MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gardening
  • Home Maintenance Tips: సమ్మర్ ఇంటి మెయింటెనెన్స్ ప్లాన్ చేసుకున్నారా? ఈ టిప్స్ మిస్ అవ్వొద్దు

Home Maintenance Tips: సమ్మర్ ఇంటి మెయింటెనెన్స్ ప్లాన్ చేసుకున్నారా? ఈ టిప్స్ మిస్ అవ్వొద్దు

Home Maintenance Tips: సమ్మర్ లో ఆరోగ్యం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో..ఇంటి మెయింటెనెన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్త అవసరం. లేదంటే సమ్మరంతా అన్ కంఫర్ట్ బుల్ గా ఉంటుంది. సో వేసవి వేడి నుంచి ఎలా బయటపడాలో కొన్ని సింపుల్ టిప్స్ చూసేద్దామా? 

2 Min read
Author : Nandini Arava
Published : Feb 27 2026, 10:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సమ్మర్ లో ఇంటి మెయింటెనెన్స్ పై ఒత్తిడి
Image Credit : Getty

సమ్మర్ లో ఇంటి మెయింటెనెన్స్ పై ఒత్తిడి

సమ్మర్ వచ్చిందంటే కుటుంబంతో సమయం గడపడానికి మంచి సీజన్ అయినప్పటికీ, అదే సమయంలో ఇంటిపై అదనపు ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ఎండ తీవ్రత, అధిక తేమ, అకస్మాత్తుగా వచ్చే వర్షాలు, ఇవన్నీ కలిసి ఇంటి పైకప్పు నుంచి లోపలి గదుల వరకు ప్రభావం చూపవచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న సమస్యలు పెద్ద ఖర్చులుగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ మెయింటెనెన్స్ తీసుకుంటే వేసవిలో ఇల్లు సేఫ్‌గా, కంఫర్టబుల్‌గా ఉంచుకోవచ్చు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
AC ఫిల్టర్లు క్లీనింగ్ చేయాలి
Image Credit : Getty

AC ఫిల్టర్లు క్లీనింగ్ చేయాలి

మొదటగా పైకప్పు, గట్టర్లను పరిశీలించడం చాలా ముఖ్యం. వేసవిలో గాలివానలు, తుపానులు వస్తే పైకప్పులో ఉన్న చిన్న డ్యామేజ్ కూడా పెద్ద లీక్‌గా మారవచ్చు. పగుళ్లు, దెబ్బతిన్న షింగిల్స్, లూజ్ భాగాలు ఉన్నాయో లేదో చూడాలి. అలాగే గట్టర్లు క్లాగ్ అయ్యి ఉంటే వర్షపు నీరు సరిగ్గా డ్రెయిన్ కాక గోడలకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి గట్టర్లను క్లియర్ చేయడం అవసరం.

వేసవిలో ఎక్కువగా పని చేసే సిస్టమ్ ఎయిర్ కండిషనింగ్. AC ఫిల్టర్లు డస్ట్‌తో నిండిపోతే గాలి ప్రవాహం తగ్గి, కరెంట్ బిల్లు పెరుగుతుంది. నెలకు ఒకసారి ఫిల్టర్లను క్లీనింగ్ చేయడం లేదా అవసరమైతే రీప్లేస్ చేయడం మంచిది. టెక్నీషియన్‌తో సర్వీస్ చేయిస్తే పెద్ద సమస్యలను నివారించవచ్చు.

Related Articles

Related image1
Home Hacks: ఖాళీ బియ్యం సంచుల‌ను ప‌డేస్తున్నారా.? ఇలా చేస్తే అంద‌మైన బ్యాగులు ర‌డీ
Related image2
Home Decor: ఇల్లు చిన్న‌గా ఉంద‌ని బాధ‌ప‌డుతున్నారా.? ఇలా చేస్తే రిచ్ లుక్ ఖాయం
36
వేసవిలో దోమలు, పురుగుల బెడద
Image Credit : our own

వేసవిలో దోమలు, పురుగుల బెడద

ప్లంబింగ్ సిస్టమ్ కూడా వేసవిలో దెబ్బతింటుంది. పైపులు, ట్యాపులు, టాయిలెట్లలో చిన్న లీక్ ఉన్నా వెంటనే ఫిక్స్ చేయాలి. కాలువల్లో చెత్త పేరుకుపోతే డ్రెయిన్ సమస్యలు వస్తాయి. ముందుగానే క్లీనింగ్ చేయించడం మంచిది. లేకపోతే చిన్న రిపేర్‌ కూడా తర్వాత భారీ ఖర్చు అవుతుంది.

వేసవి కాలంలో దోమలు, పురుగులు పుట్టుకొస్తాయి. కిటికీలు, తలుపుల దగ్గర గ్యాప్‌లు ఉంటే పురుగులు లోపలికి రావచ్చు. వాటిని సీల్ చేయాలి. ఇంట్లో తిండిపదార్థాలు కిందపడకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచాలి.

46
పవర్ వాష్ తో ఇంటికి ఫ్రెష్ లుక్
Image Credit : Getty

పవర్ వాష్ తో ఇంటికి ఫ్రెష్ లుక్

ఇంటి ఎక్స్‌టీరియర్‌ను పవర్ వాష్ చేయడం వల్ల మురికి, బూజు తొలగిపోతాయి.ఇది ఇంటికి ఫ్రెష్ లుక్ ఇస్తుంది. అదే సమయంలో బూజు తగ్గి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వేసవి ప్రారంభంలో ఒకసారి పవర్ వాష్ చేయించడం మంచిది.

ఇన్సులేషన్ కూడా చెక్ చేయాలి. గోడల్లో గ్యాప్‌లు ఉంటే చల్లని గాలి బయటకు పోతుంది. సరైన ఇన్సులేషన్ ఉంటే ఇంటి లోపల టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఖర్చు తగ్గుతుంది. అవసరమైతే అదనపు ఇన్సులేషన్ పెట్టించాలి.

56
గార్డెన్ మెయింటెనెన్స్ కూడా ముఖ్యం
Image Credit : Getty

గార్డెన్ మెయింటెనెన్స్ కూడా ముఖ్యం

గార్డెన్ మెయింటెనెన్స్ కూడా ముఖ్యం. కలుపు మొక్కలు తీసేయాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అలా చేసుకుంటే అవుట్ డోర్ కూడా ఆకర్షణగా ఉంటుంది.

కిటికీలు క్లీనింగ్ చేయడం ద్వారా గాలి, వెలుతురు లోపలికి వస్తుంది. విండో స్క్రీన్‌లు డ్యామేజ్ అయ్యి ఉంటే మార్చాలి. లేకపోతే గాలి సరిగా రాదు. కీటకాలు లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. 

66
ముందస్తు ప్లానింగ్ తో కంఫర్ట్ బుల్ సమ్మర్
Image Credit : Getty

ముందస్తు ప్లానింగ్ తో కంఫర్ట్ బుల్ సమ్మర్

స్విమ్మింగ్ పూల్ ఉన్నవారు రెగ్యులర్‌గా చెత్త తొలగించి నీటి pH, క్లోరిన్ స్థాయిలను చెక్ చేయాలి. సరైన మెయింటెనెన్స్ ఉంటే వేసవి అంతా సేఫ్‌గా ఉపయోగించుకోవచ్చు.

సీలింగ్ ఫ్యాన్‌లను రివర్స్ చేసి పెట్టుకోవాలి. అలా సెట్ చేస్తే గదిలో కూలింగ్ ఎఫెక్ట్ పెరుగుతుంది. దీని వల్ల AC పై ఆధారపడటం తగ్గి ఎలక్ట్రిసిటీ సేవింగ్ అవుతుంది.

ఈ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వేసవి కాలంలో ఇల్లు సురక్షితంగా, శుభ్రంగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. చిన్న మెయింటెనెన్స్ పనులు పెద్ద సమస్యలను ముందుగానే తగ్గించేస్తాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రూల్స్ స్టార్ట్ చేసేయండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
తోటపని

Latest Videos
Recommended Stories
Recommended image1
Home Decor: పాత బొమ్మలని పారేయకండి..ఇలా చేస్తే వింటేజ్ లుక్ తో మీ ఇల్లు అదిరిపోద్ది
Recommended image2
US Garden Rules: అమెరికాలో గార్డెన్‌లో ఈ పనులు చేస్తే...భారీ జరిమానా కట్టాల్సిందే
Recommended image3
Plants: ఈ మొక్కలు కిచెన్ లో పెడితే.. దుర్వాసన అనేదే ఉండదు..!
Related Stories
Recommended image1
Home Hacks: ఖాళీ బియ్యం సంచుల‌ను ప‌డేస్తున్నారా.? ఇలా చేస్తే అంద‌మైన బ్యాగులు ర‌డీ
Recommended image2
Home Decor: ఇల్లు చిన్న‌గా ఉంద‌ని బాధ‌ప‌డుతున్నారా.? ఇలా చేస్తే రిచ్ లుక్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved