MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Milk Spoilage: వేసవిలో పాలు విరిగిపోకుండా ఈ చిన్న చిట్కాలు ఉపయోగపడతాయి

Milk Spoilage: వేసవిలో పాలు విరిగిపోకుండా ఈ చిన్న చిట్కాలు ఉపయోగపడతాయి

Milk Spoilage:  వేసవిలో పాలు త్వరగా పాడైపోతాయి. మరగబెట్టిన పాలైనా, పచ్చి పాలైనా కూడా త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో పాలు విరగకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 10 2026, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేసవిలో పాలు విరిగిపోతాయి
Image Credit : Getty

వేసవిలో పాలు విరిగిపోతాయి

ఎండాకాలం వచ్చిందంటే వాతావరణంలో వేడి పెరుగుతుంది. దీంతో  పాలు చాలా త్వరగా పాడైపోతాయి.  షాపులో డేట్ చూసి తెచ్చినా కూడా కొన్నిసార్లు పాలు విరిగిపోతాయి. దీంతో డబ్బులు వేస్ట్ అవ్వడమే కాకుండా సమయానికి పిల్లలు పాలు తాగించలేరు. పెద్దలు టీ చేసుకుని తాగలేరు. కాబట్టి వేసవిలో ప్రత్యేకంగా కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పాలు త్వరగా విరగకుండా అడ్డుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాలు తెచ్చాక ఇలా చేయండి
Image Credit : istockphoto

పాలు తెచ్చాక ఇలా చేయండి

షాపు నుంచి పాలు ప్యాకెట్ తెచ్చాక వాటిని కిచెన్ కౌంటర్‌పైనే వదిలేయకండి. చాలా మంది ఇప్పుడే కదా తెచ్చాము అని ఎక్కువసేపు అలా కిచెన్ కౌంటర్ దగ్గరే వదిలేస్తారు. వేసవి వేడికి కాసేపు బయట ఉంచినా పాలలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అందుకే, పాల ప్యాకెట్‌ను వెంటనే చల్లటి నీటితో కడిగి, వీలైనంత త్వరగా మరిగించాలి. దీంతో పాలు త్వరగా విరగవు.

34
ఒక్క పొంగురాగానే
Image Credit : istockphoto

ఒక్క పొంగురాగానే

చాలా మంది పాలు ఒక పొంగు రాగానే ఆపేస్తారు.  అలా పాలు ఇలా  పొంగు రాగానే ఆపేయకూడదు. పాలు ఒక పొంగు వచ్చాక మంట తగ్గించి రెండు నుంచి మూడు నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి మరిగించాలి. ఇలా చేయడం వల్ల పాలలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా పూర్తిగా నశించి పోతుంది. కాబట్టి పాలు విరగవు. పాలు కాచేటప్పుడు గరిటెతో నెమ్మదిగా తిప్పుతూ ఉండడం వల్ల కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి.

44
వేడి పాలు ఫ్రిజ్ లో
Image Credit : pinterest

వేడి పాలు ఫ్రిజ్ లో

పాలు మరగబెట్టాక పూర్తిగా వాటిని చల్లారనివ్వాలి. కానీ చాలామంది వేడి పాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. దీనివల్ల ఫ్రిజ్ ఉష్ణోగ్రతపై ప్రభావం పడి పాలు పాడయ్యే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, పాలను ముందు గది ఉష్ణోగ్రతకు వద్దకు చల్లారనివ్వాలి, ఆ తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. 

పాలు విరిగిపోవడానికి మరో కారణం మురికిగా ఉన్న సరిగ్గా శుభ్రం చేయని గిన్నె కూడా కారణం కావచ్చు. అందుకే పాలు మరగబెట్టే ముందు గిన్నెను శుభ్రంగా కడగాలి. శుభ్రమైన గిన్నెతో పాటూ, సరైన నిల్వ పద్ధతితో పాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dark Circles: రోజూ ఇదొక్కటి రాసినా కంటి కింద డార్క్ సర్కిల్స్ మాయం
Recommended image2
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సింపుల్ రెమిడీ ట్రై చేయండి
Recommended image3
Hair Brush: దువ్వెన ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి? నెలల తరబడి ఒకే దువ్వెన వాడితే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు IAS, IPS వంటి పెద్ద ప్రభుత్వోద్యోగాలు సాధించే అవకాశం ఎక్కువ
Recommended image2
Mint Plant: చిన్న కుండీలో గుత్తులుగుత్తులుగా పుదీనా పెంచండిలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved