MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual: దేవుడికి ఏ పండు నైవేద్యంగా పెడితే.. ఎలాంటి ప్రతిఫలం లభిస్తుందో తెలుసా?

Spiritual: దేవుడికి ఏ పండు నైవేద్యంగా పెడితే.. ఎలాంటి ప్రతిఫలం లభిస్తుందో తెలుసా?

Spiritual: దేవుడికి పూజ చేసినప్పుడు, గుడికి వెళ్లినప్పుడు.. ఆ స్వామికి నైవేద్యంగా పండ్లు,పలహారాలను పెడుతూ ఉంటాం. అయితే.. మనం పెట్టే నైవేద్యం మన తలరాతను మార్చేస్తుందని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 10 2026, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Spiritual
Image Credit : others

Spiritual

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, పూజలో దేవుడికి ఫలం సమర్పించడం అనేది మనం చేసే కర్మకు లభించే ప్రతిఫలానికి ప్రతీకగా పరిగణిస్తారు. చాలా మంది.. దేవుడికి పెట్టే పండు, ప్రసాదం విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ సమయానికి ఏది అందుబాటులో ఉంటే అది పెడుతూ ఉంటారు. కానీ.. మనం పెట్టే పండు ఆధారంగా మనకు ప్రతి ఫలం లభిస్తుంది. మరి.. ఏ పండును అందించడం వల్ల.. ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.కొబ్బరికాయ...
Image Credit : Getty

1.కొబ్బరికాయ...

మీరు దేవుడికి కొబ్బరికాయను సమర్పిస్తే.. మీరు మీ అహంకారాన్ని వదిలిపెట్టారు అని అర్థం. కొబ్బరికాయను మన అహంకారానికి చిహ్నంగా భావిస్తారు. దానిని పగలగొట్టడం అంటే మనసులోని అహంకారాన్ని దేవుడి ముందు సమర్పించి, మనసును నిర్మలంగా మార్చుకోవడం. ఏ శుభకార్యమైనా విఘ్నం లేకుండా జరగాలంటే కొబ్బరికాయ కొట్టాలి.

2.అరటిపండు..

దేవుడికి అరటి పండు సమర్పిస్తే.. వంశాభివృద్ధి, సంతాన ప్రాప్తిని కోరుకుంటున్నారని అర్థం. అరటి చెట్టు విత్తనం ద్వారా కాకుండా పిలకల ద్వారా విస్తరిస్తుంది. అందుకే.. ఇది వంశాభివృద్ధికి సంకేతం. ప్రతి పూజలోనూ అరటి పండును నైవేధ్యంగా పెడుతూ ఉంటారు.

34
3.దానిమ్మ పండు...
Image Credit : Getty

3.దానిమ్మ పండు...

దానిమ్మ పండును దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం అంటే.. మనం ధన లాభం, సంపద కోరుతున్నామని అర్థం. దానిమ్మ గింజలు సమృద్ధికి సంకేతం. లక్ష్మీదేవికి లేదా గణపతికి దానిమ్మ పండ్లను సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి.. ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు.

4.మామిడి పండు...

మామిడి పండును దేవుడికి సమర్పిస్తున్నామంటే.. జ్ఞానం , ఆనందం కోరుకుంటున్నామని అర్థం. మామిడి పండ్లను "ఫలరాజం" అంటారు. దీనిని నివేదించడం వల్ల ఇంట్లో సంతోషం నెలకుంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది.

44
5. యాపిల్...
Image Credit : Getty

5. యాపిల్...

యాపిల్ పండును దేవుడికి సమర్పిస్తే..ఆయురారోగ్యాలు కోరుకున్నట్లు. ఆరోగ్యం బాగుండాలని కోరుకునే వారు దేవుడికి యాపిల్ పండ్లను నైవేద్యంగా పెడతారు.

6.ద్రాక్ష పండ్లు...

ద్రాక్ష పండ్లు మధురమైన జీవితం, అపజయాల నుండి విముక్తి గా పరిగణిస్తారు. జీవితంలో ఉన్న చేదు అనుభవాలు తొలగిపోయి, తీపి జ్ఞాపకాలు మిగలాలని కోరుతూ ద్రాక్షను సమర్పిస్తారు.

ఏ దేవుడికి ఏ పండు ఇష్టం?

వినాయకుడు... వెలగపండు, నేరేడు పండు, అరటి పండు

మహాలక్ష్మి.. దానిమ్మ, వెలగపండు

శివుడు... మారేడు పండు( బిల్వ ఫలం)

హనుమంతుడు మామిడి పండు..

ముఖ్య గమనిక...

పూజలో పండ్లను సమర్పించేటప్పుడు అవి కుళ్లిపోయి ఉండకూడదు. అలాగే పండ్లను శుభ్రంగా కడిగి, పీచు లేదా మట్టి లేకుండా దేవుడికి నివేదించాలి. భక్తితో ఏ చిన్న పండు సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడు

పూజలో పండ్లు సమర్పించేటప్పుడు అవి కుళ్లిపోయి ఉండకూడదు. అలాగే పండ్లను శుభ్రంగా కడిగి, పీచు లేదా మట్టి లేకుండా దేవుడికి నివేదించాలి. భక్తితో ఏ చిన్న పండు సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Taurus Ugadi 2026: పరాభవ నామ సంవత్సర ఉగాది...వృషభ రాశి ఫ్యూచర్ ఎలా ఉండనుంది?
Recommended image2
Ugadi 2026: పరాభవ నామ ఉగాది... మిథున రాశివారికి ఈ ఏడాది ఎలా ఉండనుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved