చాలా మంది కీరదోస తొక్కను తీసి పడేస్తూ ఉంటారు. కానీ, ఆ తొక్కలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి.
కీరదోస తొక్క ఒక సహజమైన స్కిన్‌కేర్ లా పనిచేస్తుంది. తినడానికే కాదు, చర్మంపై దోసకాయ తొక్కతో రుద్దితే ఎర్రటి మచ్చలు తొలగిపోతాయి.
కీరదోస తొక్కలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటివి చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
కళ్లకు చల్లదనాన్ని ఇవ్వడానికి దోసకాయ తొక్క బాగా పనిచేస్తుంది. కళ్లపై తొక్కను పెట్టుకుంటే కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి.
దోసకాయ తొక్కలో కరగని ఫైబర్ (Insoluble Fiber) ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ కె, విటమిన్ సి దోసకాయ తొక్కలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి.
Soft Chapati: పిండిలో ఇదొక్కటి కలిపితే.. చపాతీలు మెత్తగా వస్తాయి
Kitchen Hacks: మటన్ కర్రీలో నూనె ఎక్కువైందా? ఈ చిట్కా వాడి చూడండి
Cardamom: భోజనం తర్వాత రోజూ యాలకులు తింటే ఏమౌతుంది?
Set Dosa: హోటల్ స్టైల్ స్పాంజిలాంటి సెట్ దోశ ఎలా చేయాలో తెలుసా?