Kitchen Tips: వంట గదిలో నూనె కింద పడిందా..? ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
kitchen tips: కిచెన్ లో నూనె పొరపాటున పడిపోయిందా? ఆ నూనె తొలగించడం కష్టంగా ఉందా? అయితే… సింపుల్ చిట్కాలను ఉపయోగించి.. శుభ్రం చేయవచ్చు. మరి.. ఆ సింపుల్ చిట్కాలేంటో చూద్దామాా…

Kitchen tips
వంట గదిలో మనం వంట చేస్తున్న సమయంలో ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా, ఒక్కోసారి కిచెన్ ప్లాట్ ఫాం మీద, కింద టైల్స్ మీద నూనె పడిపోతూ ఉంటుంది. అలా కింద పడిపోయిన నూనె ను శుభ్రం చేయడం అంత సులువేమీ కాదు. చాలా మంది... ఏదైనా పేపర్ లేదా.. వస్త్రంతో తుడవడానికి ప్రయత్నిస్తారు. దాని వల్ల పూర్తిగా నూనెను శుభ్రం చేయలేం. కానీ.. కొన్ని సింపుల్ చిట్కాలతో పోలిస్తే... ఈ నూనె మరకలను చాలా ఈజీగా శుభ్రం చేయవచ్చు. ఆ టిప్స్ ఏంటో చూద్దాం....
ఉప్పు...
మీ వంట గది కౌంటర్ లో లేదా... కింద టైల్స్ మీద నూనె పడిపోతే...మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉప్పు ఉన్నా చాలు. మెత్తని ఉప్పును ఆ నూనె పడిన చోట వేయాలి. కాసేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత... ఆ నూనె మీద ఉన్న ఉప్పును ఒక వస్త్రం లేదా.. టిష్యూ పేపర్ ని ఉపయోగించి.. శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల.. ఉప్పుతో పాటు.. నూనె కూడా పూర్తిగా తొలగించగలం. నూనె పూర్తిగా తొలగించగలం.
బేకింగ్ సోడా..
ఉప్పు వేసిన తర్వాత, ఆ ప్రదేశంపై బేకింగ్ సోడా చల్లి వదిలేస్తే నూనె పూర్తిగా పీల్చేసి, మిగిలిన వాసన, మచ్చలను కూడా తొలగిస్తుంది.
వెనిగర్...
ఉప్పుతో శుభ్రం చేసిన తర్వాత, కొద్దిగా వినిగర్‌ను నీటితో కలిపి స్ప్రే చేసి తుడిస్తే, టైల్స్ మళ్లీ మెరిసిపోతాయి.
నిమ్మరసం...
నూనె మరకలపై నిమ్మరసం రాస్తే, అది డీగ్రీసర్‌గా (oil remover) పనిచేస్తుంది. శుభ్రం చేసిన తర్వాత మంచి ఫ్రెష్ వాసన కూడా వస్తుంది.
మైదా లేదా పిండి
ఉప్పు లేనప్పుడు సాధారణ మైదా లేదా పిండి ఉపయోగించినా అదే ఫలితం వస్తుంది. నూనెను వెంటనే పీల్చేసి, తుడిచేస్తుంది. నూనె పడిన వెంటనే చర్య తీసుకోవడం మంచిది. ఎక్కువ సేపు వదిలేస్తే మచ్చలు గట్టిపడి శుభ్రం చేయడం కష్టమవుతుంది.