MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair: రాత్రిపూట మీ జుట్టుకు ఈ రసాన్ని అప్లై చేయండి చాలు.. జుట్టు మందంగా పొడవుగా పెరిగేస్తుంది

Hair: రాత్రిపూట మీ జుట్టుకు ఈ రసాన్ని అప్లై చేయండి చాలు.. జుట్టు మందంగా పొడవుగా పెరిగేస్తుంది

Hair: జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వెల్లుల్లి, ఉల్లిపాయ.. ఈ రెండూ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి రెండూ కూడా తమ సొంత ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మీ జుట్టు ఎదుగుదలకు ఇవి సహాయ పడతాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 24 2025, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పొడవాటి జుట్టు కోసం
Image Credit : Pixabay

పొడవాటి జుట్టు కోసం

ప్రతి ఒక్కరికీ పొడవాటి జుట్టు కావాలనే కోరిక ఉంటుంది. అలాగే మందంగా, ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. కానీ దుమ్ము, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల జుట్టు అతిగా రాలిపోతుంది. దీనికి కొన్ని ఇంటి నివారణలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా వెల్లుల్లి రసం, ఉల్లిపాయ రసం అనేది జుట్టుకు అద్భుతంగా పనిచేస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఉల్లిపాయ రసంతో
Image Credit : Pixabay

ఉల్లిపాయ రసంతో

ప్రతి ఇంట్లోని ఉల్లిపాయ ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఉపయోగిస్తే ఎంతో మంచిది. ఇది జుట్టు రాలడం ఆపుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టును మూలాల నుండి బలంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే కొత్త జుట్టు పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసం తలలో రక్తప్రసరణను పెంచుతుంది. జుట్టుకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ఉల్లిపాయ రసాన్ని వారానికి రెండు మూడు సార్లు జుట్టుకు అప్లై చేసేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా రాత్రిపూట జుట్టుకు అప్లై చేసి అలా రాత్రంతా వదిలేయండి. ఆ తర్వాత ఉదయం లేచాక తలస్నానం చేయండి. ఇది జుట్టు నల్లగా మారేందుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

Related Articles

Related image1
అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
Related image2
Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? మందులు వాడకుండా ఇలా సహజంగా వచ్చేలా చేయచ్చు
34
వెల్లుల్లి రసంతో
Image Credit : Pixabay

వెల్లుల్లి రసంతో

వెల్లుల్లి రసం తీయడం కొంచెం కష్టమే.. కానీ అసాధ్యమేమీ కాదు. వెల్లుల్లి రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ రసంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది తలపై ఉండే మాడుని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. వెంట్రుకలను బలంగా మారుస్తుంది. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను తీసుకొని అందులో కాస్త వెల్లుల్లి రసాన్ని కలిపి నెత్తి మీద అప్లై చేసేందుకు ప్రయత్నించండి. ఇది జుట్టు మూలాలను బలంగా మారుస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపుతుంది.

44
రెండింట్లో ఏది బెటర్?
Image Credit : Pixabay

రెండింట్లో ఏది బెటర్?

ఉల్లిపాయ రసం, వెల్లుల్లి రసం ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమో.. దానినే జుట్టుకు అప్లై చేసేందుకు ప్రయత్నించండి. ఈ రెండూ కూడా ప్రభావవంతంగానే పనిచేస్తాయి. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. ఉల్లిపాయ రసం తక్కువ ధరకే ఎక్కువ లభిస్తుంది. కాబట్టి వీలైనంతవరకు ఉల్లిపాయ రసాన్ని వాడండి. లేదా వెల్లుల్లి రసం కూడా ప్రయోజనకరమే. చుండ్రు, తలపై ఇన్ఫెక్షన్లు వంటివి ఉంటే వెల్లుల్లి రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు మెరుగైన ఫలితాలు కావాలంటే ఉల్లిపాయ, వెల్లుల్లి ఈ రెండు రసాలను కలిపి తలకు పట్టించండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
సౌందర్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Secret Affairs: సీక్రెట్‌ ఎఫైర్లు పెట్టుకుంటున్న భార్యభర్తలు మనదేశంలో ఏ సిటీలో అధికంగా ఉన్నారో తెలుసా?
Recommended image2
Zip Blouse: జిప్ బ్లౌజ్ డిజైన్లు.. వేసుకోవడం చాలా ఈజీ
Recommended image3
Floral Mangalsutra: పూల డిజైన్ లాకెట్ తో నల్లపూసల గొలుసులు..చూసేయండి
Related Stories
Recommended image1
అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
Recommended image2
Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? మందులు వాడకుండా ఇలా సహజంగా వచ్చేలా చేయచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved