలు తీసింది. అప్పుడు తీసిన ఫొటోల్లో ఈ చికెన్ కొట్టుదీ ఒకటన్నమాట.

Related Articles

Related image1
Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?
Related image2
Chicken Gravy Curry: ఫుల్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ.. ఇలా చేసి తింటే.. దీని రుచి జన్మలో మర్చిపోలేరు..!
33
చికెన్ షాప్ ఫోటోకి ప్రపంచ గుర్తింపు..
Image Credit : julia denin

చికెన్ షాప్ ఫోటోకి ప్రపంచ గుర్తింపు..

దాన్ని వరల్డ్ ఫుడ్ ఫొటోగ్రఫీ పోటీలకు పంపింది జులియా. ప్రపంచంలోనే పేరున్న ఫుడ్ ఫొటోగ్రఫీల్లో దీన్నీ ఒకదానిగా చెబుతారు. ఫుడ్ ఫర్ సేల్ విభాగంలో పంపితే ఎంపికైంది. అందరినీ మెప్పించడమే కాదు, ప్రత్యేక అవార్డునీ అందుకుంది. ఇక్కడ మనం ఓ వ్యక్తినీ, చుట్టుపక్కల చెత్తనీ చూశాం. కానీ.. జడ్జిలు చూసింది వేరు. అది ఒక వ్యక్తి జీవితం. అతను శ్రమ పడితే వేరే వాళ్ల పళ్లెంలోకి ఆ చికెన్ వెళ్తుంది. అతని, ఆ కుటుంబం కడుపు నిండుతుంది. ఇంత లోతైన అర్థాన్ని చూశారు కాబట్టే, వేలమందిని దాటి జులియా తీసిన ఈ ఫొటోకి అవార్డు ఇచ్చారు. ప్రత్యేకంగా అభినందించారు. చూశారా మనం రోజూ సర్వసాధారణంగా చూసే దానిలో ఎంత గొప్ప జీవిత సత్యం దాగుందో?

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Necklace: లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో!
Recommended image2
Washing Machine:వాషింగ్ మెషిన్‌లో ఐస్ క్యూబ్స్ వేస్తే.. బట్టలు ముడతలు పడవా?
Recommended image3
పెళ్లయిన మహిళలు నుదుటిన సింధూరం ఎందుకు పెట్టుకుంటారు?
Related Stories
Recommended image1
Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?
Recommended image2
Chicken Gravy Curry: ఫుల్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ.. ఇలా చేసి తింటే.. దీని రుచి జన్మలో మర్చిపోలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved