MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kidney health: మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే..!

Kidney health: మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు ఇవే..!

Kidney health: అధిక రక్తపోటు, ఊబకాయం, లింగం, వయసు, స్మోకింగ్, మధుమేహం వంటివి మూత్రపిండాల వ్యాధులను పెంచుతాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 11 2022, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగాల్లో మూత్రపిండాలు ఒకటి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే  శరీరంలోని, రక్తంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయి. మన శరీరంలో ఉన్న అవయవాలు దెబ్బతింటే వాటిని రిపేర్ చేయొచ్చు.. ఒక్క మూత్రపిండాలను తప్ప. అలాంటి వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. 

28

కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇండియాలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారి సంఖ్య దశాబ్ద కాలంలో రెట్టింపు అయ్యిందని పలు సర్వేలు చెబుతున్నాయి. వయోజనులలో 8 నుంచి 10 శాతం మంది ఏదో ఒక మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారట. 
 

38

ఈ మూత్రపిండాల సమస్యలు రావడానికి అధిక రక్తపోటు, డయాబెటీస్ ప్రధాన కారకాలుగా ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే స్మోకింగ్, ఊబకాయం, లింగ్,  genetic, వయస్సు వంటివి కూడా మూత్రపిండాల సమస్యను పెంచుతాయని నిపుణులు  చెబుతున్నారు. మూత్రపిండాల వ్యాధితో భాదపడేవారు మంచి జీవన శైలిని, ఆరోగ్యకరమైన ఆహారాను తీసుకోవాలని చెబుతున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

48

క్యాబేజి (Cabbage)

క్యాబేజీలో ఖనిజాలు, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, కరగని ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాబేజీలో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువ మొత్తంలో ఉంటాయి. మొత్తంలో మూత్రపిండాల రోగాలతో బాధపడేవారికి క్యాబేజీ దివ్య ఔషదంగా పనిచేస్తుంది. 

58

కాలీఫ్లవర్ (Cauliflower) 

కాలీఫ్లవర్ లో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్ బి ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కె  వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన కాలీఫ్లవర్ ను తీసుకుంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.  దీన్ని సూప్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఉడికించిన కాలీఫ్లవర్ లో సోడియం 19 మి.గ్రాములుంటే, భాస్వరం 40 మి.గ్రా, పొటాషియం 176 మి.గ్రాములు ఉంటాయి. 

68

వెల్లుల్లి (Garlic)

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఉప్పుతో పాటుగా సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. వంటల్లో వీటిని వేయడం వల్ల కూరలు చాలా టేస్టీగా అవుతాయి. 9 గ్రాముల వెల్లుల్లిలో సోడియం 1.5 మి.గ్రా, భాస్వరం 14 మి.గ్రా, పొటాషియం 36 మి.గ్రాములు ఉంటాయి. 

78

ఎర్ర ద్రాక్ష (Red grapes)

తియ్యగా ఉండే ఈ పండర్లలో ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు దీనిలో ఉంటాయి. ఇవి మంటను తగ్గించడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 75 గ్రాముల ఎర్ర ద్రాక్షల్లో పొటాషియం 144 మి.గ్రా, సోడియం 1.5 మి.గ్రా, భాస్వరం 15 మి.గ్రాములు ఉంటాయి. వీటిని అలాగే తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. 
 

88

గుడ్డులోని తెల్లసొన (Egg whites)

గుడ్డులోని తెల సొన మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది. డయాలసిస్ చికిత్స చేయించుకున్నవారికి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. 66 గ్రాముల  తెల్లసొనలో పొటాషియం 108 మి.గ్రా, సోడియం 110 మి.గ్రా, భాస్వరం 10 మి.గ్రా ఉంటాయి. ఆమ్లేట్ వేసుకున్నా.. శాండ్ విచ్ లు చేసుకుని తిన్నా తెల్లసొననే ఉపయోగించండి. ఉడకబెట్టిన గుడ్లను తింటే  ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Chanakya niti: ఈ ఒక్క ప్రదేశంలోకి ఎప్పుడూ అడుగు పెట్టకండి, సంపాదించుకున్న గౌరవం ఒక్క క్షణంలో పోతుంది
Recommended image2
Ugadi 2026 Wishes Telugu: ఉగాదికి మీ బంధుమిత్రులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి
Recommended image3
Plastic Bottle: ప్లాస్టిక్ బాటిల్‍లో నీళ్లు తాగుతున్నారా? అవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved